ఘాటు లేని గుంటూరు
కారానికి మూటల మాంత్రికుడి
తడబాటు!
ఇక్కడ మార్క్స్, లెనిన్ లు విలన్లే
అవును వాళ్ళ కి పాన్ ఇండియా
అనే క్షుద్ర ప్రయోగాలు తెలియవు కదా!
వాపు చూసి బలుపు అనుకునే
జూదగాళ్ళకి చరిత్ర ఎందుకు?
బీడి తోనే మన జేబు కి
పెద్ద బొక్క పెట్టే టక్కు టమార
విద్యలెన్నో తెలుసు
అజ్ఞాతం లోకి వెళ్ళవలిసిన వాడు
త్రి విక్రముడుగా తిరిగొస్తే
రివ్యూలు తిరగ రాయిస్తాడు
డిజాస్టర్ కి బ్లాక్ బస్టర్ పూత పూస్తాడు.
మీడియా కి తన వాయస్ ఓవర్ ఇస్తాడు.
ఇక పై సినిమాలన్నీ సంక్రాంతి కే విడుదల
ఎర వేసిన గాలానికి
చిక్కుకున్న చేపలన్నీ విల విల!
వీరేశ్వర రావు మూల ©
Also read: మన్ కి బాత్
Also read: మణిపూర్