భారత్ తో ఫైనల్ లో తలబడుతున్న న్యూజిలాండ్ జట్టు
ఒకప్పుడు నాలుగు రోజుల మ్యాచ్ కే పరిమితం
ప్రస్తుతం ప్రపంచంలోనే అగ్రశ్రేణి క్రికెట్ జట్టుగా గుర్తింపు పొంది
బలీయమైన భారత బృందంతో ఫైనల్లో తలపడుతున్న న్యూ జీలాండ్ చాలకాలం వరకు
క్రికెట్ ఆడే దేశాలలో బాగా బలహీనంగా అట్టడుగున ఉండేది.
ఎంత దారుణమంటే, న్యూ జీలాండ్ తో కేవలం నాలుగు రోజుల టెస్టులే జరిగేవి.
ఇండియా కూడా ఆ జట్టుతో 1964-65 వరకూ నాలుగు రోజుల టెస్టులు మాత్రమే ఆడేది.
అయితే, 1964-65 లో మన దేశంలో జరిగిన నాలుగు టెస్ట్ ల సీరీస్ తో న్యూ జీలాండ్
అభివృద్ధిపథంలోకి అడుగుపెట్టిందని తెలిసింది.
జాన్ రీడ్ సీనియర్ నాయకత్వంలొ, బెర్ట్ సట్క్లిఫ్ఫ్ వైస్ కెప్టెన్ గా
ఇండియాకి వచ్చిన ఆ బృందంలో వారిద్దరూ మినహా అందరూ యువరక్తం ప్రవహిస్తున్న
ఆటగాళ్ళే. మొదటి టెస్ట్ మద్రాస్ (చెన్నై) లో డ్రా అయింది. అందులో
విశేషమేమంటే ప్రముఖ బ్యాట్స్ మన్ విజయ్ మంజ్రేకర్ సెంచరీ కొట్టి మరీ ఆటకు
గుడ్ బై చెప్పడం. ఆటలో రాజకీయలకారణంగా అలా చేసాడని అప్పట్లో అంతా
అనుకున్నారు.
కొల్కతాలో జరిగిన రెండో టెస్ట్ లో న్యూ జీలాండ్ దే పైచేయిగా ఉంది.
ఇదికూడా డ్రా అయినా సట్క్లిఫ్, బ్రూస్ టేలర్ శతకాలు బాదారు. మనవైపు
కెప్టెన్ టైగర్ పటౌడి సెంచరీ కొట్టాడు.
ఇక మూడవ టెస్త్ ముంబై లో న్యూ జీలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 297 పరుగులు
చేశాక ఇండియా 88 పరుగులకే ఆల్ అవుటయి ఫాల్లో ఆన్ చేయవలసి వచ్చింది.
అప్పుడు దెబ్బతిన్న బెబ్బులిలా దిలీప్ సర్దేశాయ్ డబుల్ సెంచరీ సాధించగా,
చందు బోర్డే కూడా శతకం కొట్టి పరువు నిలబెట్టారు. తర్వాత రెండవ
ఇన్నింగ్స్ లో న్యూజీ లాండ్ 80 కి 8 వికెట్లు కోల్పోయి, ఎలాగోలా ఓటమి
తప్పించుకుంది.
ఇక చివరి డిల్లీ టెస్ట్ కూడా దాదాపు చేజారిపోయే పరిస్థితి. చివర
నాలుగో రోజున ఇక చీకటి పడుతుండనగా సంధ్యవేళలో విజయం సాధించగలిగింది.
వెంకటరాఘవన్ ఈ టెస్టులో మొత్తం 12 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు.
విజయానికి కారకుడయ్యాడు.
ఆ తర్వాత తర్వాత న్యూ జీలాండ్ బాగా అభివృద్ధి చెంది గ్లెన్ టర్నర్, జాన్
రైట్, మార్టిన్ క్రో, రిచర్ద్ హాడ్లీ, క్రిస్ కైర్న్స్, మెకలం వంటి విశేష
ప్రజ్ఞా పాటవాలున్న ఆటగాళ్ళ కృషితో అంచెలంచెలుగా ఎదిగి –ఇదుగో ఇప్పుడు
ప్రపంచ ఫైనల్లో ఇండియాతో తలపడుతోంది.