వసంత కాలం
మావి చిగుళ్ళు
కోయిల గానాలు
కవి సమ్మేళనాలు
పాడేసిన పాట.
నేటి మాట
ప్రాణాంతక మహమ్మారి
మూడో ప్రపంచ యుద్ధం
ఆర్ధిక ఆంక్షలు
ఆధిపత్య ఆరాటం
సుఖం కోసం పోరాటం
సుఖమే సంతోషమనుకునే మూర్ఖత్వం.
మంచి కోసం యుద్ధం అంటాడొకడు
నన్ను కాదంటే చంపుతానంటాడు మరొకడు
ప్రేమ అన్న వాడిని పాతేశాం
అహింస అన్నవాడిని తరిమేశాం
సత్యం అన్నవాడిని చంపేశాం
శాంతి అనే ధైర్యం లేకుండా చేశాం.
ఉదాత్త ప్రవర్తనకు బూజు పట్టించాం
మంచి వాడిని చేతగాని వాడిని చేశాం
నేరాలు చేసిన వాళ్లను హీరోలు చేశాం
‘పక్కా లోకల్‘ అనే సంకుచితత్వానికి జై అంటున్నాం
‘తగ్గేదే ల్యా‘ అనే అహంకారిని ఆదర్శంగా తీసుకున్నాం
రాముడు, బుద్దుడు, గాంధీలు బ్రతికుంటే
ఉరేసి చంపేసే వాళ్లం.
మరి వసంత కాలం ఇలా వస్తుందా ఇప్పుడు?!
Also read: పరిణామం
Also read: మహిళా దినం
Also read: జీవిత పరమార్ధం
Also read: వేరు
Also read: కవిత్వం