Sunday, January 5, 2025

సీతమ్మను చూసినట్టు శ్రీరామునికి తెలిపిన హనుమ

రామాయణమ్162

తన పాదములపై దీనముగా  వ్రాలిన దధిముఖుని చూసి సుగ్రీవుడు ‘‘ఏమి జరిగినది ఎందులకు నాపాదములపై వ్రాలినావు’’ అని అడిగినాడు.

అప్పుడు అంగదుడు, హనుమంతుడు తదితర వానరులొనరించిన మధువన విధ్వంసము గురించి  అడ్డువచ్చిన తమను బెదిరించి తన్నిన వైనాన్ని పూసగుచ్చినట్లు వివరించాడు.

అది వినడముతోడనే సుగ్రీవుని ముఖము విచ్చుకొని లక్ష్మణునితో ‘‘ఓ మహాబాహూ, సీతమ్మ జాడతెలిసినది’’ అని అమితానందముగా పలికినాడు.

Also read: ‘సీతమ్మను చూశాను,’ జాంబవంత, అంగదాదులతో హనుమ

‘‘అవును. ఇది సత్యము. సీతమ్మ జాడతెలియకున్న వారందరూ అచట చేరి మధుభక్షణము చేయరు.

‘‘నీవు శీఘ్రమే వెళ్ళి నా ఆజ్ఞగా చెప్పి వారిని వెంటనే ఇటకు పంపు. వారు చేసిన వన విధ్వంసమును నేను క్షమించినాను’’ అని దధిముఖునితో సుగ్రీవుడు పలికినాడు.

రామ, లక్ష్మణ, సుగ్రీవుల అనుజ్ఞ తీసుకొని దధిముఖుడు మధువనమునకు తిరిగి వచ్చెను.

సుగ్రీవాజ్ఞను వారికి ఎరిగించగా వానరులందరూ వెంటనే పయనమయ్యి సుగ్రీవుని సమక్షములో నిలిచినారు.

Also read: హనుమ పునరాగమనం

వారిని చూడగనే వాలము ఎత్తి సంతోషముతో సుగ్రీవుడు నిలుచున్నాడు.

అప్పుడు హనుమంతుడు ,

‘‘శ్రీరామా, సీతాదేవి కనపడినది. ఆమె పాతివ్రత్యమును కాపాడుకొనుచూ ఆరోగ్యముగా ఉన్నది’’ అని రామచంద్రునికి విన్నవించెను.

ఆ వాక్కులు శ్రీరామహృదయమునకు అమృతపు జల్లులవలె చేరెను.

Also read: లంకాదహనం

అటుపిమ్మట జరిగిన విషయములన్నీ విన్నవించి, కాకాసుర వృత్తాంతము కూడా రామునికి తెలిపి సీతమ్మ ఇచ్చిన చూడామణిని భద్రముగా రామునకు అందించినాడు హనుమంతుడు.

ఆ మణిని చూడగనే ఆయన హృదయము కరిగి కన్నీరై జలజల ప్రవహించెను.

‘‘సీతామాత సందేహములు ‌తీర్చి ఆమెకు ధైర్యము కలిగించినాను. ఆమె హృదయములో శాంతిని పొందినది’’  అని హనుమంతుడు సవినయముగా రామునికి తెలియచేసినాడు.

Also read: హనుమ తోకకు నిప్పంటించి వీధులలో తిప్పుట

(సుందరకాండ సమాప్తము)

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles