Sunday, December 22, 2024

ఏ. పి.లో మొదలైన ‘గ్రీన్ పాలిటిక్స్’

జాన్ సన్ చోరగుడి

ఏదైనా ఒక పని జరుగుతున్నదీ అంటే, అది అందరికీ ఒకేలా అర్ధం కావాలి అనేమీ ‘రూలు’ ఏమీ ఉండదు. ఎవరికి తోచినట్టుగా లేదా ఎవరికి అర్ధం అయినట్టుగా వారు దాని గురించి మాట్లాడతారు. ఇదేమీ కొత్త విషయం కాదు. అయితే, తమ మాటకు- చెలామణి ఉన్న వాళ్ళు కొద్దిమంది ఉంటారు. వాళ్ళను ‘ఒపీనియన్ లీడర్స్’ అంటుంటారు. వాళ్ళు ‘పబ్లిక్’ను లక్ష్యంగా చేసుకుని ప్రతి అంశం మీద వాళ్ళ వద్ద వున్న సమాచారానికి తమ వ్యాఖ్యానం కూడా జోడించి మాట్లాడుతూ ఉంటారు. అయితే, ‘పబ్లిక్ లోకివస్తే, ఏమైనాఅంటాం’ అనే సూత్రం మేరకు; వాళ్ళు ఎప్పుడు ఏమి మాట్లాడుతున్నారు, ఎవరికోసం మాట్లాడుతున్నారు? అనేఆరా వాళ్ళ మీద కూడా ఉంటుంది.

Also read: ‘ఇండో-ఫసిఫిక్’ అనివార్యతతోనైనా ఏపీ పట్ల ఢిల్లీ వైఖరి మారేనా?

పెద్ద సమస్య

అలాగని, ఆరా ఉన్నంత మాత్రాన వాళ్ళు చేస్తున్న పని మానమని కాదు. ఏదో ఒక ప్రయోజనం లేకుండా పని పెట్టుకుని ఎవ్వరూ ఏదీ చేయరు కనుక, అదెటూ ఉంటుంది. అలాగని, ప్రయోజనాలను అన్ని సార్లు-  ‘క్యాష్&కైండ్’గా కూడా చూడాలని లేదు. అయితే, మన పనిని ఇతరులు పరిశీలించే క్రమంలో, కొన్నాళ్ళకు మనం ఏమిటో అవతల వాళ్ళకు అర్ధం కావడం మొదలవుతుంది. అలా చూసి చూసి జనం వీళ్ళను- ‘అవుట్ డేటెడ్ స్టఫ్’ అనుకుంటే, అనుమానం లేదు, మనం- ‘మార్జిన్స్’ లోకి వచ్చినట్టు లెక్క.

మారుతున్నకాలంతో పాటుగా తమ ఆలోచనా ధోరణిలో, ఒక నిరంతరత (కంటిన్యుటీ)  కొనసాగించడం, చాలా మందికి ఇప్పుడు పెద్ద సమస్య అయిపోయింది. దేశానికి స్వాత్యంత్రం వచ్చి 75 ఏళ్ళు అయ్యే క్రమంలో, తమ చూపు ఎక్కడ ఆగిపోయిందో, అక్కణ్ణించే వారు వర్తమానాన్ని, భవిష్యత్తును చూస్తూ వ్యాఖ్యానిస్తూ  కూడా, ఇంకా తాము- ‘లైవ్ స్ట్రీమ్’లో ఉండాలి అని అనుకోవడం అత్యాశ అనేది వీళ్లకు అర్ధం కావడం లేదు!

Also read: యూనివర్సిటీ పేరులో- ‘నేముంది’?

