ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన మాదటి టెస్ట్ డ్రాగా ముగిసింది. నాలుగో ఇన్నింగ్స్ లో చివరి వికెట్టు కోల్పోకుండా కొనసాగడం వల్ల 98 ఓటర్లు అయిన తర్వాత డ్రాగా ప్రకటించారు. భారత స్పిన్ త్రయం అశ్విన్,జడేజా, అక్సర్ పటేల్ లు చివరి వికెట్టు పడగొట్టలేకపోయారు. జడేజా, రవిచంద్రన్ చెరి మూడు వికెట్లు తీసుకోగా, అక్సర్ పటేల్, ఉమేశ్ యాదవ్ లు చెరో వికెట్టు తీసుకున్నారు. అశ్విన్ ఈ రోజుతో హర్బజన్ సింగ్ పేరు మీద ఉన్న రికార్డును అధిగమించాడు. ఇప్పుడు భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో అశ్విన్ నిలిచాడు. అశ్విన్ మొత్తం 418 టెస్టు వికెట్లు తీసుకున్నాడు. జాబితాలో ప్రథమ స్థానంలో ఉన్న అనీల్ కుంబ్లే 619 వికెట్లు తీసుకోగా, ద్వితీయ స్థానంలో ఉన్న కపిల్ దేవ్ 434 వికెట్లు తీసుకున్నాడు.
మొదటి టెస్ట్ నాలుగు ఇన్నింగ్స్ లోనూ మొత్తం మీద ఇండియా ఆధిక్యం ప్రదర్శించినప్పటికీ చివరికి ఫలితం లేకుండా మ్యాచ్ డ్రా అయింది. రెండు జట్లు గురువారం నుంచి ముంబయ్ లోని చరిత్రాత్మక వాంఖెడే స్టేడియంలో రెండో మ్యాచ్ లో తలపడతాయి. ఈ మ్యాచ్ లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ రంగంలో దిగుతారు. మొదటి జట్టులో బాగా ఆడిన శ్రేయస్ ను ఏమి చేయాలన్నది సెలక్టర్లకు చిక్కు సమస్య.
ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 345 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 234/7 డిక్లేర్ కాదా న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్ లో 296 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో తొమ్మది వికెట్ల నష్టానికి 165 పరుగులు తీసి అవుట్ కాకుండా మ్యాచ్ ని కాపాడుకున్నది. ఇటీవలి కాలంలో మంచి పోటాపోటీగా జరిగిన మ్యాచ్ లలో కాన్పూర్ లో జరిగిన మొదటి టెస్టు ఒకటని చెప్పవచ్చు. అయిదో రోజున 284 పరుగుల లక్ష్యన్ని ఛేదించేందుకు ప్రయత్నించిన న్యూజిలాండ్ జట్టు తొమ్మిదో వికెట్టును పరిరక్షించుకొని 98 ఓవర్లూ అవుట్ కాకుండా ఆడి తాము ప్రపంచ క్రికెట్ చాంపియన్లు ఎందుకో నిరూపించుకున్నారు. రవీంద్ర జడేజా నాలుగో ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు తీసుకొని అత్యంత జయప్రదమైన బౌలర్ గా నిలిచాడు. ఇది రెండు మ్యాచ్ ల సీరీసే. ముంబయ్ లో చివరి, రెండవ మ్యాచ్ జరుగుతుంది.