- నవ్వలేని జీవితాలు నరకం
- కడుపుబ్బా నవ్వించే వారే కరవవుతున్నారు
మనిషి అన్నీ ఉన్నా మనస్ఫూర్తిగా నవ్వలేడు! ఎప్పుడు ఏడుపు ముఖం తో ఉన్నవాడిని చూస్తే ఆనందంగా ఉన్న వాడు కూడా విషాదంలో పడిపోతాడు! ఉన్నదాంట్లో హాయిగా కలో గంజో తాగేవాడు మనసారా నవ్వుతాడు. ఎప్పుడు ఏదో ఆశ పడే జీవిలో నవ్వే ఉండదు! మనకు మనం కష్టాలు కొని తెచ్చుకుని నవ్వుకు దూరం అవుతున్నాం. ఆఫీసులో బాస్ తిట్టాడని, పెళ్ళాం దగ్గర ముఖం మాడిస్తే ఇంట్లో ఆనందం అవిరవుతుంది. పక్క వాడు నవ్వడం కూడా చిరాకనిపించే వాడికి జీవితంలో వెలుగులు నిండవు! ఎప్పుడు చిరునవ్వు ముఖంలో ఉండే వాడికి కష్టాలు దరిచేరవు! వ్యాపారంలో నష్టపోయామని, ప్రమోషన్ రాలేదని, ప్రియురాలు హాండ్ ఇచ్చిందని, పెళ్ళాం తిట్టిందని ఏడుపు ముఖం పెట్టేవాడికి నవ్వు దూరం అవుతుంది. నిజానికి ఎమోషన్ ఏదైనా ముఖం మీద చిరునవ్వు ఉండాలి! అంత్యక్రియల్లో ఆత్మీయుడు చచ్చిపోయి బంధువులు అందరూ ఏడుస్తుంటే ఒకడు ఏదో ఆలోచిస్తూ ముసి ముసి నవ్వులు నవ్వుకుంటున్నాడు. నాకు చిరాకు వేసి “ఇదేం రోగం నీకు శవం చితి మంటలు కాలక ముందే ఆ నవ్వేంటి” అన్నాను. అప్పుడు మనసారా నన్ను కౌగలించుకొని ఏడ్చి మేమిద్దరం వేసుకున్న జోకులు వాడు అడుగడుగునా నాపై, వాడి పై వేసుకునే జోకులు గుర్తుకు వచ్చి నవ్వుకుంటున్నాను అన్నాడు! అలా చనిపోయిన తరువాత నవ్వించే తత్వం ఎందరికి ఉంటుంది?
Also Read: సోషల్ మీడియా సామాజిక విప్లవమా?సమస్యల సమాహారమా?
జీవరాశిలో పక్షులు, జంతువులు కూడా నవ్వలేవు! ప్రాణం ఉన్న మనిషికి నవ్వు దేవుడు ఇచ్చిన వరం. నవ్వితే హాయిగా మనసు ప్రశాంతంగా ఉంటుంది. కడుపుబ్బా నవ్వించే మిత్రులు ఈ కలియుగంలో కరువవుతున్నారు! ఎల్లపుడూ ఏడుపు గొట్టు ముఖాలు ఎదురవ్వడం వల్ల చాలా మందిలో పలువరుస బయటకు రావడం లేదు! అన్నీ కృత్రిమ, పలకరింపులే! ఎప్పుడూ సీరియస్ గా ఉండే వారికి సుఖాలు దక్కవు! ఎంతగా సంపాదన ఉన్నా. తిన్నమా? పడుకున్నమా?… అన్నట్టు ఉండేవారు కొందరు, ఎదో కొంపలు మునిగినట్టు తమ సొమ్మేదో దోచుకు పోయినట్టు ముఖం మాడ్చేవారు మరొకరు! ఈ యాంత్రిక జీవితంలో నవ్వు కోల్పోతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి! లాఫింగ్ క్లబ్బుల్లో కూడా భార్య బాధితులు, భర్త బాధితులు ఇంటి బాగోతం తో మనసారా నవ్వడం లేదట! ఇక ప్రపంచంలో ఏడుపు క్లబ్బులకు డిమాండ్ పేరిగేట్టు ఉంది! ఎందుకంటే మూగ గా ఏడ్చే బదులు ఆ క్లబ్ కి వెళ్లి వెక్కి వెక్కి ఏడిస్తే గానీ మనసు బరువు దిగని దరిద్రుల కోసం అయినా ఆ క్లబ్ ఉండాలి! నవ్వు ఈ రోజుల్లో ఒక దివ్య ఔషధం అది గ్రహించని వారికి రోగాలు చుట్టూ ముడుతూనే ఉంటాయి!!
కలల్లో నవ్వే వారు మనకు కనిపిస్తారు. గాఢ నిద్రలో ఉండే వారు నవ్వుతున్నారంటే నిజ జీవితంలో నవ్వు కోల్పోతారన్న మాట! వారు మంచి కలలు గంటూ మనసారా నవ్వే వారిని నిద్ర భంగం చేయకూడదు! ఎన్ని కష్టాలు అయినా టెకీట్ ఈజీ గా తీసుకుని చిరునవ్వు ముఖం మీద ఉన్నవారు చచ్చే వరకు ఆరోగ్యం గా ఉంటారు! లేదా మానసిక ఆనందం లేని వారు మరణం అంచులో ఉంటారు!
