• నారపరాజు ఓటమి నాగేశ్వర్ వల్లే
ఉత్కంఠ పోరులో ఎట్టకేలకు టీఆర్ ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి ఎమ్మెల్సీ గా ఎన్నికయ్యారు. గత ఆరు మాసాలుగా పట్టభద్రుల ఓట్లను పేర్చుకున్న నారపురాజు రామచందర్ రావు చివరి వరకూ పోరాడి ఓడిపోయారు. పివీ తనయ వాణీదేవి టిఆర్ఎస్ కండువాతో గట్టెక్కారు. కాంగ్రెస్ నుండి అవమానాలకు గురైన పీవీనీ, వారి కుటుంబాన్నీ అక్కున చేర్చుకున్న కేసీఆర్ తన ప్రతిష్టను పణంగా పెట్టి వాణీ దేవీ విజయానికి కేవలం 16 రోజుల్లో బిజెపి ఓటు బ్యాంకు ను చీల్చగలిగారు. డబ్బు, అధికారం ఎంత పంచినా కూడా వ్యూహం లేకపోతే విజయం వరించేది కాదు. రాం చందర్ రావు బలగాన్ని ఓడించడానికి స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగడమే కాకుండా ఒకవైపు ట్రబుల్ షూటర్ హరీష్ రావును, మరో వైపు తనయుడు కేటీఆర్ ను కార్యోన్ముఖులను చేసి మొత్తానికి వాణీదేవిని గెలిపించగలిగారు. తెలంగాణ ముద్దు బిడ్డ తెలుగు రాష్ట్రాల పేరును ప్రపంచ వ్యాప్తంగా చాటిన పీవీ ప్రతిభను మసగబారకుండా కేసీఆర్ చేసిన వ్యూహాలు ఫలించాయి. ఇది వాణీ దేవీ గెలుపు కంటే కేసీఆర్ గెలుపు అనడం సబబు.
Also Read: పీవీ కుమారుడిని పార్టీలు ఏకాకిని చేస్తున్నాయా?
రాంచందర్ రావుకు అడ్డుపడింది ఎవరు?
ఇక రాం చందర్ రావు ప్రశ్నించే గొంతుకు అడ్డుపడింది కేసీఆర్ కాదు. ప్రొఫెసర్ నాగేశ్వర్. ఆయన గనుక రంగంలో లేకుంటే రామచందర్ రావు గెలుపు నల్లేరు మీద బండి లాగా సునాయస విజయం సాధించే వారు, ఓటు బ్యాంకు చీలి పోయి రామచందర్ రావు ఓటమి పాలయ్యారు. మేధావుల వర్గాన్ని ఒప్పించడంలో బిజెపి నాయకత్వం విఫలమైంది. పీవీ కూతురును రంగంలోకి దింపి కేసీఆర్ ప్రత్యర్థులు శిబిరంలో పెద్ద బాంబు పేల్చాడు. అటు చూస్తే శిఖరమంత పివీ ఇటు చూస్తే అధికార దిగ్గజం కేసీఆర్ ను ఎదుర్కోవడంలో బిజెపి విఫలమైంది. కపిలవాయి దిలీప్ కుమార్ ను ఎమ్మెల్సీ పోటీ నుంచి విరమింపజేసిన బిజెపి, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిను ఒప్పించినా లేదా రామచందర్ రావు గారిని ఒప్పించి పోటీ నుండి తప్పుకునేలా చేసి ప్రొఫెసర్ నాగేశ్వర్ కు మద్దతు తెలిపినా బిజెపి కి గౌరవ ప్రదమైన విజయం దక్కేది! కేసీఆర్ ఈ సీటు బిజెపీదే అన్నట్టు, ఓడినా పివీ గారి ఓటమికి బిజెపి కారణం అన్నట్టు స్టేట్ మెంట్ ఇచ్చే వారు. కానీ హైద్రాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో విజయదుంధిభి మోగించిన బీజేపీ కి ఈ విజయం కూడా దక్కితే టిఆర్ఎస్ నెగిటివ్ ఓటు మొదలయిందని తెలంగాణలో ఇక వచ్చేది బిజెపి ప్రభుత్వం అనే వాదనకు బలం చేకూరేది. ఇప్పుడు అటు పల్లా రాజేశ్వర రెడ్డి, ఇటు వాణీదేవీ విజయం వల్ల అధికార పార్టీకి సరికొత్త బలం చేకూరింది. ఇదే ఊపుతో సాగర్ ఎన్నికల్లో కూడా టిఆర్ఎస్ విజయ పతాక ఎగురవేయగలిగితే ఇక గాంధీ భవన్ లో కాంగ్రెస్ శిబిరం తలో దిక్కు రాజకీయ ఆశ్రయం కోసం పరుగులు తీయడం ఖాయం.
ఇప్పుడు బిజెపి కూడా కేసీఆర్ మాటే అంటున్నది. పివీ పరువు నిలపడానికి మేము మా సర్వ శక్తులు సిద్ధం చేయలేదని లేదా, ఎన్. ఆర్.ఆర్ గెలుపు ఖాయమయ్యేదని చెప్పవచ్చు. లేదా హుందాగా వాణీదేవికి శుభాకాంక్షలు చెప్పవచ్చు. ఏది ఏమైనా పివీ వారసురాలిని అని బిడ్డ రూపేణా వచ్చిన వాణీ దేవీని పోటీలోకి దింపి గెలిపించడం బాగుంది. నామినేటెడ్ పోస్ట్ కంటే పోరాడి గెలిచిన సీటు విలువ ఎక్కువ.
Also Read: వాణిదేవి సేఫ్ గేమ్ ఆడారా?
పీవీ కూతురు మీద పోటీకి నిలిపిన కాంగ్రెస్, టీడీపీ చేతులారా పరువు తీసుకున్నాయి. గొప్ప మేధావులుగా ముద్ర పడ్డ చిన్నారెడ్డి, ఎల్. రమణ కు వచ్చిన ఓట్లు చూస్తే ఆ రెండు పార్టీలు సిగ్గుతో తలవంచుకోవాలి. ఇక నైనా కాంగ్రెస్, బిజెపి, తెలుగు దేశం విబేధాలు ఎన్ని ఉన్నా సాగర్ లో అందరికి నచ్చిన ఒక అభ్యర్థిని నిలబేడితే విజయం ప్రతి పక్షాలది అవుతుంది లేదా ఓట్ల చిలికలో అధికార పార్టీ దే మళ్లీ విజయం అవుతుంది!