- డెమొక్రాటిక్, రిపబ్లికన్ పార్టీలదే 175 సంవత్సరాలుగా హవా
- నల్ల జాతీయుల బానిస బంధనాలను తెంచిన లింకన్
- ప్రజాదరణ ఓట్లలో ఓడి ఎలక్టొరల్ కొలేజీ ఓట్లలో గెలిచిన బుష్, ట్రంప్
- మరికొన్ని గంటలలో అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు
గణేశ్ వఠ్యం – కొలంబస్ (అమెరికా)
సుమారు ఇరైవ ఎనిమిది సంవత్సరాల కిందట మా తల్లిగారి గురువుగారు రామశరణ్ గా పేరుగాంచిన శ్రీ కుందుర్తి వెంకట లక్ష్మీనరసయ్యగారిని నేను ఇండియా వచ్చినపుడు కలిశాను. ఆ సందర్భంలో వారు నన్ను ‘ఎక్కడరా అబ్బాయి నువ్వుండేది?’ అని అడిగారు. ‘అమెరికా లో ఉంటున్నాను తాతగారూ,’ అని నేను చెప్పినపుడు పురాణకాలంలో ఆ ప్రాంతాన్ని ‘ఆమేరుక’ అనేవారు. అది కాలక్రమేణా అమెరికాగా మారిపోయింది అని అన్నారు. కానీ మేరు పర్వతానికి అవతల ఉన్నా లేక ఇవతల ఉన్నా పదవి కోసం పాకులాడే రాజకీయాలు, వాటిని శాసించే రాజకీయ ఫీట్లూ ఎక్కడైనా ఒక్కటే. 1792వ సంవత్సరంలో ఇద్దరు ప్రభుత్వంలో ఉన్న ప్రధాన వ్యక్తుల మధ్య అంకురించిన సైద్ధాంతిక విబేధాలు రెండు ప్రముఖ రాజకీయ పార్టీల పుట్టుకకు కారణభూతమైనాయి అన్నది అతిశయోక్తి కాదు.
అమెరికాను శాసిస్తున్న రెండు పాత పార్టీలు
నేటి అమెరికా రాజకీయాలలో పురాతనమైన పెద్ద రాజకీయపార్టీలు (Grand Old Party, GOP) డమొక్రాటిక్, రిపబ్లికన్ పార్టీలు. గడచిన నూట డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఈ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు మాత్ర మే అమెరికా అధ్యక్షులుగా ఎన్నికైనారు. ఈ పార్టీల ఆవిర్భావానికి సంబంధించిన పూర్వాపరాలలోకి వెడితే అధ్యక్షుడు అనే పదానికి అర్థం చెప్పిన వ్యక్తి ప్రపంచంలోనే తొలి అధ్యక్షుడుగా ఏకగ్రీవంగా నియుక్తుడైన స్వతంత్ర అభ్యర్థి జార్జ్ వాషింగ్టన్. ఆయన నియమించిన మంత్రివర్గంలో ప్రముఖులు విదేశాంగశాఖా మంత్రిగా పనిచేసిన ధామస్ జెఫరసన్, ఆర్థికశాఖ మంత్రిగా పనిచేసిన అలెగ్జాండర్ హామిల్టన్. ఒకప్పుడు బ్లర్టన్ కబంధ హస్తాలలో నలిగిపోయిన అమెరికాని ఆర్థికపరంగా, సైనికపరంగా ఒక బలమైన దేశంగా తీర్చిదిద్దిన నాయకుడు హామిల్టన్.
ఫెడరల్ వ్యవస్థకు ఆద్యుడు హామిల్టన్
అలెగ్జాండర్ హామిల్టన్ 1791వ సంవత్సరంలో ఫెడరల్ విధానాలకు పునాది వేశాడు. ధామస్ జెఫరసన్, హామిల్టన్ మధ్యన రాజ్యాంగబద్ధమైన, సిద్ధాంతపరమైన విభేదాల వలన ధామస్ జెఫర్సన్ ఆధ్వర్యంలో 1792వ సంవత్సరంలో స్థాపించిన పార్టీ రిపబ్లకన్ పార్టీ. అప్పుడు రిపబ్లికన్ పార్టీ, ఫెడరలిస్ట్ పార్టీ ఉండేవి. ఆ తర్వాత కాలంలో వచ్చిన అధ్యక్షుల అలోచనా సరళిని అనుసరించి 1825వ సంవత్సరంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఆండ్రూ జాక్సన్, ఉపాధ్యక్షుడు జాన్ కాలహాన్ నేతృత్వంలో డెమొక్రాటిక్ పార్టీ ఆవిర్భవించింది. అమెరికా అధ్యక్షుడు జాచరీ టేలర్ (1849) విగ్ పార్టీని స్థాపించిన ప్రముఖులలో ఒకరు.
