గృహిణులకు జీతాలు ఇవ్వాలి. ఈసారి మహిళా దినోత్సవం సందర్భంగా మారుమోగనున్న డిమాండ్ ఇదే… గత ఏడాది కన్నా మహిళల పై అత్యాచారాలు.. దాష్టికాలు పెరిగాయి. 7.3 శాతం పెరిగాయి. రోజు రోజుకు మహిళల లో దేశంలో అభద్రతా భావం పెరుగుతోంది. దీనిపై పోరు కొనసాగుతోంది… మరోవైపు ప్రపంచంలో కోట్లాది మంది గృహిణులకు వేతనం ఎందుకు ఉండకూడదు అనే విషయం ప్రస్తుతం చర్చానీయాంశం అయింది.
చైనాలోని బీజింగ్ లో ఒక విడాకులు కేసులో కోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు చర్చ విస్తారంగా జరగడానికి కారణం అయింది. అయితే ఇంటిపనులు, పిల్లల పెంపకం, సంరక్షణ, తదితరములు చూసే గృహిణులకు జీతాలు ఎవరు ఇవ్వాలి అనేదే సమస్య… భారతదేశం లో 16 కోట్లమంది గృహిణులు ఉన్నారు. వీరు హోమ్ మేకర్స్.. పురుషుల కన్నా మూడు నుంచి నాలుగు గంటలు ఎక్కువ పని చేసే వారు.. చెమట ఓడ్చే వారన్న మాట. అన్నం.. కూరలు వండడం.. క్లీనింగ్ పనులు.. పిల్లల.. భర్త బట్టలు ఉతకడం.. ఇంకా ఎన్నో కుటుంబ నిర్వహణలోని పనులు.. తల్లి.. భార్య.. సోదరి పాత్రలో ఉండి పనిచేస్తుంది.. శ్రమ చేస్తుంది మహిళ.. పురుషాధిక్యత గల సమాజంలో సంతానంలో పురుషుడినే వారసుడిగా పిలుస్తారు.
Also Read : మహిళలు పురుషులతో సమానం కాదు, వారి కంటే అధికులు
తమిళనాడులో గృహిణికి వేతనం అంశం సినీనటుడు కమలహాసన్ తన మేనిఫెస్టో లో పార్టీ తరపున పెట్టారు. ఇది కూడా చర్చ జరుగుతోంది. బీజింగ్ కోర్ట్ తీర్పులో 5 సంవత్సరాలు భర్త తో ఉండి ఇంటి పనులు చూసుకున్నది కాబట్టి తన కెరియర్ ను కోల్పోయింది కాబట్టి రు.5 లక్షల పై చిలుకు పరిహారం జీతం కింద ఇవ్వాలని పేర్కొంది… ఈ తీర్పును ప్రపంచం మొత్తంలో 60 కోట్లకు పైగా మంది సోషల్ మీడియాలో చూసిన దాఖలాలు ఉన్నాయి. గ్రామీణ మహిళ ప్రతి రోజు14 గంటలు పనిలో ఉంటుంది. గ్రామీణ పురుషులతో పోలిస్తే 2.5 గంటలు ఇది ఎక్కువ..ఉద్యోగం చేసే పురుషులకన్నా మహిళల పని నాలుగింతలు ఎక్కువ.. అదికూడా నిజాయితీగా ఇష్టపడి కష్ట పడుతున్న దాఖలాలు ఉన్నాయి.
Also Read : స్త్రీ శక్తి… స్త్రీ విముక్తి… స్త్రీ స్వేచ్ఛ… స్త్రీ స్వాతంత్ర్యం… స్త్రీ సమానత్వం… స్త్రీ సాధికారత…???
అయినా ఈ పనులకు విలువ లేదు.. గౌరవం లేదు.. పైగా వేధింపులు.. హత్యాచారాలు.. ప్రతి రోజు వెలుగు చూస్తున్న సంఘటనలు అద్దంలా ముందు ఉంటాయి.. రిజిస్టర్ అవుతున్న కేసులు సాక్ష్యం.. క్రిమినల్ జస్టిస్ వైఫల్యం వల్ల దేశంలో ఆడబిడ్డల పై గృహ హింస పెరుగుతున్నది.. పురుషుల ఆలోచనా విధానంలో హోమ్ మేకర్లకు జీతం వస్తే.. మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.. సిస్టం లోను మార్పు తో పాటు గృహిణికి కుటుంబం పై ఆధార పడకుండా స్వీయ ఆర్థిక స్వేచ్ఛ రక్షణకు ఒక గ్యారంటీ నమ్మకం ఏర్పడుతుంది. కుటుంబం లో గౌరవం దక్కుతుంది… ఈ నెల 8 న మహిళా దినోత్సవం సందర్భంగా నైనా గృహిణులకు వేతనం పై పాలకులు ఆలోచించడం ప్రారంభించి ఆ దిశన ముందుకు వెళుతారని ఆశిద్దాం.
Also Read : పండంటి కాపురానికి పదహారు సూత్రాలు