వారసుడిని ఇంటి పేరుకు మాత్రమే కాదు
వారసుడిని ఆస్తిపాస్తులకే కాదు
వారసుడిని అత్యంత ప్రాచీన సంస్కృతికి
ఆచారాలు, సాంప్రదాయాలలో ఇమిడిన ఆరోగ్య ఆనందాలకు
అందులో అంతర్లీనంగా ఉన్న ఆధ్యాత్మికతకు.
వారసుడిని ప్రపంచ మొదటి విశ్వవిద్యాలయానికి
వారసుడిని రుషుల దార్శనికతకు
వారందించిన జ్ఞాన భాండాగారానికి
నాకు అర్థమయ్యే కధలుగా రాసిన
రామాయణ భారతాలకు
మనిషి పురుషోత్తముడు ఎలా అవుతాడో చూపిన రాముడికి
ధర్మంగా ఎలా బ్రతకాలో నేర్పిన కృష్ణుడికి
ప్రేమ మనుషుల మీదే కాదన్న బుద్దుడికి
సత్య మార్గాన ఎలా నడవాలో చూపిన గాంధీకి.
వారసుడిని వసుధైక కుటుంబానికి
పంచభూతాలను పంచ ప్రాణాలుగా భావించిన నా పూర్వులకు
వేదాంతంతోపాటు కర్మ సిధ్ధాంతానికి
ప్రతిఫలాపేక్ష లేని ధర్మాచరణకు.
వారసుడిని గత వైభవ చిహ్నాలైన కోటలకు రాజ భవనాలకు
సనాతన ధర్మ ప్రతీకలైన
లెక్కలేనన్ని అతిప్రాచీన దేవాలయాలకు
అవి శిల్ప సంపద నిలయాలు మాత్రమే కాదు
ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలు
శాస్త్ర విఙానాన్ని నింపుకున్న గోపురాలు
అనంత శక్తిని ప్రసరింపజేసే చిన్న విగ్రహాలే
భగవంతుడి అనేక రూపాలు
వారసుడిని కావ్యాలుగా మలిచిన చరిత్రకు
భయం, విద్వేషం లేని సౌభాతృత్వానికి
మూఢ నమ్మకాలు
తనకు తెలిసిందే సత్యమనే మూర్ఖత్వం లేని
విశ్వగురువు వారసుడిని నేను.
(ప్రపంచ వారసత్వ దినోత్సవ శుభాకాంక్షలతో)
Also read: “గాంధారి”
Also read: “పుస్తకం”
Also read: “చేతన”
Also read: “చివరి మాట”
Also read: “స్వఛ్ఛం”