ప్రేరేపణ

ఎందుకు ఈ మాట అనడం అంటే, మొన్నఆగస్టు 15 ఆంగ్ల పత్రికల్లో 75 ఏళ్ళ స్వాత్యంత్రం సందర్భంగా ప్రత్యేక వ్యాసాలు రాసిన జాతీయ స్థాయి లబ్ధప్రతిష్టులైన ‘కాలమిస్టు’ల వ్యాసాల్లో ‘కామన్’గా అనిపించిన అంశం- ‘ఫెడరలిజం’. లోతైన తమ అధ్యయనంలో అందుకు వారికి ప్రేరేపణగా అనిపించినవి – ‘మండల్’ అంశం కావొచ్చు లేదా దాని తర్వాత వచ్చిన ఆర్ధిక సంస్కరణలు కావొచ్చు. మనవద్ద 90 దశకం తర్వాత ఈ రెండింటిని ఒక్కటిగా, కార్యాచరణకు  అనువుగా కలిపి ‘కాయిన్’ చేసిన పదమే- ‘సోషియో-ఎకనమిక్’.

అందుకు కొనసాగింపుగా వచ్చిందే- ‘ఇంక్లూజివ్ గ్రోత్’. దానికి ఒక ‘అకడమిక్’ నేపధ్యమిచ్చి, అందుకు అవసరమైన పాలసీ  రీసెర్చి కొనసాగడం కోసం 2008 నాటికి దేశ వ్యాప్తంగా యూనివర్సిటీల సోషల్ సైన్స్ స్కూళ్ళో – Centre for the Study of Social Exclusion & Inclusive Policy సరికొత్త ‘కరిక్యులం’గా మొదలయింది. కాలంతో పాటుగా వచ్చే ఏ మార్పును అయినా ప్రజాస్వామ్యంలో దాన్ని అంగీకరించి, అమలులోకి తీసుకుని రావలిసింది రాజ్యాంగ పరిధిలోనే కనుక, అందుకు ‘రాజ్యం’ ఉపాంగాలు అయిన- ‘ఎగ్జిక్యూటివ్’, ‘జ్యుడీషియరీ’, చూపుతున్న చొరవను, తమ మనుగడ కోసం అన్యమనస్కంగా అయినా అంగీకరించక తప్పని పరిస్థితి -‘లెజిస్లేటివ్’ది.

ఫోర్త్ ఎస్టేట్ చేతిలో ఆయుధం కెమెరా

కాలం చెల్లిన కథనం

అంత మాత్రాన అన్ని సార్లు అది అలాగే ఉండదు. ‘లెజిస్లేటివ్ తన రాజకీయ దృష్టి నుంచి తీసుకునే చొరవతో మిగతా రెండింటినీ ఒప్పించే సందర్భాలు కూడా ఉంటాయి. అటువంటి వాటిని- ‘ప్రోయాక్టివ్’ ప్రభుత్వాలుగా చూస్తాము. అయితే, ఈ చట్రంలో- ‘ఫోర్త్ఎస్టేట్’గా పిలవబడే ‘ప్రెస్’ ఎంత మేర అది ఈ మార్పు ఎరుకతో ‘అప్డేట్’ అవుతున్నది అనే సందేహం ఇక్కడ చర్చ అవుతున్నది. అలా కాలేనప్పుడు మనం అందించేది – ‘అవుట్డేటెడ్ స్టఫ్’ (కాలంచెల్లినకథనం) అవుతుంది.

Also read: దక్షిణాదిన ఏ. పి. ‘పోస్ట్-మండల్’ రాష్ట్రం కానుందా?

తొంభై దశకం రెండవ భాగంలో ఆర్ధిక సంస్కరణలను అతి వేగంగా అమలు చేసిన రాష్ట్రంఆంధ్రప్రదేశ్. అయితే 2004 తర్వాత వాటిని కొనసాగిస్తూనే, అప్పటి వరకు నిర్లక్ష్యం చేయబడిన రంగాలను గుర్తించి, 2004 తర్వాత కొంత మేర వాటిని సంస్కరించడం జరిగింది. ఇక్కడికి  వచ్చినప్పుడు దీన్నేనాటి ప్రధాని డా.మన్మోహన్ సింగ్- ‘రిఫార్మ్స్ విత్ హ్యూమన్ ఫేస్’ అనేవారు. అయితే, విభజనతో రాష్ట్రం ‘మ్యాప్’ మారిన తర్వాత, చేయవలసిన తదుపరి మార్పులు జరగలేదు. ఆ దశలో-‘కొత్త చూపు’ తో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 

