నదులు, కొండలు, పట్టణాలు దాటి వెళ్ళా
నా సామ్రాజ్యలక్ష్మిని నాతో తెచ్చుకోడానికి
భీతహరినేక్షణ నాతో బయలుదేరింది పరివారాన్ని వదిలి
వారితోవీరితోనే కాదు, నాతోనూ నేను యుద్ధం చేశా
తనను నాతో కలుపుకోడానికి
సంశయాలన్ని పటాపంచలు చేసి
ఉద్విగ్న మనసుకు ఊరటనిచ్చే నా దేవిగా నిలిపా
శాంతం, సరళం, లలితం కలబోసిన మూర్తి
వెనువెంటరాగా ధీరోదాత్తంగా ముందు నడిచా.
మా పూదోటలో పూలు పూశాయి మా ఆశల ప్రతిరూపాల్లా
ఒడిదుడుకులు లేని మహానదిలా ప్రయాణం సాగింది.
కాలం తెచ్చిన మార్పులు, సంఘం చెక్కిన ముక్కలు
స్వభావంలో చేర్పులు సహజంగానే జరిగాయి.
కాని అంతర్లీనంగా మార్దవం, సుహృద్బావం ఉంటూనే ఉన్నాయి.
ఈ సహచర్యం చివరిదాకా కొనసాగాలని కోరుకుంటా
ఆ దేవదేవుని వేడుకుంటా, వేడుకుంటా.
Also read: చందమామ
Also read: అందం
Also read: పాత్రధారి
Also read: ఈశ్వరా
Also read: కొత్త సంవత్సరం