Sunday, December 22, 2024

కిషన్ రెడ్డిపైన హరీష్ ధ్వజం

  • కిషన్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారు
  • వారు చెప్పేవి అబద్ధాలని మేమంటున్నా సరే సోషల్ మీడియాలో అబద్ధాలనే ప్రచారం చేస్తున్నారు.
  • ఎయిమ్స్ కి భూమి ఇవ్వలేదనడం పచ్చి అబద్ధం

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారనీ, అబద్దాలు మాట్లాడటం లో మిగతా బీజేపీ నేతలతో కిషన్ రెడ్డి పోటీ పడుతున్నారనీ,

 వారు చెబుతున్నవన్నీ అబద్దాలని మేము చెబుతున్నా సోషల్ మీడియా లో ఇంకా బీజేపీ నేతలు తమ అసత్యాలనే ప్రచారం చేస్తున్నారనీ ఆర్థిక, ఆరోగ్య శాఖలమంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు.

వరి ,సిలిండర్, కేసీఆర్ కిట్ ఇలా అన్ని అంశాల్లో బీజేపీ వి అబద్ధాలేననీ, కిషన్ రెడ్డి మెడికల్ కళాశాలల విషయం లో తప్పుడు ప్రచారం చేస్తున్నారనీ, ఎయిమ్స్ కు బీబీ నగర్ లో మేము స్థలమే ఇవ్వలేదని బాధ్యతా రాహితంగా  మాట్లాడుతున్నారనీ, మేము నిమ్స్ కోసం స్థలం భవనాన్ని ఏర్పాటు చేసుకుని ఎయిమ్స్ కు ఇచ్చాము, ఇలా ఇచ్చిన మొదటి రాష్ట్రం తెలంగాణే కావచ్చుననీ,

బీబీ నగర్ ఎయిమ్స్ కు 24 ఎకరాల స్థలమిచ్చామనీ, ఇదిగో దానికి సంబంధించిన జీవో విడుదల చేస్తున్నాం అనీ హరీష్ ప్రకటించారు.

మంత్రి తన్నీరు హరీష్ రావు, రైతు బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి,టీ ఆర్ ఎస్ కార్యదర్శులు సోమ భరత్ ,ఎం.శ్రీనివాస్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలంగాణ భవన్ లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

‘‘ఇలా పచ్చి అబద్దాలు మాట్లాడిన కిషన్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలి. గోబెల్స్ ను మించి పోతున్నారు బీజేపీ నాయకులు. మెడికల్ కళాశాల విషయంలో తెలంగాణ కేంద్రంతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపలేదు అని కిషన్ రెడ్డి మరో పచ్చి అబద్ధం చెప్పారు. లక్ష్మారెడ్డి ఆరోగ్య మంత్రి గా ఉన్నపుడు ఎన్నో సార్లు ఢిల్లీ వెళ్లి మెడికల్ కళాశాలల గురించి మాట్లాడారు. ఫేస్ వన్ ఫేస్ టూ లో కాలేజి లు ఇవ్వలేమని, ఫేస్ త్రీ లో ఇస్తామని అప్పటి కేంద్ర మంత్రి హర్షవర్ధన్ హామీ ఇచ్చినా నెరవేరలేదు. మేము అడగక పోతే హర్షవర్ధన్ లేఖ ఎందుకు రాస్తారు. యూపీ కి 27 మెడికల్ కాలేజి లు ఇచ్చి తెలంగాణ కు ఇవ్వకపోవడం మా పట్ల సవతి తల్లి ప్రేమ, అవమానం ప్రదర్శించడం కాదా?’’ అంటూ హరీష్  రావు ప్రశ్నించారు.

‘‘ఎయిమ్స్ మీరు ఇవ్వడం ఏమిటీ? అది విభజన చట్టం కింద ఇచ్చిన హామీ.

