- ఫిబ్రవరి నెలకు అత్యుత్తమ ఆటగాడు అశ్విన్
- ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ లో ఆల్ రౌండ్ షో
అంతర్జాతీయ క్రికెట్ మండలి సరికొత్తగా ప్రవేశపెట్టిన నెలవారీ అత్యుత్తమ క్రికెటర్ అవార్డును భారత స్పిన్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ గెలుచుకొన్నాడు.ఇంగ్లండ్ తో ముగిసిన నాలుగుమ్యాచ్ ల టెస్టు సిరీస్ ను భారత్ 3-1తో గెలుచుకోడంతో పాటు ఐసీసీటెస్ట్ లీగ్ ఫైనల్స్ చేరడంలో ప్రధానపాత్ర వహించిన అశ్విన్ ను ఐసీసీ ఫిబ్రవరి నెల అత్యుత్తమ క్రికెటర్ అవార్డు వరించింది.
గతనెలలో భారతజట్టు ఆడిన మూడుటెస్టుల్లో అశ్విన్ 176 పరుగులు సాధించడంతో పాటు 24 వికెట్లు సైతం పడగొట్టాడు. టెస్టు చరిత్రలోనే అత్యంత వేగంగా 400వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్ గా, భారత తొలి బౌలర్ గా రికార్డుల్లో చేరాడు. శ్రీలంక బౌలర్ ముత్తయ్య మురళీధరన్ తర్వాతిస్థానంలో నిలిచాడు.
Also Read: ప్రపంచ టెస్టు లీగ్ ఫైనల్స్ వేదిక ఖరారు
అశ్విన్ కు అత్యధిక ఓట్లు:
ఐసీసీ నెలవారీగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నఅభిమానుల ఓట్లతో అత్యుత్తమ క్రికెటర్లను ఎంపిక చేస్తూ వస్తోంది. ఐసీసీ ఓటింగ్ అకాడమీ ద్వారా అశ్విన్ ను ఎంపిక చేసినట్లు, అశ్విన్ కే అత్యధికంగా ఓట్లు వచ్చినట్లు నిర్వాహక సంఘం ప్రతినిధి ఇయాన్ బిషప్ ప్రకటించారు.
మహిళల విభాగంలో ఇంగ్లండ్ కు చెందిన టామీ బ్యూమోంట్ ఫిబ్రవరి నెలకు అత్యుత్తమ ప్లేయర్ అవార్డును సొంతం చేసుకొంది. న్యూజిలాండ్ తో ముగిసిన మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ లో బ్యూమోంట్ రెండు అర్థశతకాలు నమోదు చేసింది.
పురుషుల, మహిళల విభాగాలలో నెలవారీ అత్యుత్తమ ప్లేయర్ల అవార్డులను 2021 జనవరి నెలలోనే ఐసీసీ ప్రవేశపెట్టింది. జనవరి నెల అవార్డులను భారత వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్, మహిళల అవార్డును సౌతాఫ్రికా పేస్ బౌలర్ షబ్నిం ఇస్మాయిల్ గెలుచుకొన్నారు.
Also Read: విజయ్ హజారే టోర్నీలో పడిక్కల్ సెంచరీల మోత