నా ఇల్లు పాతబడింది.
విరిగిన తలుపులు, పగిలిన నేల, మాసిన గోడలు,
పెచ్చులు ఊడి ఏ క్షణా న అయినా కూలేట్లు ఉన్న కప్పు.
యజమానిని అడిగాను కాస్త బాగుచేయించ గూడదా అని.
ఒక్క నవ్వు నవ్వి ఊరుకున్నాడు.
అర్థం కాలేదు.
ఉంటే ఉండు, లేకపోతే పో అనా?
నేనే పూనుకొన్న…
గోడలకు కొత్త రంగులు అద్దా…
గచ్చుకు, కప్పుకు సిమెంట్ పులిమా…
వన్నె వన్నె పరదాలతో ఇంటిని అలంకరించా…
ప్చ్… వృద్ధ వధూ శోభ !
నవ్వాలో, ఏడ్వాలో తెలియలే.
సంవత్సరాలు ఇలాగే గడిచి పోయాయి.
నా అవశిష్టం దిన దిన క్షీణత చెందుతూనే ఉంది.
ఇక తప్పదు. ఈ ఇల్లు వదలాలి.
క్రొత్త ఇల్లు వెతకాలి.
చిన్నదో, పెద్దదో, ఇక్కడో, ఇంకెక్కడో.
ఇదుగో నేనుసిద్ధం, నూతన గృహప్రవేశానికి…
ఒక దయగల తల్లి వెచ్చని గర్భం!
Also read: జ్ఞాపకాలు
Also read: ఆమె
Also read: సమయం లేదు మిత్రమా
Also read: నీతో
Also read: కవిత్వం ఒక విచిత్రం