భగవద్గీత – 14
మనిషి మెదడులో Amygdala ‘‘అమిగ్దల’’ అని బాదం గింజ ఆకారంలో ఒక భాగముంటుంది. కోపము, చిరాకు, ఉత్సుకత, వ్యాకులత, విచారము, colourful vision, sexual interest వీటన్నిటినీ కూడా అమిగ్దలను విద్యుత్ ప్రకంపనల ద్వారా ప్రేరేపించినప్పుడు మనం పొందవచ్చు. అది చేసే మాయ అంతా ఇంతా కాదు!
Daniel Goleman తన Emotional Intelligence అనే పుస్తకంలో ఇలా వ్రాస్తారు: ‘‘భావావేశాలు మనలను ప్రేరేపించి ఏదో ఒకటి వెంటనే చేసేటట్లు చేస్తాయి. మన ఆలోచనల మీద దుప్పటి కప్పి వేస్తాయి! మనలను కోపము, చిరాకు, కామము ఇలాంటివి చుట్టు ముట్టినప్పుడు Amygdala క్రియాశీలమయ్యి మన విచక్షణాశక్తి (rational brain, neo cortex)” ని hijack చేస్తుంది. అప్పడు మనిషి విచక్షణారహిత విధ్వంసానికి పాల్పడతాడు.
Also read: కర్మ బ్రహ్మము నుంచి పుట్టినది
కోపము అయినా విధ్వంసమే. కామము అయినా విధ్వంసమే. కామంతో కళ్ళు మూసుకొని పోయినవాడికి భయము సిగ్గు ఏవీ ఉండవు.
‘‘కామాతురాణామ్ న భయం న లజ్జ!” ఇదీ నేటి శాస్త్రం చెబుతున్నది!
మరి భగవద్గీత!
కామఏష క్రోధఏష రజోగుణ సముద్భవః
మహాశనో మహా పాప్మా విధ్యేనమ్ ఇహ వైరిణమ్!
మనలోని క్రియాశీల శక్తిని (activity) రజోగుణం అని అంటాము కామ, క్రోధములు ఈ క్రియాశీల శక్తినుండి పుట్టినవే, వీటికి ఆకలెక్కువ, మహా పాపకారిణులని తెలుసుకో అర్జునా అని చెపుతున్నారు పరమాత్మ!
Also read: స్వధర్మ ఆచరణే శరణ్యం
అంతేనా!
భగభగ మండే జ్వాల పొగతో ఎట్లా కప్పబడుతుందో మసిబారిన అద్దం ఏ విధంగా ఉంటుందో తల్లి గర్భములో మావిచేత శిశువు ఎలా కప్పబడుతుందో ఆ విధంగా జ్ఞానం (rational mind) కామము చేత కప్ప బడుతుంది..
‘‘ధూమేనా వ్రియతే వహ్నిః యధాదర్శో మలేన చ
యధోల్బేనావృతో గర్భః తధాతేనేదమావృతమ్’’
Also read: అనుకరణ మానవ నైజం