అంతర్యుద్ధం, నల్లజాతీయులకు బానిసత్వం నుంచి విముక్తి
1861వ సంవత్సరంలో అమెరికా దేశానికి రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్షుడుగా ఎన్నికైన వ్యక్తి అబ్రహాం లింకన్. ఆయన అధ్యక్షుడుగా ఉన్న కాలంలో ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య 1861-65 సంవత్సరాలలో జరిగిన సివిల్ వార్ ని (అంతర్ యుద్ధాన్ని) అణిచివేసి అమెరికా సంయుక్త రాష్ట్రాలను ఏకం చేసి సమైక్యతను చాటాడు. అప్పటి నుంచి అమెరికా సంయుక్త రాష్ట్రాలు అనే మాట వాడుకలోకి వచ్చింది. అలా1855వ సంవత్సరంలో ఇరు పార్టీల మధ్య మొదైలెన పోటీ నేటికీ కొనసాగుతూనే ఉంది. గడచిన నూట డైభ్భ ఐదు సంవత్సరాల కాలంలోనూ 96 సంవత్సరాలు రిపబ్లికన్ పార్టీకి చెందిన వ్యక్తులు అమెరికా సంయుక్త రాష్ట్రాలను పరిపాలించారు. తక్కిన కాలంలో డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్షులు పరిపాలించారు.
అమెరికాను అజేయశక్తిగా నిలపడం పరమావధి
సిద్ధాంతాలు వేరైనా రెండు పార్టీల లక్ష్యం అమెరికాను సైనికంగా అజేయంగా నిలపడమే. డెమొక్రాటిక్ పార్టీది వికేంద్రీకృత ప్రభుత్వవిధానం, సామాజిక సమానత్వం, సామాజిక బాధ్యత. రిపేబ్లకన్ పార్టీ సిద్ధాంతం కేంద్రీకరణ ప్రభుత్వ విధానం, వ్యక్తి స్వాతంత్ర్యం, సేవలు, హక్కులు, బాధ్యతలు. వికేంద్రీకృత ప్రభుత్వ విధానాల వల్ల పనులు తొందరగా జరగవు అన్నది రిపేబ్లకన్ పార్టీ వాదన. అలాగే సైనిక విధానం. డెమొక్రాటిక్ పార్టీ సైన్యంపైన తక్కువ ఖర్చు చేస్తుంది. సుంకాలు వారి వారి హోదాను అనుసరించి వసూలు చేసే విధానాలని డెమొక్రాట్లు ప్రవేశ పెడతారు. సుంకాలు అందరికీ సమానంగా ఉండాలన్నది రిపబ్లకన్ పార్టీ సిద్ధాంతం. సిద్ధాంతాలు వేరైనా ప్రభుత్వం మారినప్పుడు ముందు ప్రభుత్వాలు చేసిన శాసన్నలనిటినీ సాధ్యమైనంతవరకూ కొనసాగించడం ఈ పార్టీల పద్ధతి.
విధానాలు వేరైనా, నిర్ణయాలు కొనసాగుతాయి
పార్టీల ఉద్దేశాలు స్వచ్ఛమైనవీ, ప్రజల సంక్షేమానికి అనుగుణమైనవీ అయినప్పుడు దేశం ప్రగతిపథంలో దూసుకుపోతుందని చెప్పడంలో సందేహంలేదు. అందుచేతనే నిన్నటి ప్రఖ్యాత శిల్పి గుటెన్ బర్గ్ మౌంట్ రాష్మోర్ మీద తొలి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ , రాజ్యాంగ రూపకర్త, అధ్యక్షుడు ధామస్ జెఫర్సన్, అమెరికా సంయుక్త రాష్ట్రాల తొలి అధ్యక్షుడు అబ్రహాం లింకన్ , అడవులూ, జంతవుల అభివృదికి విశేషమైన తెడ్పాటు అందించిన అధ్యక్షుడు టెడ్డీ రూజెవల్ట్ ల ముఖాలు చెక్కి వారందించిన సేవలకు చిహ్నంగా ఒక స్తూపాన్ని దేశానికి అంకితకిచ్చాడు.
