- 14 మంది ప్రయాణికులలో 13 మంది దుర్మరణం
- కోయంబత్తూరు, సూలూరు మధ్య ప్రమాదం
హెలికాప్టర్ ప్రమాదంలో జనరల్ రావత్, ఆయన భార్య డాక్టర్ మథూలికా రావత్, మరి 11 మంది సైనికాధికారులు దుర్మరణం చెందారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తమిళనాడులో కోయంబత్తూరు, సూలూరు మధ్య నీలగిరి కొండలలో పడిపోయింది. రావత్ తో పాటు మరి 13 మంది ఆ హెలికాప్టర్ ప్రయాణం చేస్తున్నారు. వారిలో రావత్ సతీమణి డాక్టర్ మథూలికా రావత్ కూడా ఉన్నారు. జనరల్ రావత్ భద్రతాసిబ్బంది, ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఇతర అధికారులూ ప్రయాణికులలో ఉన్నారు. ప్రయాణం చేస్తున్న 14 మందిలో 13 మంది మరణించారనీ, గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మాత్రం చికిత్స పొందుతున్నారనీ, ఆయనకు సైతం ఒంటి నిండా గాయాలున్నాయని తెలిసింది.
కోయంబత్తూరు సమీపంలో వెలింగ్టన్ లో డిఫెన్స్ సర్వీసెస్ కాలేజీకి బుధవారం ఉదయం దిల్లీ నుంచి రావత్, ఆయన భార్, తదితరులు వచ్చారు. హెలిప్యాడ్ నుంచి ఊటీలోని వెలింగ్టన్ సైనిక సర్వీసుల కళాశాలకు వెడుతున్న సమయంలో హెలికాప్టర్ పైకి లేచిన కొద్ది సేపటిలోనే సూలూరు దగ్గర నీలగిరి కొండలపైన పడిపోయింది. దగ్గరి గ్రామంలో నివసిస్తున్నవారు హెలికాప్టర్ ప్రమాదం గురించి జిల్లా యంత్రాగానికి చెప్పారు. వారు ఎయిర్ ఫోర్స్ అధికారులకు చెప్పారు. మధ్యాహ్నం గం. 12.20 కల్లా ఈ వార్త దేశమంతటా తెలిసింది. హెలికాప్టర్ శిధిలాలలో నుంచి కాలి బుగ్గి అయిన శవాలను గ్రామస్థులు బయటకు లాగారు.
సైనికాధిపతిగా కొత్త హోదా సృష్టించిన తర్వాత ఆ పదవిని తొలుత చేపట్టిన అధికారి బిపిన్ రావత్. ఆయన జనవరి 2019లో కొత్త పదవీబాధ్యతలు స్వీకరించారు. భార్య మధూలికతో పాటు డిఫెన్స్ అకౌంట్స్ ఆఫీసర్, ఇతర వ్యక్తిగత రక్షణ సిబ్బంది, ఎయిర్ ఫోర్స్ చెందిన అధికారులు హెలికాప్టర్ లో ఉన్నారు. ఇటీవల సృష్టించిన సైనిక వ్యవహారాల శాఖ (డిపార్ట మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్) అధిపతిగా కూడా జనరల్ రావత్ నియుక్తులైనారు. పదవీ వరమణ చేసిన సైనికాధికారుల ఈ వార్త విని నివ్వెర పోయారు. తమ సంతాపం ప్రకటించారు. ప్రధాని నరేంద్రమోదీతో రక్షణమంత్రి రాజనాథ్ సింగ్ ఈ విషయం మాట్లాడారు. తమిళనాడు అటవీశాఖ మంత్రి రామచంద్రన్ ఘటనాస్థలికి వెళ్ళారు.
జనరల్ రావత్, మథూలికలకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జనరల్ రావత్ సైన్యంలో వేగంగా పైకి వచ్చిన సమర్థుడైన అధికారి. మయమ్నార్ లో ఉంటూ ఈశాన్య రాష్ట్రాలలో అశాంతిని రగుల్చుతున్న తీవ్రవాదులపైన, పాకిస్తాన్ ఉగ్రవాదులపైనా సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించిన అధికారి రావత్. కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్ లో దిట్టగా పేరు తెచ్చుకున్నారు. అమెరికా వెళ్ళి సైనిక శిక్షణ పొందారు. ఐక్య రాజ్య సమితి సైనిక సంఘాలలో సభ్యుడిగా పని చేవారు. పరమ వీర చక్ర బిరుదం పొందారు. స్వోర్డ్ ఆఫ్ ఆనర్ స్వీకరించారు. 19 మార్చి 1958లో ఉత్తరాఖండ్ లోని పౌరా అనే గ్రామంలో జన్మించిన రావత్ డెహ్రాడూన్ లో విద్యనభ్యసించారు.
జనరల్ రావత్, ఆయన సతీమణి, ఇతర అదికారులు దుర్మరణం చెందడం పట్ల రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ, రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్, దేశీయాంగమంత్రి అమిత్ షా, విదేశాంగమంత్రి జయశంకర్, తదితరులు నివాలులు అర్పించారు.