Also Read: స్త్రీవాదం ఇంట్లోనే.. బయట ప్రపంచంలో కీలు బొమ్మలు
మీరు సంతోషంగా ఉండాలని నమ్మే హృదయపూర్వక వ్యక్తి జీవితంలో ఎవరైనా ఉన్నారు అంటే మీకు మిమ్మల్ని నవ్వించే వారే ఆప్త మిత్రులుగా ఉండాలి. అప్పుడే మీరు జీవితాన్ని పూర్తిస్థాయిలో జీవించి, లోపల ఆనందాన్ని పొందుతారు. నవ్వుల విస్ఫోటనం మీ జీవితంలో ఒక సాధారణ లక్షణంగా మారుతుంది. ఇది మిమ్మల్ని మాత్రమే కాకుండా చుట్టుపక్కల ప్రజలను సంతోషంగా ఉంచుతుంది.
ప్రపంచవ్యాప్తంగా చాలా మంది కలలు కంటారు. ఏదేమైనా, వారి కలలో వారు చూడగలిగేదాన్ని ఎవరూ నియంత్రించలేరు. ఎందుకంటే ఇది నిద్రావస్థలో జరుగుతుంది. డ్రీం పరిశోధకులు చెబుతున్న మాటల ప్రకారం, మిమ్మల్ని మీరు నవ్వడం చూడటం గురించి కలలుకంటున్నది మంచి సంకేతం! ఉదాహరణకు, మీ కలలో నవ్వడం మీ వ్యక్తిత్వానికి విస్తరణ కావచ్చు. కల్లో కూడా విరక్తిగా నవ్వే వారు ఉంటారు. పాపం వారికి సుఖాలు దూరమవుతున్నాయన్న మాట. నవ్వడం మన మానసిక స్థితిని మెరుగుపరుస్తుందనడంలో సందేహం లేదు. ఒత్తిడిని తగ్గిస్తుంది. నవ్వడం అనేది శారీరక ప్రతిస్పందన, ఇందులో కనీసం పదిహేను ముఖ కండరాలు, శ్వాసకోశ వ్యవస్థ, మెదడు యొక్క లింబిక్ వ్యవస్థ మరియు కొన్నిసార్లు లాక్రిమల్ గ్రంథులు పనిచేస్తాయి. నవ్వడం అనేక శరీర ప్రక్రియలను సానుకూలంగా ప్రభావితం చేస్తుందని, కార్డియాక్ అరెస్ట్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని, ప్రతిరోధకాల ఉత్పత్తికి మద్దతు ఇస్తుందని మరియు మరెన్నో మంచి లక్షణాలు ఉన్నాయని శాస్త్రీయంగా నిరూపించబడింది.
Also Read: వివాహ వ్యవస్ధ పయనం ఎటు?
నవ్వు వల్ల మన లింబిక్ వ్యవస్థలో భయం, ఆకలి వంటివి దరిచేరవు! నవ్వు అనేది ప్రాథమిక భావోద్వేగాలను మరియు ప్రతిచర్యలను గుర్తిస్తుంది! ఇది నవ్వును కూడా ప్రభావితం చేస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు! మనం నవ్వినప్పుడు, మనకు సరదాగా కనిపించే ఎన్నో భావోద్వేగాలను వ్యక్తపరుస్తామట అది ఆరోగ్యానికి అనుకూల లక్షణం! మనం కొన్ని పరిస్థితులను ఫన్నీగా ఎందుకు చూస్తాము? అప్పుడే మన ముఖంలో చిరునవ్వు వస్తుంది. మనస్తత్వవేత్తలు దాని గురించి భిన్నమైన సిద్ధాంతాలను చెబుతారు.. ఎప్పుడు ఏడ్చేవాడికి ఇలాంటి ఫన్నీ ఇన్సిడెంట్స్ ప్రకృతి ఇచ్చే వరం. అంటే నవ్వలేని వాడుకుడా ఒక సంఘటన నవ్వు తెప్పిస్తుంది అన్న మాట! హాస్యం ద్వారా నవ్వు తెప్పించే ప్రక్రియ తాత్కాలిక నవ్వే!! నిజానికి అన్ని పాజిటివ్ గా చూడడానికి నవ్వే మనకు ఆయుధం కావాలి. ఆధిపత్యం యొక్క సిద్ధాంతం ప్రకారం ఇతరుల తప్పులు మనల్ని నవ్విస్తాయట, ఎందుకంటే మనం పరిస్థితిని ప్రభావితం చేయలేము కానీ నవ్వు వల్ల ఏదో ఒక విషయంలో విఫలమైన వ్యక్తి కంటే మనం ఉన్నతంగా ఉండాలి అంటే నవ్వాలి. ఫన్నీ హోమ్ వీడియోలు చూసేటప్పుడు నవ్వడం ఇందుకు ఉత్తమ ఉదాహరణ. ఇక ఉపశమన సిద్ధాంతం ప్రకారం నవ్వు ఒత్తిడిని తగ్గిస్తుంది, మనసుకు ఉపశమనం కలిగించేలా చేస్తుంది.. సాధారణంగా ఒత్తిడితో కూడిన పరిస్థితిని చక్కగా ఎదుర్కోవడంలో నవ్వు సహాయపడుతుంది. అందుకే నవ్వడం భోగం. నవ్వించడం యోగం. నవ్వక పోవడం ఒక రోగం అన్నారు ఒక కవి!
Super sir, you are hundred percent correctly said.I fully agree with you..I follow always joking with family friends even in office while on job.That makes job atmosphere easier healthier to work…Thanks for writing such articles.
మంచి మెసేజ్ ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరూ యేదో ఒక ఆందోళన తో జీవితం గడుపుతున్నారు ఈ మెసేజ్ వల్ల కొంతవరకు సంతోషాన్ని కలిగిస్తోంది