* కొహ్లీ రాణించినా తప్పని ఓటమి
* బట్లర్- బెయిల్ స్టో ధూమ్ ధామ్ బ్యాటింగ్
ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లో రెండు టాప్ ర్యాంక్ జట్ల పోరు నువ్వానేనా అన్నట్లుగా సాగుతోంది. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో అభిమానులు లేకుండానే.. గేట్లు మూసి నిర్వహించిన మూడో టీ-20లో ఇంగ్లండ్ 8 వికెట్ల తో ఆతిథ్య భారత్ ను చిత్తు చేసి ..మొదటి మూడుమ్యాచ్ లు ముగిసే సమయానికి 2-1తో పైచేయి సాధించింది.
టాస్ ఓడితే… మ్యాచ్ పోయినట్లే
ప్రస్తుత సిరీస్ కే కీలకంగా మారిన మూడో టీ-20లో …తొలిమ్యాచ్ ఫలితమే పునరావృతమయ్యింది.టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారతజట్టు…ప్రత్యర్థి ఎదుట మ్యాచ్ విన్నింగ్ స్కోరును ఉంచలేకపోయింది.
భారత టీమ్ మేనేజ్ మెంట్ …మిడిలార్డర్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ స్థానంలో డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మకు తుదిజట్టులో చోటు కల్పించినా ప్రయోజనం లేకపోయింది.
Also Read : అహ్మదాబాద్ చుట్టూ తిరుగుతున్న భారత క్రికెట్
రోహిత్- రాహుల్ జోడీతో కలసి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ కు మూడో ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. వికెట్లో పేస్ , బౌన్స్ ఉండడంతో…ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్లు మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్ పూర్తిస్థాయిలో చెలరేగిపోయారు. గంటకు 145 కిలోమీటర్ల సగటు వేగంతో బంతులు విసురుతూ నిప్పులు చెరిగారు.
రాహుల్ మరో డకౌట్
గాయంతో జట్టుకు దూరమై..ప్రస్తుతసిరీస్ ద్వారా పునరాగమనం చేసిన రాహుల్ మరోసారి డకౌటయ్యాడు. మార్క్ వుడ్ బౌలింగ్ లో సున్నా స్కోరుకే వెనుదిరిగాడు.
Also Read : క్రికెట్ చరిత్రలో అరుదైన రోజు
గత మూడుమ్యాచ్ ల్లో ఒక్క పరుగు మాత్రమే చేసిన రాహుల్ కు ఇది రెండో డకౌట్ కావడం విశేషం. రాహుల్ అవుటైన వెంటనే క్రీజులోకి వచ్చిన మరోయువఆటగాడు ఇశాన్ కిషన్ సైతం నిలదొక్కుకోలేకపోయాడు. కేవలం 4 పరుగుల స్కోరుకే జోర్డాన్ బౌలింగ్ లో
అవుటయ్యాడు.
రెండుమ్యాచ్ ల విరామం తర్వాత తుదిజట్టులోకి వచ్చిన స్పెషలిస్ట్ ఓపెనర్ రోహిత్ శర్మ సైతం చెప్పుకోదగిన స్కోరు సాధించలేకపోయాడు. 17 బాల్స్ ఎదుర్కొని 2 బౌండ్రీలతో 15 పరుగులకు వుడ్ బౌలింగ్ లోనే అవుటయ్యాడు.
Also Read : మూడో యుద్ధానికి అంతా సిద్ధం
విరాట్ ఒంటరి పోరాటం
ఓ వైపు వికెట్లు పడుతున్నా…మరోవైపు కెప్టెన్ విరాట్ కొహ్లీ మాత్రం ఒంటరిపోరాటమే చేశాడు. తన బ్యాట్ కు పూర్తిస్థాయిలో పనిచెప్పి..ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. శ్రేయస్ అయ్యర్ 9 పరుగులకే అవుటైనా…రిషభ్ పంత్, హార్థిక్ పాండ్యాలతో కలసి కొహ్లీ తన పోరాటం కొనసాగించాడు. పంత్ 25 పరుగుల స్కోరుకు రనౌట్ కాగా… హార్థిక్ పాండ్యా 17, కొహ్లీ 77 పరుగులతోనూ నాటౌట్ గా మిగిలారు.
కొహ్లీ కేవలం 46 బాల్స్ లోనే 8 బౌండ్రీలు, 4 సిక్సర్లతో తన టీ-20 కెరియర్ లో 27వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. టీ-20 ఫార్మాట్లో 3వేలకు పైగా పరుగులు సాధించిన తొలి ఆటగాడి ఘనతను దక్కించుకొన్న కొహ్లీ తన స్కోరును 3వేల 78కి పెంచుకోగలిగాడు. భారత్ చివరకు 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 3 వికెట్లు, జోర్డాన్ 2 వికెట్లు పడగొట్టారు.
Also Read : క్రికెట్ యాంకర్ కు యార్కర్ల కింగ్ మూడుముళ్లు
బట్లర్ మెరుపు బ్యాటింగ్
157 పరుగుల విజయలక్ష్యంతో చేజింగ్ దిగిన ఇంగ్లండ్ సైతం ప్రారంభ ఓవర్లలోనే ఓపెనర్ జేసన్ రాయ్ వికెట్ నష్టపోయింది. అయితే…మరో ఓపెనర్ జోస్ బట్లర్, వన్ డౌన్ మలాన్ కలసి రెండో వికెట్ కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యంతో విజయానికి మార్గం సుగమం చేశారు.
మలాన్ 18 పరుగులకే సుందర్ బౌలింగ్ లో అవుటైనా..రెండోడౌన్ లో బ్యాటింగ్ కు దిగిన బెయిర్ స్టో, బట్లర్ బౌండ్రీల మోత మోగించారు. బట్లర్ 52 బాల్స్ లో 5 బౌండ్రీలు, 4 సిక్సర్లతో 83 పరుగులు, బెయిర్ స్టో 28 బాల్స్ లో 5 బౌండ్రీలతో 40 పరుగుల స్కోర్లతో అజేయంగా నిలిచారు. ఇంగ్లండ్ 18.2 ఓవర్లలోనే 2 వికెట్ల నష్టానికే 8 వికెట్లవిజయం సొంతం చేసుకొంది. సిరీస్ కే నిర్ణయాత్మకంగా మారిన నాలుగో టీ-20 గురువారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.
Also Read : కింగ్ పీలేను మించిన క్రిస్టియానో రొనాల్డో