- జగన్ సర్కార్ కు భారీ ఊరట
- హైకోర్టు నిర్ణయంపై ఉద్యోగ సంఘాల హర్షం
- ప్రజా శ్రేయస్సు దృష్ట్యా నిర్ణయమన్న హైకోర్టు
- డివిజన్ బెంచ్ కు వెళ్లిన ఎస్ఈసీ
ఏపీలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ కు బ్రేక్ పడింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నికల షెడ్యూల్ ను నిలిపివేస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటీషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. కరోనా నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయాలంటూ ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్ మోహన్ పిటీషన్ పై ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్, ఎన్నికల సంఘం తరపున న్యాయవాది అశ్వనీ కుమార్ రెండు గంటలపాటు వాదనలు వినిపించారు. ఒకే సమయంలో ఎన్నికల నిర్వహణ, కరోనా వాక్సినేషన్ కష్టమవుతుందని అటార్నీ జనరల్ కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఎన్నికల షెడ్యూల్ ను నిలిపివేస్తూ తీర్పు చెప్పింది. కరోనా తగ్గుముఖం పడుతున్నప్పటికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో షెడ్యూల్ ను నిలిపివేస్తున్నట్లు కోర్టు తెలిపింది.
డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసిన ఎస్ఈసీ:
ఏపీలో పంచాయతీ ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ డివిజన్ బెంచ్ కు అప్పీలు చేసింది. సింగిల్ బెంచ్ తీర్పు సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఎస్ఈసీ తెలిపింది. సంక్రాంతి నేపథ్యంలో సెలవులు ఉన్న కారణంగా అత్యవసర పిటీషన్ గా భావించి విచారించాలని ఎస్ఈసీ తరపు న్యాయవాది డివిజన్ బెంచ్ ను కోరారు.
ఇదీ చదవండి: ఎన్నికల నిర్వహణపై నిమ్మగడ్డ దూకుడు
ఇదీ చదవండి: స్థానిక ఎన్నికలకు కరోనా అడ్డంకి కాదన్న ఎస్ఈసీ