- కంగారూ కోటలో భారత్ పాగా
- బ్రిస్బేన్ టెస్టులో భారత్ సంచలన విజయం
భారత కుర్రాళ్లు సరికొత్త చరిత్ర సృష్టించారు. అజింక్యా రహానే నాయకత్వంలోని భారతజట్టు ఆస్ట్ర్రేలియాను ఆస్ట్ర్రేలియాగడ్డపై ఓడించి ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్.. సిరీస్ ను 2-1తో కైవసం చేసుకొంది.
ఆస్ట్రేలియా విజయాల అడ్డా బ్రిస్బేన్ గబ్బా స్టేడియంలో ముగిసిన నిర్ణయాత్మక ఆఖరి, నాలుగవ టెస్ట్ ను భారత్ 3 వికెట్ల తేడాతో నెగ్గి విజేతగా నిలిచింది. యువఓపెనర్ శుభ్ మన్ గిల్ 91, యువవికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ 89 పరుగుల నాటౌట్, వన్ డౌన్ చతేశ్వర్ పూజారా 56 పరుగులతో భారత్ సూపర్ చేజింగ్ విజయం సొంతం చేసుకొంది.
Also Read : ఆస్ట్రేలియా గడ్డపై భారత్ అద్భుత విజయం
329 పరుగుల లక్ష్యంతో…ఓవరన్ నైట్ స్కోరుతో ఆఖరిరోజు ఆట ప్రారంభించిన భారత్…ప్రారంభ ఓవర్లలోనే డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ వికెట్ నష్టపోయింది. అయితే ..వన్ డౌన్ చతేశ్వర్ పూజారాతో కలసి యువఓపెనర్ శుభ్ మన్ గిల్ పరుగుల వేట ప్రారంభించాడు.
శుభ్ మన్ సూపర్ బ్యాటింగ్
ప్రస్తుత సిరీస్ ద్వారా టెస్ట్ అరంగేట్రం చేసిన శుభ్ మన్ గిల్…నిర్ణయాత్మక బ్రిస్బేన్ టెస్ట్ ఆఖరిరోజు ఆటలో తన బ్యాటింగ్ మ్యాజిక్ ను ప్రదర్శించాడు. చూడముచ్చటైన షాట్లతో అలరించాడు. కళ్లు చెదిరే పుల్ షాట్లతో ఆస్ట్ర్రేలియా పేస్ బౌలర్లను కంగారెత్తించాడు.కేవలం 146 బాల్స్ లోనే 2 సిక్సర్లు, 8 బౌండ్రీలతో 91 పరుగులు సాధించి…సెంచరీకి 9 పరుగుల దూరంలో అవుటయ్యాడు.
Also Read : టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంకర్ గా భారత్
మరోవైపు…చతేశ్వర్ పూజారా మాత్రం కట్టుదిట్టమైన డిఫెన్స్ తో కంగారూ బౌలర్లను నిలువరించడం ద్వారా స్ట్రోక్ మేకర్ శుభ్ మన్ కు అండగా నిలిచాడు. కమిన్స్, హేజిల్ వుడ్, స్టార్క్ విసిరిన షార్ట్ పిచ్ బంతులు, బౌన్సర్లను కాచుకొంటూ ఆడి మొత్తం 211 బాల్స్ లో 7 బౌండ్రీలతో 56 పరుగులు సాధించి…భారత విజయానికి గట్టిపునాది వేశాడు.
తొలి ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ సాధించిన పూజారా…రెండోఇన్నింగ్స్ లో సైతం అర్థశతకం బాదడం ద్వారా తనవంతు బాధ్యతను నిర్వర్తించాడు. కెప్టెన్ రహానే 24, మయాంక్ అగర్వాల్ 9 పరుగుల స్కోర్లకు అవుట్ కాగా…విజయభారాన్ని యువఆటగాళ్లు రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్ తమపైనే వేసుకొన్నారు.
వారేవ్వా!.. రిషభ్ పంత్
దూకుడుగా ఆడటంలో తనకుతానే సాటిగా నిలిచే రిషభ్ పంత్ తనదైన శైలిలో బ్యాట్ ఝుళిపిస్తూ బౌండ్రీల మోతతో చెలరేగిపోయాడు. 138 బాల్స్ లో 9బౌండ్రీలు, 1 సిక్సర్ తో అజేయంగా నిలిచాడు. విన్నింగ్ బౌండ్రీని సాధించడం ద్వారా తనజట్టుకు చారిత్రాత్మక టెస్ట్, సిరీస్ విజయాన్ని అందించాడు.
Also Read : గెలుపంటే ఇదేరా!
వాషింగ్టన్ సుందర్ 22, శార్దూల్ ఠాకూర్ 2 పరుగులకు అవుటయ్యారు. కంగారూ బౌలర్లలో కమిన్స్ 4,లయన్ 2 వికెట్లు, హేజిల్ వుట్ 1 వికెట్ పడగొట్టారు. భారత విజయంలో ప్రధానపాత్ర వహించిన రిషభ్ పంత్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ఆస్ట్ర్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కాయి. 1988 తర్వాత బ్రిస్బేన్ గబ్బా వేదికగా ఆతిథ్య ఆస్ట్ర్రేలియాకు ఇదే తొలి ఓటమి కావడం విశేషం. అంతేకాదు… కంగారూ విజయాల అడ్డా,కంచుకోట బ్రిస్బేన్ గబ్బా వేదికగా రెండు విజయాలుడడుల్లో చేరింది.