- వరుసగా 10 స్వదేశీ సిరీస్ విజయాల విరాట్
- భారతగడ్డపై కొహ్లీ 23వ టెస్టు గెలుపు
ఇంగ్లండ్ తో ముగిసిన నాలుగుమ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భారత సారథి విరాట్ కొహ్లీ వ్యక్తిగతంగా విఫలమైనా…కెప్టెన్ గా మాత్రం మరో అరుదైన రికార్డును సొంతం చేసుకొన్నాడు.
అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఇంగ్లండ్ తో ముగిసిన ఆఖరిటెస్టులో భారత్ ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో నెగ్గడంతోనే కెప్టెన్ కొహ్లీ పేరుతో సొంతగడ్డపై వరుసగా పదోసిరీస్ విజయం నమోదయ్యింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా రికార్డును అధిగమించడంతో పాటు…మరో కంగారూ దిగ్గజ కెప్టెన్ రికీ పాంటింగ్ రికార్డును సమం చేయగలిగాడు. భారత గడ్డపై వరుసగా 10 టెస్టు సిరీస్ విజయాలు సాధించిన తొలి, ఏకైక కెప్టెన్ గా విరాట్ కొహ్లీ రికార్డుల్లో చేరాడు.
Also Read : ఐసీసీ టెస్టు లీగ్ ఫైనల్స్ లో భారత్
భారత గడ్డపై 23వ విజయం
భారత టెస్టు జట్టు కెప్టెన్ గా స్వదేశంలో విరాట్ కొహ్లీ 23వ విజయం నమోదు చేశాడు. ఆస్ట్ర్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా పేరుతో ఉన్న 22 స్వదేశీ విజయాల రికార్డును కొహ్లీ అధిగమించాడు.
అయితే…కొహ్లీ కంటే అత్యధిక స్వదేశీ విజయాలు సాధించిన విదేశీ కెప్టెన్లలో గ్రీమ్ స్మిత్ ( 30 ), రికీ పాంటింగ్ ( 29 ) ఉన్నారు.
ధోనీ సరసన విరాట్ కొహ్లీ
భారత టెస్టు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. భారత్ తరఫున అత్యధిక టెస్టులకు సారథ్యం వహించిన మహేంద్రసింగ్ ధోనీ రికార్డును కొహ్లీ అహ్మదాబాద్ ఆఖరిటెస్టు ద్వారా సమం చేయగలిగాడు.
Also Read : టెస్టు సిరీస్ లో అశ్విన్ విశ్వరూపం
మహేంద్రసింగ్ ధోనీ 2008-2014 మధ్యకాలంలో భారత్ కు 60 టెస్టుల్లో నాయకత్వం వహించాడు. ధోనీ నుంచి 2014 సీజన్లో భారతటెస్టు జట్టు పగ్గాలు అందుకొన్న విరాట్…గత ఏడేళ్ల కాలంలో 60 టెస్టుల్లో కెప్టెన్ గా వ్యవహరించాడు.
అహ్మదాబాద్ ఆఖరిటెస్టు వరకూ 91 మ్యాచ్ లు ఆడిన కొహ్లీ…60 మ్యాచ్ ల్లో కెప్టెన్ గా వ్యవహరించడం విశేషం. ఈ ఇద్దరి తర్వాత సౌరవ్ గంగూలీ(49 టెస్టులు), మహ్మద్ అజారుద్దీన్(47), సునీల్ గవాస్కర్(47), పటౌడీ(40), కపిల్ దేవ్(34), రాహుల్ ద్రావిడ్(25), సచిన్ టెండూల్కర్(25), బిషన్ సింగ్ బేడీ(22) భారత్ తరఫున అత్యధిక టెస్టులకు సారథ్యం వహించిన ఆటగాళ్లుగా ఉన్నారు.
Also Read : ఫైనల్ కు కోహ్లీసేన : 3-1 తేడాతో సిరీస్ కైవసం
ఇంగ్లాండ్‌తో నాలుగుమ్యాచ్ ల సిరీస్ లోని మూడుటెస్టులు నెగ్గడం ద్వారా భారత అత్యంత విజయవంతమైన టెస్టు కెప్టెన్ గా విరాట్ కొహ్లీ చరిత్ర సృష్టించాడు.
పడిలేచాం, సిరీస్ నెగ్గాం – విరాట్
చెన్నై తొలిటెస్టులో 227 పరుగుల తేడాతో తమకు ఓటమి ఎదురైనా…సిరీస్ లోని ఆఖరి మూడుటెస్టుల్లో లేచి నిలబడి, పోరాడి సిరీస్ విజేతగా నిలవడం తనకు గర్వకారణమని ఆఖరిటెస్టు ముగిసిన అనంతరం మాట్లాడుతూ విరాట్ కొహ్లీ చెప్పాడు. తమ బౌలింగ్, ఫీల్డింగ్ అత్యుత్తమస్థాయిలో ఉన్నాయని, బెంచ్ బలం కూడా చాలాబాగుందని అన్నాడు.
Also Read : ఆఖరి టెస్టుపై భారత్ పట్టు