Sunday, January 26, 2025

డే-నైట్ టెస్టుకు వేళాయెరా…!

  • సిరీస్ కే కీలకంగా మారిన పిక్ బాల్ సమరం
  • వందవటెస్టుకు ఇశాంత్ శర్మతహతహ

భారత్-ఇంగ్లండ్ జట్ల ఐసీసీటెస్ట్ లీగ్ నాలుగుమ్యాచ్ ల సమరం నిర్ణయాత్మక దశకు చేరింది. సిరీస్ లోని మొదటి రెండుటెస్టుల్లో చెరోమ్యాచ్ నెగ్గి రెండుజట్లూ 1-1తో సమఉజ్జీలుగా నిలవడంతో కీలకంగా మారింది. మొదటి రెండుటెస్టులకు భిన్నమైన వాతావరణంలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదిక అహ్మదాబాద్ సర్దార్ పటేల్ స్టేడియం వేదికగా జరిగే ఈ పింక్ బాల్ టెస్ట్ సమరం కోసం దేశవిదేశాలలోని కోట్లాదిమంది క్రికెట్ అభిమానులు ఎక్కడలేని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

పింక్ బాల్ తో..ఫ్లడ్ లైట్ల వెలుగులో:

ప్రస్తుత సిరీస్ లోని మొదటి రెండుటెస్టులు సహజసిద్ధమైన సూర్యకాంతిలో సాంప్రదాయ యాపిల్ రంగు బంతితో నిర్వహిస్తే దానికి భిన్నంగా ప్రస్తుత మూడోటెస్ట్ మ్యచ్ ను పింక్ బాల్ తో డే-నైట్ గా ఫ్లడ్ లైట్ల వెలుగులో నిర్వహించబోతున్నారు. పేస్, స్వింగ్ బౌలర్లకు అత్యంత అనువుగా ఉండే ఈ పింక్ బాల్ టెస్టులు ఆడిన అనుభవంలో భారత్ కంటే ఇంగ్లండ్ దే పైచేయిగా ఉంది. అంతేకాదు రెండుజట్లూ పేస్ బౌలింగే ప్రధాన అస్త్రంగా సమరానికి సై అంటున్నాయి.

Also Read: స్వదేశీ సిరీస్ ల్లో పులి భారత్

భారత గడ్డపై పింక్ బాల్ రెండోటెస్టు:

పింక్ బాల్ టెస్టు మ్యాచ్ లు అనగానే ఆస్ట్ర్రేలియాలోని అడిలైడ్ ఓవల్ మాత్రమే క్రికెట్ అభిమానులకు గుర్తుకు వస్తుంది. అయితే భారత్ సైతం గత ఏడాదే కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్ తో 2019 సిరీస్ లో భాగంగా మొట్టమొదటి డే-నైట్ టెస్టు నిర్వహించింది. ఆ మ్యాచ్ లో భారత్ మూడున్నర రోజుల్లోనే బంగ్లాదేశ్ ను చిత్తు చేసింది. అయితే..అడిలైడ్ ఓవల్ వేదికగా ఆస్ట్ర్రేలియాతో జరిగిన పింక్ బాల్ టెస్టులో మాత్రం భారత్ కు చేదుఅనుభవమే ఎదురయ్యింది. రెండో ఇన్నింగ్స్ లో కేవలం 36 పరుగులకే కుప్పకూలడం విరాట్ కొహ్లీ కెప్టెన్సీకే మచ్చగా మిగిలింది.

Also Read: వందవ టెస్టుకు ఇశాంత్ రెడీ

స్వింగ్-పేస్ బౌలింగ్ కు పిచ్ తో పాటు రాత్రివేళ వాతావరణం అనువుగా ఉండడంతో ఇంగ్లండ్ తన తురుపుముక్కలు జిమ్మీ యాండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, మార్క్ వుడ్, స్టోక్స్ లతో దాడికి సిద్ధంగా ఉంటే ఆతిథ్య భారత్ మాత్రం ఇశాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, జస్ ప్రీత్ బుమ్రాలతో ముప్పేట దాడికి వ్యూహం సిద్దం చేసుకొంది. ఉమేశ్, సిరాజ్ ల్లో ఒక్కరికే తుదిజట్టులో చోటు దక్కనుంది.

వందటెస్టుల క్లబ్ లో ఇశాంత్:

భారత లంబూ ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మ తన కెరియల్ లో 100వ టెస్టు మైలురాయిని అహ్మదాబాద్ తొలిటెస్టుతో చేరనున్నాడు. కపిల్ తర్వాత ఈ ఘనత సాధించిన భారత ఫాస్ట్ బౌలర్ గా రికార్డుల్లో చేరనున్నాడు.చెన్నైటెస్టు విజయంలో ప్రధానపాత్ర పోషించిన స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ , కుల్దీప్ యాదవ్ లను పక్కన పెట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.టెస్టు మొదటి మూడురోజులు పేస్ బౌలర్లకు, చివరి రెండురోజులు స్పిన్ బౌలర్లకు పిచ్ అనుకూలించే విధంగా సిద్ధం చేశారు.

50 వేల మందికి మాత్రమే అనుమతి:

700 కోట్ల రూపాయల భారీవ్యయంతో నిర్మించిన మోతేరా స్టేడియం సామర్థ్యం లక్షా 10 వేలు కాగా కోవిడ్ నిబంధనల కనుగుణంగా రోజుకు కేవలం 50 వేల టికెట్లు మాత్రమే విక్రయించాలని గుజరాత్ క్రికెట్ సంఘం నిర్ణయించింది.ఈ మ్యాచ్ లో సైతం టాస్ కీలకం కానుంది. టాస్ నెగ్గినజట్టు ముందుగా బ్యాటింగ్ కే మొగ్గుచూపనుంది.

Also Read: టెస్టు క్రికెట్లో అశ్విన్ మరో ప్రపంచరికార్డు

మ్యాచ్ నెగ్గితే టెస్టు ఫైనల్స్ బెర్త్:

భారతజట్టు టెస్టులీగ్ ఫైనల్స్ బెర్త్ ఖాయం చేసుకోవాలంటే అహ్మదాబాద్ తొలిటెస్టు నెగ్గి తీరాల్సి ఉంది. ప్రస్తుత సిరీస్ లో భారత్ 2-1తో ఇంగ్లండ్ ను ఓడించినా సరిపోతుంది. అదే ఇంగ్లండ్ ఫైనల్స్ చేరాలంటే మాత్రం అహ్మదాబాద్ అంచె రెండుటెస్టులూ నెగ్గితీరక తప్పదు.

బ్యాట్ కు బంతికి నడుమ జరిగే ఈ ఉత్కంఠభరిత పోరులో పగలు-రాత్రిల దాగుడుమూత ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. అతిపెద్ద క్రికెట్ వేదికలో జరిగే ఈ అతిపెద్ద టెస్టు సమరం ప్రస్తుత సిరీస్ కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిపోనుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles