భగవద్గీత – 67
మన కళ్ళముందు నాగరికత ఎంతో అభివృద్ధి చెందింది. ఒహ్ ఎన్ని ఆకాశహర్మ్యాలు, ఎన్ని వాహనశ్రేణులు, ఎన్ని మెట్రో రైలువ్యవస్థలు, ఎన్నో వేల కిలోమీటర్ల రైల్వేలైనులు, విమానాలు, ఓడలు, కమ్యూనికేషన్ సౌకర్యాలు, ఎన్నోవాహనాలు అవి నడపడానికి ఎన్నో కోటానుకోట్ల లీటర్ల ఇంధనం. అబ్బ! మానవుడు తన జీవనాన్ని సుఖవంతం చేసుకున్నాడు కదా!
ఆ(ఆ) ఒక్క క్షణం ఆగండి!
లేచిన ప్రతి బిల్డింగ్ ఒక కొండను నాశనం చేసింది. భూమిని డొల్ల చేసింది. ఎట్లా అంటారా? సిమెంటుకోసం కొండనుండి సున్నపురాయి తవ్వాలికదా. స్లాబులకోసం ఇనుము భూమినుండి తవ్వి తీసినదే కదా. అలాగే మనము తగలేస్తున్న ఆయిల్ భూమిపొరలలోనుండి బయటకు లాగినదే కదా?
Also read: భోగాలు రోగాలకు దారితీస్తాయి
విద్యుత్తుకోసం మండించే బొగ్గు భూమినిగీకి, డొల్లచేసి సాధించినదే కదా. మరి భూమిలోపల ఈ ఈ ఖాళీలన్నీ ఉంటే, అవి వత్తిడికి గురిఅయ్యి adjust చేసుకోవడానికి భూకంపాలు వచ్చి భూమి కుంగిపోయి, మన నాగరికత అంతా ఒక్కసారిగా కూలిపోదా? పెనువిలయానికి మన వినిమయ సంస్కృతి దారితీయడం లేదా?
ఈ విలయాలు పుడతవి. కాలం ఒక పెద్ద గణితశాస్త్రవేత్త. దాని లెక్కలు దానికుంటాయి. అయితే ఎప్పుడు ఏ లెక్క వేస్తుందో ఎవరికీ తెలియదు.
Also read: విషయాలపై ఆసక్తి పతన హేతువు
అందుకే కదా పరమాత్మ అన్నది.
కాలోస్మి లోకక్షయకృత్ప్రవృద్ధో లోకాన్సమాహర్తుమిహ ప్రవృత్తః
ఋతేపిత్వాం న భవిష్యన్తి సర్వే యేవస్థితాః ప్రత్యనీకేషు యోధాః
కాలుడను నేను. లోకాలు నావలన క్షయమవుతూ ఉంటాయి. వృద్ధిపొందుతూ ఉంటాయి. నేను లోకములన్నింటిని తుదముట్టించుటకై విజృంభించిన మహాకాలుడను. ఇప్పుడు ఈ లోకములను రూపుమాపుటకై పూనుకొనియున్నాను. కనుక నీవు యుద్దముచేయకున్ననూ, ప్రతిపక్షముననున్న ఈ వీరులెవ్వరును మిగులరు. అయితే ఏమిటి?
అత్యాశకు పోయిన ధృతరాష్ట్ర సంతతిలాగ నాశనంకాక మునుపే మనిషి మేలుకోవాలి. ఆ పరమాత్మ లయకారకుడిగా క్షయానికి ముందే పూనుకోకుండా ఉండాలంటే… వనరులను అవసరాలకే వినియోగించుకోవాలి. కానీ ఆడంబరాలకు, అక్కరలేని సౌకర్యాలకు వాడటం మానేయాలి.
Also read: నరకంలో ప్రవేశించేందుకు మూడు ద్వారాలు