- 1888లో పీల్…2021లో అశ్విన్
- చెపాక్ స్టేడియంలో స్పిన్ జాదూ
- రెండో ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్
ఇంగ్లండ్ తో చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన తొలిటెస్టు నాలుగో రోజు ఆటలో భారత స్పిన్ జాదూ రవిచంద్రన్ అశ్విన్ రికార్డుల మోత మోగించాడు. కేవలం తనకు మాత్రమే సాధ్యమైన ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నాడు.
ఇంగ్లండ్ తొలిఇన్నింగ్స్ లో 55.1 ఓవర్లలో 146 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టిన అశ్విన్…రెండోఇన్నింగ్స్ లో మాత్రం పూర్తిస్థాయిలో రాణించాడు. 17.3 ఓవర్లలో 61 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్ ను 178 పరుగుల స్కోరుకే కుప్పకూల్చడంలో ప్రధానపాత్ర వహించాడు.
Also Read : రసపట్టులో చెన్నై టెస్టు
అప్పుడు పీల్, ఇప్పుడు అశ్విన్
ఇంగ్లండ్ రెండోఇన్నింగ్స్ లో… భారత కెప్టెన్ కొహ్లీ కొత్తబంతితో అశ్విన్ ను బౌలింగ్ కు దించాడు. ఇన్నింగ్స్ తొలిబంతికే ఓపెనర్ రోరీ బర్న్స్ ను అశ్విన్ డకౌట్ గా పడగొట్టాడు. గత వందేళ్లలో ఇన్నింగ్స్ తొలిబంతికే వికెట్ పడగొట్టిన తొలి స్పిన్ బౌలర్ గా రికార్డుల్లో చోటు సంపాదించాడు.
1888లో ఇంగ్లండ్ స్పిన్నర్ బాబీ పీల్ ఇన్నింగ్స్ తొలిబంతికే వికెట్ పడగొట్టిన తొలి స్పిన్నర్ గా నిలిచాడు. ఆ తర్వాత వందేళ్లకు అదే ఘనతను తన హోంగ్రౌండ్ చెన్నై చెపాక్ స్టేడియంలో రవిచంద్రన్ అశ్విన్ సొంతం చేసుకోగలిగాడు.
1907 లో సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ బెర్ట్ వోగ్లెర్ సైతం ఇన్నింగ్స్ తొలిబంతికే వికెట్ పడగొట్టిన బౌలర్ గా గుర్తింపు తెచ్చుకొన్నాడు.
Also Read : టెస్టు క్రికెట్లో మరో ప్రపంచ రికార్డు
28వసారి 5 వికెట్ల రికార్డు
ఓ ఇన్నింగ్స్ లో 5 లేదా ఐదుకు పైగా వికెట్లు పడగొట్టిన రికార్డును అశ్విన్ 28వసారి దక్కించుకొన్నాడు. తొలిఇన్నింగ్స్ లో బర్న్స్ , వోలీ పోపీ, జేమ్స్ యాండర్సన్ ల వికెట్లు పడగొట్టిన అశ్విన్…రెండో ఇన్నింగ్స్ లో ఓపెనర్లు బర్న్స్,సిబ్లే, స్టోక్స్, బెస్, ఆర్చర్, యాండర్సన్ లను పెవీలియన్ దారి పట్టించాడు.
20వేల 600 బాల్స్ తర్వాత నోబాల్
టెస్టుక్రికెట్లో అశ్విన్ పేరుతో మరో అరుదైన రికార్డు వచ్చి చేరింది. అశ్విన్ తన టెస్ట్ కెరియర్ లో మొట్టమొదటి నోబాల్ ను 20 వేల 600 బంతుల తర్వాత వేయటం విశేషం.
Also Read : చెన్నై టెస్టులో భారత్ ఎదురీత
తొలిఇన్నింగ్స్ లో 55.1 ఓవర్లు వేయటం ద్వారా 2011-21 సిరీస్ లో భాగంగా అడిలైడ్ ఓవల్ వేదికగా జరిగిన టెస్టులో అశ్విన్ వేసిన 53 ఓవర్ల రికార్డును తానే అధిగమించడం విశేషం.
తొలిఇన్నింగ్స్ లో 3 వికెట్లు, 31 పరుగుల స్కోరు సాధించిన అశ్విన్ …రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్లు పడగొట్టడం ద్వారా భారత్ కు తాను ఎంతటి విలువైన ఆటగాడినో చాటి చెప్పాడు.
Also Read : రూట్ డబుల్.. భారత్ కు ట్రబుల్