రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
నా గతం అసంగతం అన్నారు
నా నాగరికత శిధిలమైంది కాలంతో
నా మీద దండయాత్ర జరిగింది
పదే పదే దండయాత్రలు
దేవాలయాలు ధ్వంస మయ్యాయి
దేవుళ్ళ అభయ హస్తాలు విరిగాయి
దివ్య తేజస్సుతో వెలిగే ప్రసన్న రూపాల
ముక్కులు చెక్కేశారు
భక్తులను కత్తులతో బెదిరించారు
ఊహూ అన్నవాళ్లను చంపారు
దేవుళ్ళు సహనంతో ఉన్నారు
మనుషులు శాంతి అన్నారు.
నాగరికత నశించినా
సంస్కృతి మిగలే ఉంది
లాభమే పరమావధిగా భావించే వ్యాపారి
ఫిరంగులే శక్తిగా భావించాడు
అనాగరికతను సంస్కరిస్తానంటూ
దోచుకోవడమే సంస్కారం అనే పాఠం నేర్పించాడు
వట్టిపోయిన గోవును వదలి వెళ్ళాడు.
ప్రాచీన మూలాలను పునరుద్ధరించక
శ్రామికవర్గ వ్యవస్థపై మోజుతో
స్వలాభం, అధికారం చాలని
కళ్ళు మూసుకున్నారు స్వదేశీ పాలకులు
దివాలా తీసే పరిస్థితిలో
పెట్టుబడులను ఆహ్వానించారు
ఆస్తులు అమ్ముకుంటూ
అప్పులు పెంచుకుంటూ సాగిస్తున్నారు మనుగడ.
నేడు సమర్ధ నాయకత్వంతో
ప్రపంచవ్యాప్త గుర్తింపు
కాగితాలమీద ఎంతో ఆర్ధిక ప్రగతి
అంతకు మించి బజారులో ధరల మంట
పేదవాడిని ఆదుకోవడమే పరమావధి
సామాన్యుడి బాగే లక్ష్యం అంటూనే
పెద్దవాడికి అన్నిటా సహకారం
పారిశ్రామిక ప్రగతి ఇస్తుందట ఉద్యోగాలు
మనిషి లేకుండా నడిచే మరయంత్రాలు పరిశ్రమల్లో
కాదంటే మనషులకు బదులు రోబోలు
మనిషి చాలా అనవసరం అయిపోయాడు
ఓటు వేయడానికి తప్ప మరెందుకూ పనికిరాడు.
Also read: “కష్టం – సుఖం”
Also read: నవరాగం