————————-
(‘SEVENTY ‘ FROM ‘THE WANDERER’ BY KAHLIL GIBRAN)
తెలుగు సేత:డా. సి. బి. చంద్ర మోహన్
43. సంచారి తత్త్వాలు
———————–
ఒక యువ కవి రాణితో ఇలా అన్నాడు.”నేను నిన్ను ప్రేమిస్తున్నాను” రాణీ “నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను బాబూ” అంది.
“కానీ నేను నీ కొడుకుని కాను. నేనొక మగవాణ్ణి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను.'” అని యువ కవి అన్నాడు.
అప్పుడామె ఇలా అంది. “నేను కొడుకులూ, కూతుళ్లకు తల్లిని. వాళ్ళు కొడుకులు, కూతుళ్లకు అమ్మా, నాన్నలు. నా కొడుకుల్లో ఒకని కొడుకు నీకంటే పెద్దవాడు.”
ఆ యువ కవి ఇలా అన్నాడు.”కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను.”
కొద్ది కాలం తరువాత ఆ రాణి చనిపోయింది. ఆమె ఆఖరి శ్వాస అనంత వాయువుల్లో కలిసే ముందు, ఆమె అంతరంగంలో ఇలా అనుకుంది .”నా ప్రియమైన వాడా! నా ఒక్కగానొక్క కొడుకా, నా యువ కవీ– ఏదో ఒక రోజు మనం మరలా కలుద్దాం. అప్పుడు నాకు డెబ్బది ఏళ్ళు ఉండవు.”
Also read: ప్రార్థన
Also read: నీడ
Also read: శాంతి ఒక అంటు వ్యాధి
Also read: మంచి — చెడు
Also read: కాలం