- డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వాహనాలను సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు హైకోర్టు సంచలన తీర్పు..
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల పై హైకోర్టులో 40 రిట్ పిటిషన్లు దాఖలైనాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ లో డ్రైవర్ తాగి పట్టుబడితే వాహనాన్ని వాహన దారుని సన్నిహితులకు సమాచారం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. కొన్ని తప్పనిసరి సందర్భాల్లో మాత్రమే వాహనాన్ని పోలీసులు అదుపులోకి తీసుకోవచ్చని హైకోర్టు చెప్పింది. పోలీస్ అదుపులోనికి తీసుకున్న వాహనాన్ని వాహనం ఆర్సీ చూపిస్తే అట్టి వాహనాన్ని విడుదల చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. అంతే కానీ డైరెక్టర్ గా మోటార్ వెకిల్ యాక్ట్ ప్రకారం వాహనాన్ని సీజ్ చేసే అధికారం ఎవ్వరికీ లేదన్న హైకోర్టు.ఈ అంశం పై దాఖలైన 40 పిటిషన్ ల విచారణ ముగించిన హైకోర్టు.