కపటం లేని జీవితం నాది
కవనంతో సహజీవనం నాది
భక్తి లేని జీవితం నాది
నిరంతర చింతన నాది
రాగ జీవితం నాది
విరాగ జీవితం నాది
గమ్యం లేని ప్రయాణం నాది
లక్ష్యం వైపుకే సాగుతుందని ధీమా నాది
అన్నీ ఉన్న జీవితం నాది
అవేవీ నావనుకోని స్పృహ నాది
ఆశ నిరాశల మధ్య
ఆనందం దుఖం మధ్య
వెలుతురు చీకట్ల మధ్య
ఒక బిందువు
నిర్వచనాతీతమైన సింధువు.
Also read: “ప్రపంచ విద్యార్థుల రోజు”
Also read: పేదరిక నిర్మూలన దినోత్సవం
Also read: “హంతకులు”
Also read: నా మాట
Also read: ‘‘అంతా మన మంచికేనా?’’