అస్ట్ర్రేలియా 369, భారత్ 2 వికెట్లకు 62
భారత్- ఆస్ట్ర్రేలియాజట్ల ఆఖరిటెస్ట్ రెండోరోజు ఆటకు వానదెబ్బతగిలింది. వర్షంతో టీవిరామం తర్వాతి ఆటను రద్దు చేసే సమయానికి భారత్ 2 వికెట్లకు 62 పరుగుల స్కోరుతో పోరాటం మొదలు పెట్టింది. అంతకుముందు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 369 పరుగులకే ముగిసింది.
భారత బౌలర్ల పోరాటం
అంతకుముందు….తొలి రోజు ఆట ముగిసే సమయానికి సాధించిన 5 వికెట్లకు 274 పరుగుల స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్ర్రేలియాను గ్రీన్- పెయిన్ 6వ వికెట్ కు 98 పరుగుల కీలక భాగస్వామ్యంతో ఆదుకొన్నారు. కెప్టెన్ టిమ్ పెయిన్ 50, గ్రీన్ 47 పరుగుల స్కోర్లకు అవుటయ్యారు. లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు స్టార్క్ 20 పరుగులతో అజేయంగా నిలువగా…వందోటెస్ట్ హీరో లయన్ 24 పరుగులు సాధించాడు. భోజనవిరామానికి ముందే…భారత యువబౌలర్లు.. కంగారూటీమ్ ను 369 పరుగులకు ఆలౌట్ చేయగలిగారు.
భారత బౌలర్లలో నటరాజన్, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ తలో మూడు వికెట్లు, సిరాజ్ ఒక వికెట్ సాధించారు.
భారత్ ఎదురీత….
కంగారూటీమ్ ను 369 పరుగులకే కట్టడి చేసిన భారత్ కు ఓపెనర్లు శుభ్ మన్ గిల్- రోహిత్ శుభారంభాన్ని ఇవ్వలేకపోయారు. ఫాస్ట్ బౌలర్ కమిన్స్ వేసిన 7వ ఓవర్ రెండో బంతికే స్మిత్ కు క్యాచ్ ఇచ్చి శుభ్ మన్ గిల్ 7 పరుగుల స్కోరుకు వెనుదిరిగాడు. ఆ తరువాత నుంచి మరో ఓపెనర్ రోహిత్ శర్మ తనదైన శైలిలో దూకుడుగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులెత్తించాడు. రోహిత్ కేవలం 74 బంతుల్లోనే 6 బౌండ్రీలతో 44 పరుగులు చేసి హాఫ్ సెంచరీకి చేరువైన సమయంలో…దుందుడుకుగా ఆడి తగిన మూల్యం చెల్లించాడు.
ఆఫ్ స్పిన్నర్ లయన్ వేసిన 20 ఓవర్ ఐదో బంతికే రోహిత్ దొరికిపోయాడు. సిక్సర్ షాట్ కు ప్రయత్నించిన రోహిత్ ను స్టార్క్ క్యాచ్ పట్టి పెవీలియన్ దారి పట్టించాడు. ఆ తర్వాత కెప్టెన్ అజింక్యా రహానే వచ్చి…వన్ డౌన్ పూజారాతో కలిశాడు.
అపార అనుభవం కలిగిన పూజారా- రహానే జోడీ ఆచితూచి ఆడుతూ తమ బ్యాటింగ్ కొనసాగించారు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. మూడో వికెట్ కు తొలి పరుగు సాధించడానికి ఈ జోడి 30 బంతులు ఎదుర్కొనాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆస్ట్ర్రేలియా బౌలర్లు వరుసగా నాలుగు మెయిడిన్లు వేయగలిగారు. ఆ తర్వాత కుండపోతగా వర్షం పడడంతో ఆట నిలిచిపోయింది.
పిచ్ ను కవర్లతో కప్పినా అవుట్ ఫీల్డ్ తడిసిముద్దు కావడంతో…ఆఖరి సెషన్ ఆటను రద్దు చేసినట్లు ఫీల్డ్ అంపైర్లు ప్రకటించారు. మూడోరోజుఆటను భారత్ ఎలా కొనసాగించలదన్న అంశం పైనే మ్యాచ్ ఫలితం ఆధారపడనుంది.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరిదైన నాల్గో టెస్టులో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 60 పరుగులకే ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ వికెట్లను కోల్పోయింది. గిల్ ఏడు పరుగులకే ఔట్ కాగా, రోహిత్ శర్మ 74 బంతుల్లో 6 ఫోర్లతో 44 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. కమిన్స్ వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్ రెండో బంతికి గిల్ ఔట్ కాగా, లయన్ వేసిన 20 ఓవర్ ఐదో బంతికి రోహిత్ పెవిలియన్ చేరాడు. గిల్ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి పుజారా రాగా, రోహిత్ ఔటైన తర్వాత రహానే బ్యాటింగ్‌కు దిగాడు. వీరిద్దరూ మెల్లగా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళుతున్నారు. క్రీజ్‌లో పాతుకోవడానికి ప్రాధాన్యత ఇస్తూ ఆసీస్ బౌలర్లకు పరీక్షగా నిలిచారు. ఈ జోడి పరుగు సాధించడానికి 30 బంతులు తీసుకుంది. దాంతో వరుసగా నాలుగు మెయిడిన్లు పడ్డాయి. వర్షం కారణంగా మ్యాచ్ తాత్కాలికంగా నిలిచిపోయింది.