భగవద్గీత – 23
“మావాడి జాతకంలో డాక్టర్ అవుతాడు అని ఉంది. నాకు మా జ్యోతిష్యుడు చెప్పాడు. ఆయన చెప్పినవి ఖచ్చితంగా జరిగితీరతాయట. అందుకే మా అబ్బాయి కి బైపిసి గ్రూపు ఇప్పించాను”. ఈ విధంగా కొంత మంది తండ్రులు తమ పిల్లవాళ్ళు ఏమి కాబోతున్నారో ముందే నిర్ణయించేస్తున్నారు! పిల్లలకు ఇష్టం ఉందో లేదో తెలుసుకోకుండా తీవ్రమైన వత్తిడికి గురిచేస్తున్నారు!
జ్యోతిష్యుడు అన్నీ ఖచ్చితంగా చెపుతాడా?
Also read: రాగద్వేషాలను విడిచినవాడు సన్యాసి!
జ్యోతిశ్శాస్త్రంలో 9 గ్రహాలు 12 ఇళ్ళలో తిరుగుతూ మన జీవితాన్ని నిర్దేశిస్తాయి అని నమ్ముతున్నాం! మన రాజ్యస్థానము, కర్మ స్థానం 10 వ ఇల్లు (జాతకచక్రంలో) బట్టి నిర్ణయిస్తున్నాం!
ఆ ఇంటి అధిపతి ఎవరు? ఆయన లక్షణాలు ఏమిటి? మన జాతక చక్రంలో ఆయన ఎక్కడ ఉన్నాడు? మిత్రుడి ఇంటిలోనా శత్రువు ఇంటిలోనా? ఆయన మీద ఎవరి దృష్టులున్నవి? ఆయన స్వస్థానంలో ఉన్నాడా? ఉచ్ఛస్థానంలో ఉన్నాడా? నీచ పడ్డాడా? ప్రస్తుతం జాతకుడికి ఏ దశ నడుస్తున్నది?
Also read: వర్తమానం ప్రధానం
ఇంతేనా? ఇంకా ఎన్నో సూక్ష్మమయిన అంశాలు పరిశీలన చేసి చెప్పాలి. వీటిలో ఏ ఒక్కటి తప్పుగా అన్వయించినా ఫలితం తప్పు వస్తుంది. ఇన్ని విషయాలు ఆలోచించి నిర్ణయించగల కూలంకష ప్రజ్ఞావంతుడు ఉన్నారా?
ఉన్నారనే అనుకొందాము!
ఫలితం చెప్పే సమయంలో ఆయన మానసిక స్ధితి ఎలా ఉందో? ఇన్నిటిని దాటుకొని సరి అయిన ఫలితం వస్తుందా? ఏమో పరమాత్ముడి కెరుక!
అసలు ఈ విషయంలో కృష్ణపరమాత్మ ఏం చెప్పారు?
న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః
న కర్మ ఫలసంయోగం స్వభావస్తు ప్రవర్తతే!
లోకుల కర్తృత్వాన్ని గానీ వారి ‘‘కర్మలను’’ గానీ, కర్మఫల సంయోగాన్ని గానీ భగవంతుడు సృజింపడు! లోకులు చేసే పనులను వారి ‘‘స్వ’’భావమే నిర్ణయిస్తుంది!
కాబట్టి మన పిల్లవాడి ప్రవృత్తి, వాడి స్వభావము ఏ దిశలో ఉన్నదో గమనించి ఆ దిశగా పిల్లలను నడిపించి వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దితే పిల్లలకు వారి చదువులో ఒత్తిడి ఉండదు!
You are the maker of your destiny అని వివేకానందుడు అన్నది ఇందుకోసమే!
Their passion drives them to their destination.
Also read: గురువు ప్రసన్నుడై అనుగ్రహించేది జ్ఞానం