‘‘వందల కోట్లు పంపిణీ, వేలాది కోట్ల జీవోలు, అధికార బలంతో సీఎం కెసిఆర్ ప్రభుత్వం ఈటెల రాజేందర్ మొఖం అసెంబ్లీ లో కనిపించవద్దు అనే పంతం నెరవేరలేదు. ప్రలోభాలకు లొంగకుండా ప్రజలు చరిత్ర తిరగరాశారు,’’ అంటూ మధువన్ గార్డెన్స్ లో హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేంద్ర శనివారం సాయంత్రం వ్యాఖ్యానించారు.
‘‘విద్యాసాగర్ రావు, తరుణ్ చుగ్, బండిసంజయ్, కిషన్ రెడ్డి, విజయ శాంతి, మురళీధర్ రావు, డీకే అరుణ, వివేక్ వెంకట స్వామి, బాబు మోహన్, రఘునందన్ రావు, బోడిగ శోభ, అరవింద్ , జిల్లా అధ్యక్షులు కృష్ణ రెడ్డి, రావు పద్మ, ఇంఛార్జి లు, పార్టీ నేతలు, కార్యకర్తలు అందరి కృషి ఫలించింది. కరీంనగర్ గడ్డ చైతన్యవంతం అయినది. హుజూరాబాద్ అంతకంటే చైతన్యవంతమైనది. ఒప్పుకోదు. మా బిడ్డ మీద కెసిఆర్ దాడి చేస్తున్నారు. ధర్మం, ప్రజాస్వామ్యం కాపాడుకోవాలి అని ప్రజలు నిర్ణయించుకున్నారు. అక్రమ డబ్బు రూ. 500 కోట్లు పంచి పెట్టారు. వందలమంది పోలీసులు పని చేశారు. అయినా కెసిఆర్ ఫ్యూజు పీకాలని ప్రజలు డిసైడ్ అయ్యారు’’ అంటూ రాజేంద్ర అన్నారు.
ఈ గడ్డ మీద ఉన్న అన్నీ సంఘాలు నాగెలుపులో భాగస్వామ్యమయ్యారు. తెరాసా నేతలు ఓటుకి 6 వేల రూపాయలు ఇచ్చారు. చివరికి ఓటుకి 10 వేలు ఇచ్చారు. పోలింగ్ సిబ్బందికి కూడా డబ్బులు ఇచ్చారు. ఈ దుర్మార్గాన్ని పత్రికలు, మీడియా ఆపలేక పోయింది. కానీ దానిని ప్రజలు నిలువరించనున్నరు. నాయకులు లేని దగ్గర ప్రజలే నాయకులు అయ్యారు. ప్రతి ఒక్కరూ గొప్పగా పని చేశారు. యువత, విద్యార్థులు శ్రమించి పని చేశారు. దళితబంధు రాదుఅన్నా కూడా భయపడలేదు. ప్రవాసభారతీయులు కూడా నాకోసం పని చేశారు. హైదరాబాద్ లో ఉన్న వారిని వారు పిలిపించుకున్న కూడా వారు వచ్చి నాకు ఓటు వేశారు,’’ అని బీజేపీ అభ్యర్థి వ్యాఖ్యానించారు.
‘‘నిరంకుశత్వాన్ని బొందపెట్టడంలో ప్రజలంతా ఏకమయ్యారు. ఈ గెలుపును తెలంగాణ ప్రజలకు అంకితం ఇవ్వబోతున్నాము. నవంబర్ 2 తరువాత యావత్ తెలంగాణలో రాజకీయంగా పెను మార్పులు వస్తాయి’’ అని రాజేంద్ర చెప్పారు.
ప్రేమ ముందు కుట్ర ఓడిపోయింది: జితేందర్ రెడ్డి
హుజూరాబాద్ ఉపఎన్నికలలో బీజేపీ ఇన్ చార్జి జితేందర్ రెడ్డి మాట్లాడుతూ, ‘‘హుజూరాబాద్ ప్రజలకు ధన్యవాదాలు. కెసిఆర్ కుట్రపూరిత వ్యవస్థలో ఎజరుగుతుంది అని భయపడ్డం కానీ ఈటెల మీద ప్రేమ ముందు అది ఓడిపోయింది. ఒక మనిషి ఇంత దృఢంగా ఉండి ఈ వ్యవస్థను ఎదుర్కొన్నాడు అంటే అతనికి ఎన్ని గుండెలు ఉండాలి. నవంబర్ 2 నుండి తెలంగాణ చరిత్ర మారబోతోంది. కెసిఆర్ కి గుణపాఠం తప్పదు. కష్ట పడి పని చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. 2023 లో గోల్కొండ కోట మీద ఎగిరేది కాషాయ జెండనే’’ అని జితేందర్ రెడ్డి ప్రకటించారు.
కృష్ణా రెడ్డి, రావు పద్మ, జితేందర్ రెడ్డి, ప్రిమెందర్ రెడ్డి, చాడా సురేష్ రెడ్డి, తుల ఉమ, ఏనుగు రవీందర్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, నందీశ్వర గౌడ్, అశ్వద్ధామ రెడ్డి ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా, పత్రిక మిత్రులకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.