నేను స్కూలీని
అవును, బడిలో పని చేస్తాను.
పిల్లలకు పాఠాలు బాగా చెప్తాను
విద్యార్థులను పట్టుకురమ్మని ఊరిమీదకు నన్ను పంపించకపోతే
గుమాస్తాలాగా రికార్డులు రాయమనకుంటే
రోజుకో పరీక్ష పెట్టి పేపర్లు దిద్దమనకుంటే
ప్రభుత్వ పథకాలన్నిటికీ ప్రచార సారథిగా వాడకుంటే
పిల్లలకు వండి వార్చే బాధ్యత లేకుంటే
జనాభా లెక్కలు రాయమని పంపకపోతే
ఎన్నికల నిర్వహణకు ఉపయోగించుకోకపోతే.
నేను ఉపాధ్యాయుణ్ణి అంటారందరూ
గురువుగా గుర్తించరెవరూ.
విద్యార్థుల శారీరక, మానిసిక, నైతిక
అభివృద్ధికి మూలకారకుడనని ఎవరూ గుర్తించరు
పాఠంతోపాటు జీవిత విలువలు రంగరించి
విద్యార్థల భవిత అమృతమయం కావాలని
తపించే ఆశాజీవినని ఎవరూ గుర్తించరు.
రెండు మార్కులు తగ్గాయని గద్దించే తల్లిదండ్రులు
పాఠం చెప్పడం కంటే హాజరు వేయడం ముఖ్యమని భావించే అధికారులు
విద్యనూ వ్యాపారంగా మలచుకున్న యజమానులు
మనో వికాసం గురించి ఎవరూ మాట్లాడరు,
వేదికలెక్కినప్పుడు తప్ప.
Also read: వెన్నెముక లేని మనిషి
Also read: మూడో కన్ను
Also read: యవ్వనం
Also read: విధి విలాసం
Also read: గుమ్మడి పువ్వు