వైవిధ్యభరితమైన ఎన్నికల విధానం
అమెరికా అధ్యక్ష పదవిని నిర్వహించే విధానం మిగిలిన దేశాలతో పోల్చితే వైవిధ్యంగా ఉంటుంది. ఎన్నికల లెక్కింపులో ప్రతి రాష్ట్రంలో ఎక్కువ ప్రజాదరణ (Popular Vote) పొందిన వ్యక్తి ఆ రాష్ట్రానికి నిర్దేశించిన ఎలక్టొరల్ కొలేజి వోట్లను (Electoral College Votes) అన్నిటినీ పొందుతాడు. వాషింగ్టన్ డీసీ సహా మొత్తం 50 రాష్ట్రాలలో కలిపి మొత్తం 538 ఎలక్టొరల్ కొలేజ్ వోట్లు ఉంటాయి. వాటిలో 270 వోట్లు ఏ అభ్యరికి వస్తే ఆ వ్యక్తి అగ్రరాజ్యమైన అమెరికా సంయుక్త రాష్ట్రాలను తరువాత నాలుగు సంవత్సరాలు అధ్యక్షుడుగా పరిపాలిస్తాడని నిర్ణయిస్తారు. అన్ని రాష్ట్రాల ప్రజాదరణ ఓట్లు కలిపితే వచ్చే మొత్తంలో ఒక అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చినా ఎలక్టొరల్ కొలేజీ వోట్లలో ఆధిక్యం వచ్చిన వ్యక్తికే అధ్యక్ష పట్టాభిషేకం జరుగుతుంది. రిపేబ్లకన్ పార్టీ రంగు ఎరుపు, డెమొక్రాటిక్ పార్టీ రంగు నీలం.
యుద్ధభూమి రాష్ట్రాలు
కొన్ని రాష్ట్రాలు రిపేబ్లకన్, కొన్ని రాష్ట్రాలు డమొక్రాటిక్ పార్టీకి ఎప్పుడూ అనుకూలంగా ఉంటూ ఉంటాయి. అలా ఉండని కొన్ని రాష్ట్రాలని (ఉదాహరణకి ఒహాయో, పెన్సిల్వేనియా) యుద్ధ భూమి రాష్ట్రాలుగా అభివర్ణిస్తారు. ఆ రాష్ట్రాలలో ఎక్కువ ప్రజాదరణ పొందిన వ్యక్తికి అధ్యక్ష పట్టాభిషేకం జరుగుతుంది. ప్రజాదరణ తక్కువ పొంది, ఎలక్టొరల్ కొలేజీ ఓట్లు ఎక్కువ వచ్చి గెలుపొందిన అధ్యక్షులు జార్జ్ బ్యష్ జూనియర్జ (2000), డోనాల్డ్ ట్రంప్ (2016). ఎన్నికల ప్రచారంలో, ముఖ్యంగా అభ్యర్థుల అభిప్రాయాలూ, సామాజిక సమానత, హక్కులూ, ఆర్థిక, ఉద్యోగ, ఆరోగ్యం రంగాలలో వారి విధానాలు ప్రచారం చేయడాన్ని బట్టి వారి గెలుపోటములు ఆధారపడి ఉంటాయి.
కోవిడ్, జార్జి లాయిడ్ హత్యోదంతం ప్రధాన చర్చనీయాంశాలు
ఈ సారి ఎన్నికల వాతావరణం వాడిగా వేడిగా మారడానికి కారణాలు కోవిడ్, అలాగే అతి ముఖ్యంగా మినిసొట్టా రాష్ట్రంలో జాత్యహంకారానికి బలైన నల్ల జాతీయుడు జార్జి లాయిడ్ బలికావడం, ఆ తర్వాత జరిగిన ఘటనలూ. ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నల్లజాతి వారి పట్ల వివక్ష చూపించే విధం, అలాగే కోవిడ్ నిర్మూలన విషయంలో చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్ష పార్టీ అభిమానులకు కావలసిన ఇంధనం ఇచ్చాయి.
