• కష్టపడి తల రాతను మార్చుకున్న రాయలింగు
అదో మారుమూల గ్రామం రెక్కాడితేగాని డొక్కాడని జీవనం వారిది. ఎండైనా వానైనా తమ రక్తాన్ని, చెమట గా మార్చి కష్టపడితే గానీ వారికి, వారి కుటుంబానికి రోజు గడవదు, వారిది వడ్డెర కులం. ఆ కుటుంబానికి చెందిన డాక్టర్ రాయ లింగు కుటుంబం నేపథ్యం. వడ్డెర తెగకు అతడు దిక్సూచి లాంటివాడు, అయినా అతడు మాత్రం గ్రామీణ ప్రాంత యువతకు ఆదర్శప్రాయుడని చెప్పక తప్పదు. అతడే డాక్టర్ ఓరుసు రాయ లింగు. వివరాలలోకి వెళితే.
Also Read: అరకొర సదుపాయాలు అయినా సీఏ పాస్
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన గ్రామానికి చెందిన ఉరుసు రాములు, నర్మద దంపతుల కుమారుడు రాయ లింగు. చిన్నతనంలో తల్లిదండ్రుల వెంట బండరాళ్లు కొట్టడానికి వెళుతూ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండేవాడు. ధర్మపురి మండల కేంద్రంలో మూడవ తరగతి నుంచి ఏడవ తరగతి వరకు చదివాడు. 8 నుంచి 10వ తరగతి వరకు జగిత్యాల్ లోని ఓల్డ్ హై స్కూల్ లో చదువుకున్నాడు. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ సంస్కృతాంధ్ర కళాశాలలో ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేశాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో M.A తెలుగు ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత సాధించా డు.
Also Read: గాలిలో మేడలు కట్టండి… శ్రమించి వాటికి పునాదులు నిర్మించండి
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎం ఫిల్ కోర్సు ” ముక్తేవి భారతి విశ్లేషణ ” అనే అంశంపై పై ఆచార్య నడు పల్లి శ్రీ రామ రాజు పర్యవేక్షణలో పట్టా పుచ్చుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఆచార్య మను మాస స్వామి పర్యవేక్షణలో ” తెలంగాణ విముక్తి పోరాటం సాహిత్యం సమగ్ర పరిశీలన ” అంశంపై పరిశోధన పూర్తి చేసి ఈ సంవత్సరం ఫిబ్రవరి 10 న ఉరుసు రాయ లింగు డాక్టరేట్ పట్టాను పొందారు. దాదాపు 800 కవితలతో కవితా సంపుటిని అచ్చు వేయించారు. తెలంగాణ సాహితీ హైదరాబాద్ పక్షాన అంతర్జాతీయ సదస్సులో పాల్గొని పొట్లపల్లి రామారావు సాహిత్యంపై పత్రం సమర్పించారు. పెద్దపెల్లి జిల్లా మంథని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగు లెక్చరర్ గా విధులు నిర్వహిస్తున్నారు. వడ్డెర జీవన విధానంపై బండబారిన బతుకులు, మట్టి మనుషులు మట్టి లో దివిటీలు, అనే శీర్షిక కవితలు వ్రాశారు. వడ్డెర కులస్తులకు తాను ప్రేరణ గా ఉండాలని, తన తాపత్రయం అని అన్నారు. తెలంగాణ పోరాట సాహిత్యాన్ని దేశం నలుమూలల వ్యాపింప చేయడమే తన కోరిక అని డాక్టర్ ఉరుసు రాయ లింగు అభిప్రాయపడుతున్నారు.