* 8 పరుగులతో గట్టెక్కిన భారత్
* 2-2తో సమఉజ్జీలుగా భారత్, ఇంగ్లండ్
ప్రపంచ క్రికెట్లో టీ-20 టాప్ ర్యాంక్ జట్ల సమరం నువ్వానేనా అన్నట్లుగా సాగుతోంది. ప్రస్తుత ఐదుమ్యాచ్ ల సిరీస్ నీకొకటి నాకొకటి అన్నతీరులో రసపట్టుగా జరుగుతోంది. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ముగిసిన నిర్ణయాత్మక నాలుగో మ్యాచ్ లో ఆతిథ్య భారత్ 8 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ను అధిగమించి 2-2తో సమఉజ్జీగా నిలిచింది.
ప్రస్తుత సిరీస్ లో తొలిసారిగా టాస్ ఓడిన మ్యాచ్ నెగ్గిన భారత్ విజయంలో ప్రధాన పాత్ర వహించిన సూర్యకుమార్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. సిరీస్ విజేతను నిర్ణయించే ఆఖరి టీ-20 అహ్మదాబాద్ వేదికగానే శనివారం జరుగుతుంది.
సూర్యకుమార్, చహార్ లకు చాన్స్
ప్రస్తుత సిరీస్ లో పడుతూ లేస్తూ టాప్ ర్యాంక్ ఇంగ్లండ్ తో సమఉజ్జీగా నిలుస్తూవచ్చిన భారత్…నెగ్గితీరాల్సిన నాలుగో మ్యాచ్ బరిలోకి రెండుమార్పులతో అడుగుపెట్టింది.
Also Read : ప్రో-బాక్సింగ్ లో సింగ్ ఈజ్ కింగ్
లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహాల్ , యువఆటగాడు ఇషాన్ కిషన్ లకు విశ్రాంతినిచ్చి…మరో లెగ్ స్పిన్నర్ రాహుల్ చహార్, ముంబై హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ లకు తుదిజట్టులో చోటు కల్పించింది.
టాస్ ఓడినా భారత్ భారీ స్కోరు
సిరీస్ లోని మొదటి మూడుమ్యాచ్ ల్లోనూ టాస్ఓడి ఫీల్డింగ్ ఎంచుకొన్న జట్లు మాత్రమే విజయాలు సాధించాయి. అయితే ఆ మ్యాచ్ లకు భిన్నంగా ఈ నాలుగో సమరంలో మాత్రం టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ మాత్రం భారీస్కోరుతో ఆ పరంపరకు స్వస్తి పలికింది.
రోహిత్- రాహుల్ లతో కలసి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 185 పరుగుల భారీస్కోరు నమోదు చేసింది. భారత ఓపెనింగ్ జోడీ మరోసారి చక్కటి ఆరంభాన్ని ఇవ్వడంలో విఫలమయ్యారు. 21 పరుగుల స్కోరు వద్ద భారత్ తొలివికెట్ నష్టపోయింది.
Also Read : లెజెండ్స్ సిరీస్ ఫైనల్లో భారత్
వైస్ కెప్టెన్ రోహిత్ 12, రాహుల్ 14, కెప్టెన్ కొహ్లీ ఒకే ఒక్క పరుగుకు వెనుదిరిగడంతో భారత్ 3 వికెట్లకు 70 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే …రెండోడౌన్లో బ్యాటింగ్ కు దిగిన సూర్యకుమార్ యాదవ్…వచ్చీరావడంతోనే సిక్సర్ తో విరుచుకుపడ్డాడు.
సూర్య ధూమ్ ధామ్
ఐపీఎల్ గత సీజన్లో ముంబై విజేతగా నిలవడంలో ప్రధానపాత్ర వహించిన సూర్యకుమార్ యాదవ్..తన రెండోఅంత్జాతీయ మ్యాచ్ లో దక్కిన అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొన్నాడు. తన అపారప్రతిభను మెరుపు హాఫ్ సెంచరీ ద్వారా బయటపెట్టాడు.
Also Read : భారత్ కు డూ ఆర్ డై
ఇంగ్లండ్ పేస్ ఎటాక్ ను అలవోకగా ఎదుర్కొంటూ పుల్, లాఫ్టెడ్ షాట్లతో పరుగులమోత మోగించాడు. కేవలం 31 బాల్స్ లోనే 6 బౌండ్రీలు, 3 సిక్సర్లతో తన తొలి అంతర్జాతీయ టీ-20 అర్థశతకం సాధించి… ఓ వివాదాస్పదమైన క్యాచ్ కు అవుటయ్యాడు.
సూర్యకుమార్ 57 పరుగులకే అవుటైనా…మిడిలార్డర్లో రిషభ్ పంత్ 30, శ్రేయస్ అయ్యర్ 37 పరుగులు సాధించడంతో భారత్ 185 పరుగుల భారీస్కోరు సాధించగలిగింది. ప్రస్తుత సిరీస్ లో ఓ జట్టు సాధించిన అత్యధిక స్కోరు ఇదే కావటం విశేషం. ఇంగ్లండ్ బౌలర్లలో ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ 4 వికెట్లు, కరెన్, రషీద్, స్టోక్స్ తలో వికెట్ పడగొట్టారు.
Also Read : డకౌట్ల హీరో రాహుల్ కు టీమ్ మేనేజ్ మెంట్ దన్ను
హార్థిక్ పాండ్యా షో
186 పరుగుల భారీలక్ష్యంతో చేజింగ్ కు దిగిన ఇంగ్లండ్ సైతం ప్రారంభఓవర్లలోనే సూపర్ ఓపెనర్ బట్లర్, వన్ డౌన్ డేవిడ్ మలాన్ వికెట్లు నష్టపోయి ఎదురీత మొదలుపెట్టింది. భారత పేసర్ హార్థిక్ పాండ్యా, లెగ్ స్పిన్నర్ రాహుల్ చహార్ కట్టుదిట్టంగా బౌల్ చేసి ఇంగ్లండ్ స్ట్ర్రోక్ మేకర్లను కట్టడి చేశారు. ఓపెనర్ జేసన్ రాయ్ 40, ఆల్ రౌండర్ స్టోక్స్ 46, ఆర్చర్ 18 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఇంగ్లండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 177 పరుగులు మాత్రమే చేయగలిగింది.
భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3వికెట్లు, రాహుల్ చహార్, పాండ్యా చెరో రెండు వికెట్లు, భువనేశ్వర్ కుమార్ 1 వికెట్ పడగొట్టారు. పాండ్యా తన కోటా 4 ఓవర్లలో 16 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టడం ద్వారా భారత విజయంలో ప్రధానపాత్ర వహించాడు.
భారత్ 9- ఇంగ్లండ్ 9
టీ-20 ఫార్మాట్లో టాప్ ర్యాంకర్ ఇంగ్లండ్, రెండోర్యాంకర్ భారత్…ప్రస్తుత సిరీస్ లోని మొదటి నాలుగుమ్యాచ్ ల వరకూ చెరో 9 మ్యాచ్ లు చొ్ప్పున నెగ్గి 9-9 తో సమఉజ్జీగా నిలిచాయి. సిరీస్ లోని ఆఖరాట..నరేంద్ర మోడీ స్టేడియం వేదికగానే శనివారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.
Also Read : కెప్టెన్ గా విరాట్ 11వ టీ-20 హాఫ్ సెంచరీ