——–
(‘PAIN ‘FROM ‘THE PROPHET’ BY KAHLIL GIBRAN)
అనువాదం: డా. సి. బి. చంద్ర మోహన్
—————-
వేదన–
నీ అవగాహనపైన, పెంకు లాంటిది
పండులోని గట్టి టెంక పగిలి
గుండె లాంటి గింజపై ఎండ పడినట్లు
నీ వేదనను అర్థం చేసుకో !
మహిమాన్విత జీవనం
నీ హృదయాన్ని
ఆశ్చర్యానందానుభూతులకు
గురి చేసినట్లే —
వేదనాభరిత హృదయం కూడా
అనుభూతి చెందుతుంది !
వనాలపై ఋతు ఆగమనాలను అంగీకరించినట్లు
హృదయ ఋతువులనూ అర్థం చేసుకో !
దుఃఖ భరిత శీతలాల్ని
ప్రశాంతతతో గమనించు !
నీ వేదనలో చాలా భాగం –స్వీయ ఎంపికయే !
రోగగ్రస్త ఆత్మను నయం చేసే
అంతర్గత వైద్యుని చేదు కషాయమే
— ఈ వేదన !
అంతరంగ వైద్యుని విశ్వసించు !
ఔషధం నిశ్శబ్దంగా, ప్రశాంతంగా త్రాగు !
ఆ వైద్యుని హస్తం
మోటుగా, మోపుగా ఉండుగాక !
కానీ —
ఒక మృదు, అదృశ్య హస్తం
దాన్ని నడిపిస్తుంది !
ఆ వైద్యుని ఔషధ పాత్ర
నీ అధరాలను మండించు గాక !
కానీ–
ఆ పాత్ర ‘కుమ్మరి ‘ తన పవిత్ర భాష్పాలతో
మట్టిని కలగలిపి చేసినది !
Also read: మూడు కానుకలు
Also read: 12. ప్రవక్త — పసివాడు
Also read: సౌందర్యం
Also read: ప్రజలే ప్రభువులు
Also read: సన్యాసి – జంతుజాలం