Wednesday, December 25, 2024

జాతి హితమే ప్రథమం.. ఆర్​సెప్​కు నో చెప్పిన భారత్

  • దేశ ప్రయోజనాల విషయంలో రాజీ లేదన్న మోడీ
  • భారత్ చేరికపై సింగపూర్ ఆశాభావం
  • ఒప్పందం వల్ల వర్తకులు, రైతాంగానికి నష్టమన్న విపక్షాలు

ప్రపంచంలో అతిపెద్ద వాణిజ్య ఒప్పందం ఆర్ సెప్ ఓ కొలిక్కి వచ్చింది. ఈ వాణిజ్య ఒప్పందంపై 15 ఆసియా పసిఫిక్ దేశాలు సంతకాలు చేశాయి. దాదాపు ఎనిమిదేళ్ళ పాటు కొనసాగిన చర్చలు ఓ కొలిక్కి రావడంతో ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందానికి తుదిరూపు వచ్చినట్లయింది.  అయితే దీనిపై సంతకం చేయడానికి భారత్ నిరాకరించింది. ప్రపంచ ఆర్థిక రంగంలో దాదాపు మూడోవంతు ఈ ఒప్పందం పరిథిలోకి వస్తుంది. రాబోయే రోజుల్లో వివిధ రంగాలలో సుంకాలు తగ్గించుకునేందుకు ఇది దోహదపడుతుందని సభ్యదేశాలు చెబుతున్నాయి. ఒప్పందంపై సంతకాలు చేసిన రెండేళ్లలో ఆయా దేశాలన్నీ దానిని ధృవీకరించిన తరువాతే ఒప్పందం అమల్లోకి రానుంది.

ఒప్పందంపై చైనా ప్రభావం                                                            

ఆర్ సెప్ ఒప్పందంపై చైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ధరల తగ్గింపు వల్ల దిగుమతులు వెల్లువెత్తితే అది దేశీయ ఉత్పత్తిదారులకు హాని కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేసిన భారత్ చర్చల నుంచి గతేడాది వైదొలగింది. తమ అభ్యంతరాలను పరిష్కరించకుండా వదిలేయడంతో భారత్ ఒప్పందానికి దూరమైంది.

భారత్‌ చేరికపై ఆశాభావం

భారత్ కూడా ఒప్పందంలో భాగస్వామి అయితే ఆసియాలో ప్రాంతీయ సహకారం పరిపూర్ణమవుతుందని సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ జీడీపీలో 29 శాతం ఈ ఒప్పందం ద్వారా జరగనుంది.

భారీగా తగ్గనున్న దిగుమతి సుంకాలు

చైనా నుంచి ఎక్కువ దేశాలకు భారీగా ఎగుమతులు జరుగుతున్నందున తాజా ఒప్పందం ద్వారా సభ్య దేశాలకంటే చైనాకే ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు భావిస్తున్నారు. కొత్త ధరలు 2022 లో ప్రారంభమయ్యాక సుంకాలు 2014 నాటి స్థాయికి పడిపోతాయని వాణిజ్య రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. దిగుమతి సుంకాలు 80 నుంచి 90 శాతం దాకా తగ్గిపోయి…పెట్టుబడుల నిబంధనలు సరళతరం కానున్నాయి. ఆర్ సెప్ లో చైనా, జపాన్, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పైన్స్, సింగపూర్ థాయిలాండ్, బ్రూనై, లావోస్, వియత్నాం, మయన్మార్, కంబోడియాలు సభ్య దేశాలుగా ఉన్నాయి…

బ్యాంకాక్​ వేదికగా జరిగిన ఆర్​సెప్​ సమావేశంలో భారత్​ వైఖరిని కరాఖండిగా ప్రకటించారు ప్రధాని మోదీ. ప్రపంచ వ్యాపార శక్తుల ఒత్తిళ్లకు​ తలొగ్గే రోజులు పోయాయని.. ఈ ఒప్పందం వల్ల భారత్ ఎదుర్కొనే సమస్యలపై మోదీ తన వైఖరిని స్పష్టం చేశారు. ఆర్​సెప్​ తరహాలో ఉండే మోస్ట్​ ఫేవర్డ్​ నేషన్ లోనూ భారత్​ చేరబోదని ఈ సందర్భంగా తేల్చిచెప్పారు. అంతర్జాతీయ వాణిజ్య నిబంధనల ప్రకారం  ప్రాంతీయ సమగ్రతతో పాటు స్వేచ్ఛా వాణిజ్యానికి భారత్​ కట్టుబడి ఉంటుంది. ప్రస్తుత ఆర్​సెప్​ ఒప్పందం ..ప్రధాన ఆర్​సెప్​ స్ఫూర్థిని ప్రతిబింబించేదిగా లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

ఒప్పందం పట్ల విపక్షాల ఆందోళన

మరోవైపు విపక్షాలు కూడా ఈ ఒప్పందంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆర్​సెప్​ ఒప్పందంపై భారత్​ సంతకం చేస్తే… దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే అవకాశముందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఒప్పందం వల్ల దేశంలోకి చైనా చౌక వస్తువులు వెల్లువెత్తుతాయని దీని వల్ల దేశంలోని చిరు వ్యాపారులు, రైతులు తీవ్రంగా నష్టపోతారని విపక్షాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles