Sunday, December 22, 2024

కృత్రిమ జన్యువు సృష్టికర్త ఖొరానా

పంజాబ్ (ఇప్పుడు పాకిస్తాన్) లో ఓ గ్రామంలోని ఏకైక అక్షరాస్యత కుటుంబంలో జన్మించి, చదవడం,  వ్రాయడం తన తండ్రి ద్వారా నేర్చుకుని, నోబెల్ బహుమతి గ్రహీతగా, కృత్రిమ జన్యువును నిర్మించిన మొదటి వ్యక్తిగా ఎదిగాడు హరగోవింద్ ఖొరానా.

హరగోవింద్ ఖొరానా (9 జనవరి 1922- 9 నవంబర్ 2011) భారతీయ సంతతికి చెందిన, నోబెల్ బహుమతి పొందిన ప్రఖ్యాత జీవ శాస్త్రజ్ఞుడు. 09 జనవరి  1922న  అవిభక్త భారత దేశంలోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన రాయపూరు అనే గ్రామములో జన్మించాడు (ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నది). తండ్రి పన్నులు వసూలు చేసే గ్రామ పట్వారి. అయిదుగురి సంతానంలో చివరి వాడు. తొలుత తండ్రి శిక్షణలో చదువుకున్నాడు.  తదుపరి ముల్తాన్ లో చిన్నతనం నుండే సైన్స్ పట్ల ఆకర్షితుడైన హర్ గోవింద్ చెట్టు కింద గుమిగూడిన ముల్తాన్ లోని దయానంద్ ఆర్య విద్యా  ఉన్నత పాఠశాల నుండి తన పాఠశాల విద్యను పూర్తి చేశాడు. పంజాబ్ విశ్వ విద్యాలయము, లాహోర్ (ప్రస్తుతం పాకిస్తాన్) 1943 లో బీ.ఎస్సీ 1945లో ఎం.ఎస్సీ పట్టాలు పొందాడు. లివర్ పూల్ విశ్వ విద్యాలయములో 1945 నుండి 1948 వరకు శాస్త్ర పరిశోధనలు చేసి పీ.హెచ్.డీ పట్టా పొందాడు. సేంద్రీయ కెమిస్ట్రీలో డాక్టరేట్ పొందిన తరువాత, ప్రొఫెసర్ వ్లాదిమిర్ ప్రిలాగ్‌తో కలిసి తదుపరి రెండు సంవత్సరములు   పని చేయడానికి జూరిచ్ వెళ్లాడు. వ్లాదిమిర్ ఒక గురువుగా వ్యవహరించాడు, అలా సైన్స్ పట్ల తనకున్న ప్రేమను హరగోవింద్ ఖొరానా మరింత పెంచుకున్నాడు.

కేంబ్రిడ్జ్ లో పరిశోధన

1951-52లో విశ్వవిఖ్యాత కేంబ్రిడ్జ్ విశ్వ విద్యాలయంలో మాంసకృత్తులు, న్యూక్లిక్ ఆమ్లములకు సంధించిన పరిశోధన మొదలు పెట్టాడు. 1952లో కెనడా లోని బ్రిటిష్ కొలంబియా (వ్యంకూవర్) విశ్వ విద్యాలములో చేరాడు. అక్కడ అతను తన ఎన్ డీఏ (DNA) పరిశోధనను ప్రారంభించాడు.  అటు పిమ్మట 1960 లో అమెరికా లోని విస్కాన్సిన్ విశ్వ విద్యాలయములో (మాడిసన్) ఆచార్యునిగా చేరాడు.1966 లో అమెరికన్ పౌరసత్వం పొందాడు. 1970లో ప్రతిష్ఠాత్మకమైన మశాచుసెట్స్ సాంకేతిక సంస్థలో (Massachusets Institute of Technology) రసాయన శాస్త్ర ఆచార్యునిగా చేరాడు. 2007లో పదవీ విరమణ చేశాడు. అప్పటి నుండి గౌరవ ఆచార్యునిగా పరిశోధనలు సాగించాడు.