గ్రీన్ పొలిటిక్స్ అవసరం

బుల్డోజింగ్

ఈ ‘కొత్తచూపు’- ఇది, పాత నిర్మాణాలను కూల్చివేసి, వాటి శిధిలాలతో (డెబ్రీ) అప్పటి వరకు నిర్లక్ష్యం చేయబడ్డ పల్లాలను పూడ్చడానికి సర్దుబాటు చేసే ప్రక్రియ. ఇక్కడ పాక్షిక దృష్టి ఉండదు.

Also read: ‘అభివృద్ధి’ పట్ల తెలుగు సమాజం వైఖరి ఎటువంటిది?

ఇందులో  బాధితులు  తన పర ఎవరైనా ఒక్క్కటే! గతంలో జరిగిన ‘బుల్డోజింగ్’ అది ఒక రకమైతే, ఇది మరొక రకం. దీన్ని- ‘ఎకో-సోషలిజం’ లేదా ‘గ్రీన్-సోషలిజం’ అంటున్నారు. ప్రపంచీకరణ ఒక దశ పూర్తి అయ్యాక, వచ్చేతదుపరి దశ సహజంగానే- alter-globalization or anti-globalization అవుతుంది. ఇటువంటి రాజకీయాలను- ‘గ్రీన్ పాలిటిక్స్’ అంటున్నారు. కొందరు వీటిని ‘రెడ్-గ్రీన్ పాలిటిక్స్’ అని కూడా అంటున్నారు.

ఈ రంగంలో  నిపుణులు చెబుతున్నది ఇలా ఉంది- ‘Eco-socialists generally believe that the expansion of the capitalist system is the cause of social exclusion, poverty, war and environmental degradation through globalization and imperialism, under the supervision of repressive states and transnational structures’.

Eco-socialists advocate for the succession of capitalism by Eco-socialism an egalitarian economic/political/social structure designed to harmonize human society with non-human ecology and to fulfil  human needs – as the only sufficient solution to the present-day ecological crisis, and hence the only path towards sustainability. 

Eco-socialists advocate dismantling capitalism, focusing on common ownership of the means of production by freely associated producers, and restoring the commons.

జవాబులు కోసం

ఏకశిలా సదృశ్యంగా ఉంటూనే పలు దొంతర్లు మయమయిన- ‘క్యాపిటలిజం’ ధ్వంసం చేయబడే ప్రక్రియలో (dismantling capitalism) ప్రభుత్వం ‘వికేంద్రీకరణ’ అంటున్నది ఎందుకో చూడగలిగితే, మన సందేహాలకు చాలావరకు జవాబులు దొరుకుతాయి. ఇటువంటి దృష్టి మాత్రమే- ‘only path towards sustainability’ అంటూ నిపుణులు చెబుతున్న అంతిమ నిర్ధారణ. ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం అక్టోబర్లో జిల్లాకలెక్టర్ల పనితీరుకు UNDP చెబుతున్న నికరమైన అభివృద్ధి లక్ష్యాలు (Sustainable Development Goals) ప్రామాణికం అనడం చూస్తున్నప్పుడు, ఈ ప్రభుత్వం తాను ఎంచుకున్న దారిలో తాను ఉంది తప్ప, మన సోషల్ మీడియాలో వస్తున్న నిపుణుల విశ్లేషణలను అది పట్టించుకుంటున్నట్టుగా కనిపించదు. 

Also read: మోడీ-జగన్ లను దాటి మరీ చూడగలిగితే…

(రచయిత అభివృద్ధి-సామాజిక అంశాల వ్యాఖ్యాత)

Johnson Choragudi
Johnson Choragudi
సామాజిక - అభివృద్ధి అంశాల వ్యాఖ్యాత

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles