- సెమీఫైనల్స్ లో ఇంగ్లండ్ ఘనవిజయం
- వికెట్టు నష్టపోకుండా 16 ఓవర్లలోనే లక్ష్యం ఛేదించిన ఇంగ్లండ్
- బ్యాటింగ్ బాగా చేసినా, బౌలింగ్, ఫీల్డింగ్ లో దెబ్బతిన్నామన్న రోహిత్ శర్మ
భారత క్రికెట్ జట్టు ప్రపంచ కప్ సెమీ ఫైనల్స్ లో దారుణంగా ఓడిపోయింది. మరో సెమీ ఫైనల్ లో గెలిచిన పాకిస్తాన్ తో ఇంగ్లండ్ ఆడుతుంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు ఫీల్డింగ్ చేయడానికి ఎంచుకున్నది. బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు ఓపెనర్ రాహుల్ వికెట్టు కోల్పోయాడు. తర్వాత జట్టు నాయకుడు రోహిత్ శర్మ పెవెలియన్ కు చేరుకున్నాడు. హార్దిక్ పాండ్యా 33 బంతులతో 63 పరుగులు చేసి చివరి బంతిలో అవుటైనాడు. అంతకు ముందు విరాట్ కొహ్లీ అర్దశతకం కొట్టి అవుటైనాడు. ఇండియా మొత్తంమీదిక కష్టబడి 168 పరుగులు చేశారు. ఈ మాత్రం స్కోరు అయినా రావడానికి హార్థిక్ పాండ్యా ప్రధాన కారణం.
బ్యాటింగ్ బాగానే చేసి గౌవరప్రదమైన స్కోరును లక్ష్యంగా నిలిపినప్పటికీ బంతితో ఏమీ చేయలేక విఫలమయ్యామని భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఆట అనంతరం వ్యాఖ్యానించాడు. భారత క్రీడాకారులు ఒత్తిడికి తట్టుకోలేకపోయారనీ, ఒత్తిని ఎట్లా తట్టుకోవాలో ప్రతి ఒక్కరికీ బోధించడం సాధ్యం కాదనీ వ్యాఖ్యానించాడు. ఇంగ్లండ్ ఓపెనర్లు బాగా ఆడారని రోహిత్ ప్రశంసించాడు.
ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ 49 బంతులలో 80 పరుగులతోనూ, మరో ఓపెనర్ అలెక్స్ హేల్స్ 47 బంతులలో 86 పరుగులతోనూ అజేయంగా నిలిచారు. వారిరువురి అద్భుత బ్యాటింగ్ కి తోడు భారత్ బౌలర్ల పేలవ ప్రదర్శన, ఫీల్డర్ల పరమచెత్త ఫీల్డింగ్ ఇంగ్లండ్ భారీ విజయానికి దోహదం చేశాయి. పది వికెట్ల తేడాతో, ఒక్క వికెట్టు కూడా నష్టపోకుండా పదహారు ఓవర్లలోనే లక్ష్యాన్ని అధిగమించిన ఇంగ్లండ్ ను బహుథా ప్రశంసించాలి. చేవలేని, చేతగాని బారత జట్టుని ఎన్నివిధాల నిందించినా తప్పులేదు. రెండో గ్రూపులో అగ్రగామిగా నిలిచి పాకిస్తాన్, దక్షిణాఫ్రికా కంటే మెరుగైన ఆట ప్రదర్శించి చివరికి సెమీఫైనల్స్ లో చెత్తగా ఆడి చిత్తుగా ఓడిపోయిన భారత్ సిగ్గుతో ఇంటిదారి పట్టవచ్చు. ఆట అన్న తర్వాత గెలుపోటములు సహజం. కానీ గెలవాలనే ప్రయత్నం కూడాచేయకుండా నిరాసక్తంగా, నిస్తేజంగా ఆడిన బారత ఆటగాళ్లను ఏమని అభివర్ణించాలి? భారత స్కోరు ఆరు వికెట్లకు 168 పరుగులు కాగా ఇంగ్లండ్ వికెట్టు నష్టపోకుండా పదహారు ఓవర్లలో 170 పరుగులు సాధించి విజయకేతనం ఎగరవేసింది.
ఇంగ్లండ్ బ్యాటింగ్ జోస్ బట్లర్ 49 బంతులకు 80 పరుగులు, మరో ఓపెనర్ అలెక్స్ హేల్స్ 47 బంతులకు 86 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. ఇండియా ఆరు వికెట్లకు 168 పరుగులు. హార్దిక్ పాండ్యా 63, విరాట్ కొహ్లీ 50 పరుగులు. బ్రిటన్ బౌలర్ క్రిస్ జోర్డన్ 43 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు.
టీ20 ప్రపంచ కప్ ఫైనల్ పాకిస్తాన్, ఇంగ్లండ్ ల మధ్య ఆదివారం మద్యాహ్నం ఒకటిన్నరకు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో ప్రారంభం అవుతుంది.