నవయుగ వైతాళికుడు
గిడుగు సాంగంత్యంతో
తెలుగు భాషకు
వ్యవహారిక సొగసులద్దినవాడు
ఆంగ్ల సాహిత్య పోకడలను ఆపోసన పట్టి
రాయప్రోలు తోడుగా
తెలుగు కవితను
వినూత్న బాటలు పట్టించినవాడు
ఆత్మ న్యూనతకు లోనుకాకుండా
పరాయి మంచిని అందుకోవడం చూపినవాడు
తెలుగు కవితా కన్య ఛందో బంధాల చెర విడిపించి
ముత్యాల సరాలు అలంకరించిన ఆధునికుడు
దేశానికి, తెలుగు భాషకు గట్టి మేల్ తలపెట్టిన వాడు
దేశమంటే ఎల్లలు కాదని నేర్పిన వాడు
సమాజం గురించి అహరహం తపించినవాడు
స్మరణీయుడు
అభినందనీయుడు
వందనీయుడు
మన గురజాడ
అతని అడుగు జాడలే
మనకు తోడు నీడ.
(సెప్టెంబర్ 21, గురజాడ జయంతి సందర్భంగా)
Also read: రాముడు
Also read: పురుషోత్తముడు
Also read: ఆడపిల్ల
Also read: అర్ధనారీశ్వరం
Also read: కవితోత్సవం