Thursday, December 26, 2024

గ్రేటర్ ఎన్నికలు: రిజర్వేషన్ల వివరాలు

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఎన్నికల సందడి మొదలైంది. ఈ నేపథ్యంలో డివిజన్ల వారీ రిజర్వేషన్లను ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఎస్టీ జనరల్ కేటగరి

ఎస్టీ జనరల్ కేటగిరీకి ఫలక్ నుమా, ఎస్టీ మహిళా కేటగిరీకి హస్తినాపురాన్ని ఎంపిక చేశారు.

ఎస్సీ జనరల్ కేటగరి

ఎస్సీ జనరల్ కేటగిరీలో కాప్రా, మీర్ పేట్ హెచ్ బీ కాలనీ, జియాగూడ, మచ్చ బొల్లారం, వెంకటాపురం లను కేటాయించారు.

ఎస్సీ మహిళా కేటగిరి

ఎస్సీ మహిళా కేటగిరీలో  రాజేంద్ర నగర్, కవాడిగూడ, అడ్డకట్ట, మెట్టుగూడ, బన్సీలాల్ పేటలను కేటాయించారు.

బీసీ జనరల్ కేటగిరి

బీసీ జనరల్ కేటగిరీలో చర్లపల్లి, సిఖ్ చవాని, సంతోష్ నగర్, చాంద్రాయణ గుట్ట, షాలిబండ, గోషా మహల్, పురానా పూల్, దూద్ బౌలి, రామనాస్ పురా, కిషన్ బాగ్, శాస్త్రిపురం, దత్తాత్రేయ నగర్, కార్వాన్, నానాల్ నగర్, మెహదీపట్నం, గుడి మల్కాపూర్, అంబర్ పేట్, బోలక్ పూర్, బోరబండ, రామచంద్రాపూర్, పటాన్ చెరువు, గాజుల రామారం, జగద్గిరిగుట్ట, రంగారెడ్డి నగర్ లను ఎంపిక చేశారు.

బీసీ మహిళా కేటగిరి

బీసీ మహిళల విభాగంలో రామాంతపూర్, ఓల్డ్ మలక్ పేట, తలాబ్ చన్ చలం, గౌలిపురా, కుర్మగూడ, కాంచన్ బాగ్, బర్కాస్, నవాబ్ సాహెబ్ కుంట, ఘన్సీ బజార్, సులేమాన్ నగర్, అత్తాపూర్, మంగళ్ హాట్, గోల్కోండ, టోలిచౌకి, ఆసిఫ్ నగర్, విజయ నగర్ కాలనీ, అహ్మద్ నగర్, మల్లే పల్లి, రెడ్ హిల్స్, గోల్నాక, ముషీరాబాద్, ఎర్రగడ్డ, చింతల్, బౌద్ధనగర్, రాంగోపాల్ పేటలను కేటాయించారు.

జనరల్ మహిళా కేటగిరి

జనరల్ మహిళా కేటగిరీలో ఏఎస్ రావు నగర్, నాచారం, చిలకా నగర్, హబ్సిగూడ, ఉప్పల్, నాగోల్, సరూర్ నగర్, రామకృష్ణా పురం, సైదాబాద్, మూసారం బాగ్, అజం పురా, ఐఎస్ సదన్, లంగర్ హౌస్, గన్ ఫౌండ్రి, హిమాయత్ నగర్, కాచిగూడ, నల్లకుంట, బాగ్ అంబర్ పేట్, అడిక్ మెట్, గాంధీ నగర్, ఖైరతాబాద్, వెంకటేశ్వర కాలనీ, సోమాజిగూడ, సనత్ నగర్, హఫీజ్ పేట, చందా నగర్, భారతి నగర్, బాలాజీ నగర్, అల్లాపూర్, వివేకానంద నగర్ కాలనీ, సుభాష్ నగర్, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, ఆల్వాల్, నేరేడ్ మెట్, వినాయక నగర్, మౌలాలి, గౌతం నగర్, తార్నాక, సీతాఫల్ మండి, బేగం పేట్, మోండా మార్కెట్ లను కేటాయించారు.

జనరల్ కేటగిరీ

జనరల్ కేటగిరిలో మల్లాపూర్, మన్సూరాబాద్, హయత్ నగర్, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, హస్తినాపురం, చంపాపేట్, లింగోజి గూడ, కొత్తపేట, చైతన్యపురి, గడ్డి అన్నారం, అక్బర్ బాగ్, డబీర్ పుర, రెయిన్ బజార్, పత్తర్ గట్టి, లలిత్ బాగ్, రియాసత్ నగర్, ఉప్పుగూడ, జంగంపేట్, బేగం బజార్, మైలార్ దేవ్ పల్లి, జాంబాగ్, రాం నగర్, బంజారా హిల్స్, షేక్ పేట్, జూబ్లీ హిల్స్, యూసఫ్ గూడ, వెంగళరావు నగర్, రహమత్ నగర్, కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి,  మాదాపూర్, మియాపూర్, కేపీహెచ్ బీ కాలనీ, మూసాపేట్, ఫతేనగర్, ఓల్డ్ బోయిన్ పల్లి, బాలా నగర్, కుకట్ పల్లి, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ, సూరారం, ఈస్ట్ ఆనంద్ బాగ్, మల్కాజ్ గిరి లను కేటాయించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles