వంద వన్డేలు ఆడిన భారత 5వ మహిళగా రికార్డు
భారత మహిళా క్రికెటర్, టీ-20 కెప్టెన్, వన్డే వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకొంది. ఇప్పటికే 114 టీ-20 మ్యాచ్ లు ఆడేసిన హర్మన్.. వన్డేలలో సైతం 100 మ్యాచ్ ల మైలురాయిని చేరింది.
దక్షిణాఫ్రికాజట్టుతో లక్నో వేదికగా జరిగిన మ్యాచ్ ద్వారా 100 వన్డే మ్యాచ్ లు ఆడిన భారత ఐదవ మహిళగా రికార్డుల్లో చేరింది. 171 పరుగులు అత్యధిక వ్యక్తిగత స్కోరుతో వంద వన్డేలు ఆడిన హర్మన్ 2వేల 412 పరుగులు సాధించింది.
హర్మన్ కంటే ముందే ఈ ఘనత సాధించిన భారత మహిళా క్రికెటర్లలో మిథాలీరాజ్ ( 210), జులన్ గోస్వామి (183), అంజుమ్ చోప్రా ( 127), అమితా శర్మ (116 ) ఉన్నారు.
Also Read : స్వదేశీ సిరీస్ ల్లో కెప్టెన్ కొహ్లీ రికార్డు
దక్షిణాఫ్రికాతో ప్రారంభమైన 2021 వన్డే సిరీస్ లోని తొలిమ్యాచ్ ద్వారా వందవన్డేల క్లబ్ లో చేరిన హర్మన్ 41 బాల్స్ లో 6 బౌండ్రీలతో 40 పరుగుల స్కోరుకు అవుటయ్యింది.
భారత టీ-20 జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న హర్మన్ ప్రీత్ 114 మ్యాచ్ లు ఆడి 2 వేల 186 పరుగులు నమోదు చేసింది. ప్రపంచ మహిళా క్రికెట్లో వీరబాదుడు ప్లేయర్ గా గుర్తింపు పొందిన హర్మన్ ప్రీత్ కౌర్ పంజాబ్ పోలీసులు డీఎస్పీగా పని చేస్తోంది.
Also Read : ఐసీసీ టెస్టు లీగ్ ఫైనల్స్ లో భారత్