నా బలం
నా బలగం
నా అధికారం
నా అంతస్తు
నా ప్రతిష్ట
నేను పండిత ప్రకాండుడిని
నేను విద్వన్మణిని
నేను ఆచార్యుడిని
నేను కవి సామ్రాట్టును
నేను అనితర సాధ్యుడిని
నేను జన నాయకుడిని
నాకు పక్కింటి వారెవరరో తెలియదు
నాకు అనవసర మాటలంటే గిట్టదు
నాకు స్థాయి తక్కువ మనుషులతో సంబంధం వద్దు
నాకు ఉపయోగపడే కొద్దిమంది చాలు
నాకు నా భజన బృందం చాలు
నాకు భళీ, దాసోహం అనేవాళ్ళు చాలు
నాకు గొడవల్లేని ప్రశాంతత కావాలి
నాకు పరిసరాల ప్రభావంలేని శాంతి కావాలి
నా తమ్ముడు సత్యాన్ని రాజకీయ పోలీసులు పట్టుకు పోయినా
నా చుట్టూ రౌడీ రాజ్యంలో అరాచకాలు వర్ధిల్లుతున్నా
నా మనశ్శాంతి భగ్నం కాకూడదు
నా ధ్యానానికి భంగం కలగ కూడదు
నా ప్రశాంత దివ్య జీవనం సాగాల్సిందే
నా సర్వాతీత సాధన సాగాల్సిందే.
Also read: అనుభవం
Also read: సమగ్రవిద్యే సంస్కారం నేర్పుతుంది
Also read: అ-పవిత్రులు
Also read: అర్పణం