భరత దేశం అత్యంత ప్రమాదకర పరిస్థితి లో వుంది. సమకాలీన భారతీయ సమాజంలో ఏమి జరుగుతుందో తెలుసుకొనే ప్రయత్నం చేయకపోతే, అది మనం చేస్తున్న పెద్ద తప్పు. ఏమి జరుగుతుందో సామాన్య ప్రజలమైన మనకు వివరించకుంటే అది మన ప్రతిపక్ష నాయకుల, మేధావుల, విద్యావేత్తల తప్పు.
ఎన్ ఆర్ ఐలు గా, ఎంతో కొంత ప్రగతి పథం లో వున్న మనం, ఇప్పుడు గొంతెత్తకుంటే, చూసి చూడనట్లు వుంటే, మనందరం గొంతున్న మూగవాళ్ళం, కళ్లున్న గుడ్డివాళ్లం. నైరాశ్యం ఆవహించిందో , విలాసాలకు అలవాటు పడ్డామో, స్వార్దం తప్ప ఇంకేమీ లేకుండా పోయిందో లేక బ్రిటిష్ వాళ్ళ కింద పని చేసి చేసి ఆ బానిసత్వపు ఆనవాళ్లు మన రక్తం లో DNA అయ్యి స్తిరపడినాయో కానీ, బీజేపీ ప్రభుత్వం చేస్తున్న విపరీతమైన అరాచకత్వం, దాష్టీకం, ఎన్నడూ లేనటువంటి నిరంకుశ పాలనను కనీసం వ్యతిరేకించ లేకపోతే తరువాతి తరం మనలను క్షమిచదు. ఇప్పటితరమంతా వృధాగా తమ జీవితం గడిపినట్టే.
ఒక్క మతం అనే మత్తును ఎక్కించి మనను బొమ్మలను చేసి, వికృతమైన ఆట ఆడుకుంటోంది ఇప్పటి బీజేపీ ప్రభుత్వం. దానికి తమ సొంత అవసరాలకోసం వంత పాడుతోంది బీఆర్ఎస్ ప్రభుత్వం.
జాతీయ చిహ్నాన్ని మార్చారు. మన దేశానికి పేరు మార్చి వున్న పేరునే మళ్ళీ పెడ్తారట. ఇండియన్ పీనల్ కోడ్ పేరును మార్చారు. ప్రజాస్వామ్యం వద్దంటున్నారు. కోర్టులు తీర్పిస్తాయి కానీ ఆ తీర్పులు ఎట్లా వుండాలో మేమే చెప్తామంటున్నారు.
అన్నిటికంటే భయంకరమైన విషయం- మళ్లీ గెలిస్తే జాతీయ జెండానూ, రాజ్యాంగాన్నీ మార్చాలని మాత్రమే కాదు ముస్లింలకు, క్రిస్టియన్లకు ఓటు హక్కును తొలగించాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. ఇప్పుడు కూడా మాట్లాడకుంటే మన కంటే, ఒక డ్రగ్స్ కు బానిస అయినవాడో, ఒక బ్రైన్ డెడ్ అయిన మనిషో చాలా నయం. రాజకీయ నాయకులు వచ్చినప్పుడు వారికి ఆతిథ్యం ఇవ్వటం, ఫోటోలు దిగటం అక్కడినుంచి ఇంటికిపోయి ఆ ఫోటోలను వాట్స ప్ లో షేర్ చేయటం తో మన పని అయిపోతే, మనం కేవలం entertainment కోసం ఈ సంఘాలు పెట్టుకున్నమని ఇతరులు అనుకొంటారు. ఆ ఫోటోలు ఒక వెయ్యి మంది చూసి ఒక్కరన్న మనతో పాటు మనదారిలో ప్రయానిస్తారన్న
ఆశ తోనే. అసలు చెయ్యాల్సిన పని అక్కడ మొదలు కావాలి.
మనం చేసే పని నిజమైనదిగా, ఎటువంటి సొంత లాభాన్ని ఆశించకుండా వుండాలి.