కిషన్ రెడ్డి కి దమ్ముంటే విభజన చట్టం కింద ఇచ్చిన హామీలు అమలు చేయించాలి. గతం లో తెలంగాణ ప్రజలకు ఎర్రబస్సు తప్ప ఏమీ తెలియదని కిషన్ రెడ్డి అవమానకరంగా మాట్లాడి అభాసు పాలయ్యారు. కిషన్ రెడ్డి పూర్తి సమాచారం తో మాట్లాడాలి. మంచి టీం ను పెట్టుకోవాలి’’ అంటూ హితవు చెప్పారు.

‘‘కేంద్రం ఇవ్వకున్నా కేసీఆర్ కొత్త మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశారు

.ఉమ్మడి రాష్ట్రం లో ఐదు మెడికల్ కళాశాలలు ఉంటే ఇపుడు21 చేసుకున్నాం

..ఏడు వందల మెడికల్ సీట్లను నాలుగు వేలకు పెంచుకున్నాం. ఇంకా 12 మెడికల్ కళాశాలల అవసరం ఉంది. కిషన్ రెడ్డి కి చేతనాయితే ఆ మెడికల్ కళాశాలలు తెపించాలి. 40 శాతం నిధులు భరిస్తాం,’’అని అన్నారు.

‘‘ఈ రోజు బీజేపీ వాళ్ళు ఎందుకు ధర్నా చేసినట్టు? వారి ధర్నాలో రైతులు లేరు.

రైతులకు బీజేపీ నిజ స్వరూపం అర్థమైంది. కిషన్ రెడ్డి యాసంగి గురించి మాట్లాడకుండా వానాకాలం ధాన్యం సేకరణ గురించి మాట్లాడుతున్నారు.

పారా బాయిల్డ్ రైస్ వచ్చేదే యాసంగి లో. కొంటామని కిషన్ రెడ్డి చెప్పాలి. బురద జల్లడమే బీజేపీ కిషన్ రెడ్డి పనా?’’ అని అడిగారు.

‘‘నేను కిషన్ రెడ్డికి ఏ సమాచారం కావాలన్నా ఇస్తా. ఎపుడు ఎక్కడికి  రమ్మన్నా వస్తా.. తెలంగాణ ప్రయోజనాలు మాకు ముఖ్యం. రాజ్యాంగ బద్ధ పదవి లో ఉన్న కిషన్ రెడ్డి అబద్దాలు మాట్లాడ కూడదు. కేంద్ర రాష్ట్ర బీజేపీ నేతల మధ్య సమన్వయం లేదు’’ అని వ్యాఖ్యానించారు.

‘‘రేపటి ధర్నాలు ప్రారంభం మాత్రమే. వివిధ రూపాల్లో ఆందోళన కొనసాగుతుంది. బట్ట కాల్చి మీదెయ్యడం బురద జల్లడం మంచిది కాదు. కిషన్ రెడ్డి వడ్లన్నీ కొంటామని ఆర్డర్ తెస్తే ఎయిర్ పోర్టు కు వచ్చి సన్మానం చేస్తాం. బీజేపీ అబద్దాలు ఎల్ల కాలం నిలవవు. ప్రజలు బీజేపీ అబద్ధాలను నమ్మే స్థితి లో లేరు

..పంజాబ్ లో కొంటారు ఇక్కడ ఎందుకు కోనరు?’  అంటూ ప్రశ్నించారు.

‘‘విదేశాంగ విధానం మార్చి బియ్యం ఎగుమతి నిబంధనలు మార్చండి. పారిశ్రామిక వేత్తలకు ఎన్నో సబ్సిడీలు ఇచ్చే కేంద్రం రైతులకు ఎందుకు ఇవ్వరు? నష్టాలు ఎందుకు భరించరు? కేంద్రం ధాన్యం పై యూ టర్న్ తీసుకోవడం వల్లే సమస్య ఏర్పడింది’’ అంటూ హరీష్ రావు విమర్శించారు.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles