* ఏప్రిల్ 9 నుంచి 6 వేదికల్లో సమరం
* మే 30న మోడీ స్టేడియంలో ఫైనల్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ సమరానికి ముహూర్తం కుదిరింది. ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ దేశంలోని ఆరునగరాలు వేదికలుగా జరిగే ఈ టోర్నీ కార్యక్రమాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.
2019 సీజన్ వరకూ దేశంలోని 11 నగరాలలో నిర్వహిస్తూ వచ్చిన ఐపీఎల్ ను …కరోనా వైరస్ నేపథ్యంలో దేశంలోని ఆరునగరాలకు మాత్రమే పరిమితం చేసినట్లు ఐపీఎల్ బోర్డు వివరించింది.
Also Read : ఐసీసీ టెస్టు లీగ్ ఫైనల్స్ లో భారత్
ఐపీఎల్ వేదికల్లో చోటు లేని హైదరాబాద్..
కరోనావైరస్ కారణంగా గత సీజన్ పోటీలను దుబాయ్, అబుదాబీ, షార్జా నగరాలు వేదికలుగా నిర్వహించిన బీసీసీఐ…ప్రస్తుత 2021 సీజన్లో మాత్రం…స్వదేశంలోనే పోటీలు నిర్వహించాలని నిర్ణయించింది. కోవిడ్ తాజానిబంధనలకు అనుగుణంగా మ్యాచ్ లు నిర్వహించడానికి నడుంబిగించింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, కోల్ కతా నగరాలను మాత్రమే ఐపీఎల్ వేదికలుగా ఎంపిక చేశారు.
Also Read : 100 వన్డేల క్లబ్ లో హర్మన్ ప్రీత్ కౌర్
ముంబైతో బెంగళూరు ఢీ
ఏప్రిల్ 9న చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరిగే ప్రారంభమ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ తో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తలపడనుంది. మే 30న అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా టైటిల్ సమరం నిర్వహిస్తారు. పోటీల నిర్వహణసమయంలో ప్రభుత్వం తమకు పూర్తిసహకారాన్ని అందించడానికి సమ్మతించినట్లు ఐపీఎల్ బోర్డు చైర్మన్ తెలిపారు. 52 రోజులపాటు 60 మ్యాచ్ లుగా జరిగే ఐపీఎల్ కోసం…మొత్తం ఆరు వేదికల్లోనూ బయోబబుల్ వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోనున్నారు.
Also Read : స్వదేశీ సిరీస్ ల్లో కెప్టెన్ కొహ్లీ రికార్డు