భగవద్గీత–90
భగవద్గీతను అర్ధం చేసుకుంటే మనకు ప్రపంచమంతా అర్ధమయినట్లే. మన అవసరము ఏమిటంటే, ఎదుటి మనిషిని సరిగా అర్ధం చేసుకోవడం.
భగవద్గీతలోని ప్రతి పదాన్ని, ప్రతి వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తూ అర్ధం చేసుకుంటూ ముందుకు సాగితే తోటివాడిని అర్ధం చేసుకునే జ్ఞానమబ్బుతుంది.
Every phrase should be analysed. ప్రతిదీ ఒక Zipped File అని చెప్పవచ్చు. పుట్టిన ప్రతిమనిషికీ లోకవ్యవహారము వలన కొన్ని దోషాలు అంటుకుంటాయి.
Also read: భగవంతుడు సర్వాంతర్యామి
ప్రతి వ్యక్తి స్వభావమును కొన్ని గుణాలు ఆశ్రయించుకొని ఉంటాయి. వాటిని అదుపులో ఉంచుకోవడం చాలా కష్టం, క్లిష్టం కూడా.
ఉదాహరణకు: కార్పణ్యదోషోపహతస్వభావః అనే వాక్యము గీతలోనిది తీసుకుందాము. దీని అర్ధము ఏమిటంటే ‘‘కార్పణ్యము అనే దోషము చేత కొట్టబడ్డవాడు’’ అని అర్ధము. జాలి, సానుభూతి అనే భావాలు ప్రవేశించి సహజస్వభావము కోల్పోయిన వాడు.
కార్పణ్యదోషోపహతస్వభావః
పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః
యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే
శిష్యస్తేఽహం శాధి మాం త్వాం ప్రపన్నమ్
‘‘నావాళ్ళు, నాబంధువులు అనే మమకారం వలన నాబుద్ధి నశించింది. మంచేదో, చెడేదో నాకు తెలియడం లేదు. శిష్యుడిగా నిన్ను ఆశ్రయించాను. నాకు ఏది శ్రేయోమార్గమో దానిని ఉపదేశించని’’ అర్ధించాడు అర్జునుడు.
Also read: శ్రద్ధాభక్తులు లేని కార్యం నిష్ప్రయోజనం
ఒక వ్యక్తికి కామము అధికముగా ఉన్నది అనుకోండి. వాడు `కామదోషోపహతస్వభావః` అనగా వాడు కామము అనే దోషముచేత కొట్టబడ్డ వాడు అని అర్ధము.
అలాగే `క్రోధదోషోపహతస్వభావ` అంటే వాడు క్రోధమనే దోషముచేత కొట్టబడ్డవాడు. అలాగే మనిషికి శత్రువులైన కామము, క్రోధము, లోభము, మదము, మాత్సర్యము. ప్రతి మనిషి ఏదో ఒక దాని చేతగానీ కొట్టబడుతున్నాడు కదా!
ఇక్కడ అర్జునుడు కృపణత్వము అనే దోషము చేత కొట్టబడుతున్నాడు అని అర్ధము. ఆ కృపణత్వమును తీసివేస్తే అర్జునుడు మరల తాను వీరుడినని, క్షత్రియుడనని ఎరుక పొందుతాడు.
`కృపణత్వము` అనగా ఇక్కడ ఆత్మజ్ఞానము లోపించుట అని చెప్పుకోవాలి. తనని తాను తన దోషమేదో తెలుసుకున్నాడు అర్జునుడు. ఆ దోషాన్ని పూర్తిగా తీసివేయవలసిన బాధ్యత కృష్ణుడిమీద ఉంచాడు. ఇక్కడే కృష్ణపరమాత్మ సరైన నిర్ధారణచేసి మనసుకు ఏ మందిస్తే సరిపోతుందో ఆ మందే ఇచ్చాడు. అది మనసు గీత.
అలాగే ముందు ముందు ‘‘అనుద్వేగకరం వాక్యం‘‘ అని,
యోగక్షేమం వహామ్యహంఅనీ,
యోగః కర్మసుకౌశలం అనీ,
లోకేస్మిన్ ద్వివిధానిష్ఠా అనీ,
సర్వధర్మాన్ ‘‘పరి’’త్యజ్య అనీ
ఎన్నో మహా వాక్యాలు మనకు తారసపడతాయి.
శంకరులు అన్నట్లు ఒక్క గుక్క గంగాజలం తాగినా, ఒక్కశ్లోకం భగవద్గీతలోనిది మననం చేసుకున్నా మనలను మనం తరింపచేసుకుంటాం.
Also read: పక్కవాడి పొడ భరించలేకపోతున్నారా?