బుష్ సీనియర్ వీసా సంస్కరణలు
అమెరికాకి ఇరవయ్యో దశకంలో భారత్ దేశం నుంచి వలస వచ్చిన చాలా మందికి తెలియని విషయం వారి రాకకు దోహదం చేసిన అంశం1990-91 లో జార్జ్ బుష్ సీనియర్ హయాంలో వీసా విధానాలలో జరిగన సంస్కరణలు. ఆ సంస్కరణలలో భాగంగా ఎఫ్-1 వీసా (F-1 Visa) ఒక సంవత్సరం నుంచి బహుళ ప్రవేశంతో కూడి ఐదు సంవత్సరాలు చెయ్యడం, అలాగే హెచ్ -1 వీసా (H-1) పేరుతో వార్షిక వీసా ఇవ్వడంతో పాటుగా వారి జీవిత భాగస్వాములకు సంబంధించిన ఎఫ్-2, హెచ్-4 (F-2, H-4) వీసాలని కూడా నిరాకరించకుండా ఇవ్వడం. వాటి ఫలితమే కాన్సలేట్ దగ్గర చెల్లుబాటు అయిన పత్రం ఉన్నవారందరికీ వీసాలు ఇవ్వటం జరిగంది. అబ్రహాం లింకన్ సివిల్ వార్ లో (అంతర్యుద్ధంలో) గెలిచిన తర్వాత నల్లజాతీయులు బానిసత్వం నుంచి స్వేచ్ఛ ప్రకటించుకున్నారు. సమాజంలోవారికి సమాన హక్కులు ఇచ్చారు. కానీ ఆ హక్కుల అమలుకోసం నేటికీ పోరాటం జరుగుతూ ఉంది.
చైనాతో పోరులో అమెరికా సహకరిస్తుందా?
చైనా 1962వ సంవత్సరంలో భారత భూభాగంలోకి చొచ్చుకొని వచ్చి సుమారు 43 వేల చదరపు మైళ్ళ భూభాగాన్ని దురాక్రమించినప్పుడు నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అభ్యర్థనను అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్. కన్నడీ చైనాతో అమెరికాకు ఉన్న సంబంధాలని పురస్కరించుకొని కల్పించుకోకుండా తటస్థంగా ఉన్నాడు. నేడు ట్రంప్ చైనా పట్ల వ్యతిరేకత ప్రదర్శించడం, అలాగే ప్రస్తుతం భారత దేశానికి చైనాతో జరగుతున్న యుద్ధం విషయంలో భారత్ ను సమర్థిస్తూ ట్రంప్ మాట్లాడటం, ప్రస్తుత భారత ప్రభుత్వంతో ట్రంప్ సత్సంబంధాలు కొనసాగించడం పట్ల కొందరు భారత అమెరికన్లు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి పట్ల సదభిప్రాయంతో ఉన్నారు. అవసరమైతే చైనాతో తలబడటానికి అమెరికా సహాయం చేస్తుందని వారు భావిస్తున్నారు. ట్రంప్ మాట్లాడే విధానం కారణంగా ఆయన పట్ల కొందరికి వ్యతిరేకత ఉన్నప్పటికీ దేశం ఆయన హయాంలో ఆర్థిక పురోగతి సాధించిందని అంటున్నారు. అలాగే భారత దేశం 1962లో పోగొట్టుకున్న భూభాగాన్ని తిరిగి సాధించడానికి అమెరికా సాయం చేస్తుందనే అభిప్రాయం కొందరికి ఉన్నది.
అభిప్రాయ సేకరణలో వెనుక, ఎలక్టొరల్ కొలేజీలో ముందు
ట్రంప్ 2016 నాటి ఎన్నికలలో అభిప్రాయ సేకరణలో వెనక ఉండి వాస్తవ ఎన్నికలలో కొలీజియం ఓట్లలో మెజారిటీ ఓట్లు గెలిచాడు. ఈ సారి కూడా అభిప్రాయ సేకరణ సర్వేలో వెనుకంజలోనే ఉన్నారు. ఈ సారీ ఆయనే గెలుస్తారా లేక డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ గెలుస్తాడా అన్నది ఎవ్వరూ చెప్పలేని విషయం. ఫలితాలు కోసం మరికొన్ని గంటలు (అమెరికాలో నవంబర్ 3వ తేదీ సాయంత్రం వరకూ, ఇండియోలో 4వ తేదీ ఉదయం వరకూ) వేచి ఉండక తప్పదు.
Ganesh garu
This is a very nice article written.