- 134 పరుగులకే కుప్పకూలిన రూట్ ఆర్మీ
- భారత్ కు 195 పరుగుల ఆధిక్యం
చెన్నై రెండోటెస్టు రెండోరోజుఆటలోనే భారత్ పట్టు బిగించింది. తొలిఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ ను 134 పరుగులకే కుప్పకూల్చడం ద్వారా విజయానికి పునాది వేసుకొంది. తొలి ఇన్నింగ్స్ల్ లో 195 పరుగుల భారీ ఆధిక్యత సంపాదించింది. అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 6 వికెట్లకు 300 పరుగులతో రెండోరోజుఆట కొనసాగించిన భారత్ 329 పరుగులకు ఆలౌటయ్యింది. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ 58 పరుగులతో అజేయంగా నిలిచాడు. 77 బాల్స్ లో 3 సిక్సర్లు, 7 బౌండ్రీలతో అర్థశతకంతో మెరిశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మోయిన్ అలీ 4, స్టోన్ 3వికెట్లు పడగొట్టారు.
రూట్ కు అక్షర్ చెక్
ఆ తర్వాత బర్న్స్- సిబ్లేలతో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ను భారత పేసర్ ఇశాంత్ తొలి దెబ్బ కొట్టాడు. ఖాతా తెరవకుండానే ఇంగ్లండ్ తొలివికెట్ నష్టపోయింది. బర్న్స్ ను ఇశాంత్ డకౌట్ గా పెవీలియన్ దారి పట్టించాడు. మరో ఓపెనర్ సిబ్లే, వన్ డన్ లారెన్స్ లను అశ్విన్ పడగొట్టాడు. తొలిటెస్టులో డబుల్ సెంచరీ హీరో, ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ 6 పరుగులకే టెస్ట్ అరంగేట్రం ఆటగాడు అక్షర్ పటేల్ అవుట్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ టాపార్డర్ పేకమేకలా కూలడం ప్రారంభమయ్యింది. డాషింగ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ సైతం 18 పరుగుల స్కోరుకే అశ్విన్ కు చిక్కాడు. మిడిలార్డర్ లో వికెట్ కీప్ర బ్యాట్స్ మన్ బెన్ ఫోక్స్ ఒంటరిపోరాటం చేసి 42 పరుగులతో నాటౌట్ గా మిగిలాడు. లోయర్ ఆర్డర్ సైతం ఇంగ్లండ్ ను ఆదుకోలేకపోయింది. చివరకు ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 59.5 ఓవర్లలో 134 పరుగుల స్కోరుకు ముగిసింది. భారత బౌలర్లలో అశ్విన్ 5 వికెట్లు, అక్షర్ పటేల్ 3 వికెట్లు, పేస్ జోడీ ఇశాంత్, సిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు. కుల్దీప్ 6 ఓవర్లు వేసి 16 పరుగులిచ్చినా ఒక వికెట్లు పడగొట్టలేకపోయాడు. 195 పరుగుల కీలక తొలిఇన్నింగ్స్ ఆధిక్యత సాధించిన భారత్ మరో 200 పరుగుల స్కోరుతో డిక్లేర్ చేసే అవకాశాలున్నాయి. టెస్ట్ మ్యాచ్ మొదటి నాలుగురోజుల్లోనే ముగిసినా ఆశ్చర్యం లేదు.
ఇదీ చదవండి:వినుము వినుము విరాట్ డకౌట్ల గాథ!