కృత్రిమ జీన్ సృష్టి

జీవ శాస్త్రవేత్తలు ఎప్పటినుండో ఎదుర్కొంటున్న ప్రశ్న- ప్రయోగశాలలో జీవాన్ని కృత్రిమంగా సృష్టించడం సాధ్యమేనా? ఈ దిశలో వంశ పారంపర్యముగా సంక్రమించు జీవ నిర్మాణానికి దోహదం చేసే “కృత్రిమ జీన్”ను సృష్టించ గలిగాడు. ఈ ఆవిష్కరణ జెనెటిక్ ఇంజనీరింగ్ (Genetic Engineering) అనే నూతన శాస్త్ర అధ్యయనానికి దారి తీసింది. ప్రతి అమీనో ఆమ్లపు నిర్మాణ క్రమం మూడు న్యూక్లియోటైడ్ల అమరికతో జన్యువులలో పొందుపరచడి ఉన్నదని ఖొరానా కనుక్కొన్నాడు. వరుసగా ఉన్న కృత్రిమ జీన్ (డీఎన్ఏ ) ముక్కను ప్రయోగశాలలో మొదటిసారిగా సృష్టించాడు. డీ ఎన్ ఏ ముక్కలను అతికించు డీఎన్ఏ లిగసే  అనబడు ఎంజైమును కనుగొన్నాడు. ఈ పరిశోధనల మూలముగా ఆధునిక జీవశాస్త్రములో ఒక విప్లవం వచ్చింది. 1968 లో వైద్య శాస్త్రములో నోబెల్ బహుమతి లభించింది. రాబర్ట్ హోలీ, మార్షల్ నైరెన్‌బర్గ్‌లతో కలిసి అందుకున్నాడు. 1952లో స్విస్ జాతీయురాలైన ఎలిజబెత్ సిబ్లర్ ను వివాహ మాడాడు. వీరికి ముగ్గురు పిల్లలు: జూలియా ఎలిజబెత్, ఎమిలీ యాన్నె మరియూ డేవ్ రాయ్.

మెడిసిన్ లో నోబెల్ బహుమతి (1968), గైరిందర్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ అవార్డు, లూయిసా స్థూల హోర్విత్జ్ బహుమతి, ప్రాథమిక మెడికల్ రీసెర్చ్ ఆల్బర్ట్ లస్కెర్ అవార్డు, విల్లార్డ్ గిబ్స్ అవార్డు, పద్మ విభూషణ్ అవార్డులను అందుకున్నాడు. ఖొరానా నవంబర్ 9, 2011 న కంకార్డ్, మసాచుసెట్స్ లో 89వ ఏట సహజ మరణము చెందాడు.

జీవశాస్త్రంలో విప్లవం

ప్రతి అమీనో ఆమ్లపు నిర్మాణ క్రమం మూడు న్యూక్లియోటైడ్ల అమరికతో జన్యువులలో పొందుపరచడి ఉన్నదని ఖొరానా కనుగొన్నాడు. వరుసగా ఉన్న కృత్రిమ జీన్ (డిఎన్ఏ) ముక్కను ప్రయోగ శాలలో మొదటి సారిగా సృష్టించారు. అలాగే డీఎన్ఏ ముక్కలను అతికించు ‘డిఎన్ఏ లిగసె’ అనబడు ఎంజైమును కనుగొన్నారు. ఈ పరిశోధనల మూలంగా ఆధునిక జీవశాస్త్రములో ఒక విప్లవం వచ్చింది. 1968లో ఫిజియాలజీ/మెడిసిన్‌లో కణాల జన్యు సంకేతాన్ని కలిగి ఉన్న న్యూక్లియిక్ ఆమ్లాలలో న్యూక్లియోటైడ్ల క్రమం, కణాల ప్రోటీన్ల సంశ్లేషణను ఎలా నియంత్రిస్తుందో చూపించే పరిశోధన కోసం 1968 ఫిజియాలజీ లేదా మెడిసిన్ కొరకు నోబెల్ బహుమతిని మార్షల్ డబ్ల్యూ. నైరెన్‌బర్గ్ మరియు రాబర్ట్ డబ్ల్యూ హోలీలతో  కలిసి ఖోరానా నోబెల్ పురస్కారం పంచుకున్నారు. నోబెల్ బహుమతి పొందిన తరువాత ఒక సందర్భంలో, డాక్టర్ ఖోరానా ఇలా వ్రాశాడు: ‘పేదవాడు అయినప్పటికీ, నా తండ్రి తన పిల్లలకు విద్యను అందించడానికి జీవితాన్ని అంకితమిచ్చాడు. సుమారు 100 మంది నివసించే  గ్రామంలో  ఏకైక అక్షరాస్యత కుటుంబం మేము.’

అర్ధ శతాబ్దానికి పైగా, డాక్టర్ ఖోరానా – వేలాది మంది విద్యార్థులకు శాస్త్రీయ విద్యను అందించడం ద్వారా,  మానవ జ్ఞాన రంగాలను అభివృద్ధి చేయడం ద్వారా తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించాడు.

(నవంబర్ 9న హరగోవింద్ ఖొరానా వర్థంతి)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles