Thursday, November 21, 2024

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త

  • 91,142 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల సిఎం కేసీఆర్
  • అసెంబ్లీలో వివరాలు వెల్లడించిన ముఖ్యమంత్రి
  • అటెండర్ నుంచి ఆర్ డీవో దాకా అన్ని పోస్టుల భర్తీ

ముఖ్యమంత్రి కేసీఆర్  నిరుద్యోగులకు తీపికబురు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా   91,142 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నట్లు కేసీఆర్ అసెంబ్లీలో  ప్రకటించారు. నేటి నుంచే నోటిఫికేషన్లు వెలువడుతాయని కేసీఆర్ చేప్పారు.. తెలంగాణలో 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ చేస్తున్నట్లు దాంతోపాటు విద్యాశాఖలో 25 నుంచి 30 వేల వరకు పోస్టులు, కొత్త జిల్లాలు, జోన్ల ప్రకారం ఉద్యోగాల భర్తీ చేస్తామని కేసీఆర్ తెలిపారు.ముఖ్యమంత్రి కేసీఆర్ బధవారం  వనపర్తిలో ప్రసంగిస్తూ నేడు అసెంబ్లీలో నిరుద్యోగుల కు తీపికబురునే అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌త్య‌క్ష నియామ‌క ఖాళీలు 91,142 ఉండ‌గా, ఇందులో 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల‌ను క్ర‌మ‌బద్దీక‌ర‌ణ చేయ‌గా, మిగిలిన 80,039 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్లు నేటి నుంచే వెలువ‌డుతాయ‌ని సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదిక‌గా ప్ర‌క‌టించారు. ఇక నుంచి ప్ర‌తి ఏడాది జాబ్ క్యాలెండ‌ర్ సిద్ధం చేస్తామ‌ని చేప్పారు. తద్వారా నోటిఫికేష‌న్లు జారీ చేసి ఉద్యోగాల భ‌ర్తీ చేప‌డుతామ‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. నీళ్లు, నిధులు, నియామ‌కాల నినాదంతో ఏర్ప‌డిన తెలంగాణ రాష్ట్రం.. ఒక్కొక్క‌టిగా సాకారం చేసుకుంటూ వెళ్తోంది. భారీ ప్రాజెక్టుల‌తో ఇప్ప‌టికే రాష్ట్రంలోని ప్ర‌తి ఎక‌రాకు సాగునీరందించి తెలంగాణ‌ను స‌స్య‌శ్యామ‌లం చేసింది టీఆర్ఎస్ ప్ర‌భుత్వం. కేసీఆర్ మాన‌స పుత్రిక అయిన మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కంతో ప్ర‌తి ఇంటికి సుర‌క్షిత‌మైన తాగునీరును అందించారు. ప్ర‌భుత్వానికి వివిధ మార్గాల్లో స‌మ‌కూరుతున్న ఆదాయ వ‌న‌రుల‌ను స‌బ్బండ వ‌ర్గాల అభివృద్ధికి ఖ‌ర్చు చేస్తున్నారు. అంతే కాకుండా ఏడేండ్ల‌లోనే అభివృద్ధిలో దేశానికి ఆద‌ర్శంగా నిలిచి, త‌ల‌స‌రి ఆదాయంలో నంబ‌ర్‌వ‌న్‌గా నిలిచింది.

ఇప్ప‌టికే వివిధ శాఖ‌ల్లో ల‌క్ష‌కు పైగా ఉద్యోగ నియామ‌కాలు చేప‌ట్టిన తెలంగాణ ప్ర‌భుత్వం.. నేడు భారీ సంఖ్య‌లో ఉద్యోగాల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న చేసింది. 80,039 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్లు వెలువ‌డ‌నున్న‌ట్లు సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. ఈ రోజు నుంచే నోటిఫికేష‌న్లు వెలువ‌డుతాయ‌ని సీఎం ప్ర‌క‌టించారుతెలంగాణ ప‌రిధిలోని అన్ని యూనివర్సిటీల్లో 2,020 బోధన పోస్టులను, 2,774 బోధనేతర పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో మొత్తం ప్రత్యక్ష నియామక ఖాళీలు 91,142 ఉన్నాయని తేలింది. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పోగా రాష్ట్రంలోని నేరుగా నియామకం చేయాల్సిన ఖాళీల సంఖ్య 80,039 ఉన్నట్లు తేలిందని సీఎం తెలిపారు.ఈ పోస్టుల భర్తీని వెంటనే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందనే శుభవార్తను రాష్ట్ర యువతకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను అని సీఎం కేసీఆర్ తెలిపారు.

అదనపు భారం  వేల కోట్లు

ఈ భర్తీ ప్రక్రియ వల్ల ఏటా సుమారు రూ. 7,000 కోట్ల అదనపు భారం రాష్ట్ర ఖజానాపై పడుతుంది. అయినా కూడా ప్రభుత్వం ఈ సాహసోపేత నిర్ణయాన్ని తీసుకుంది. ఇక నుంచి ఖాళీలను ముందే గుర్తించి, ప్రతీ సంవత్సరం ఉద్యోగాల భర్తీ క్యాలెండర్‌ను ప్రకటించి, పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని విభాగాలు తమ వద్ద ప్రతీ సంవత్సరం ఏర్పడే ఖాళీల వివరాలు సిద్ధం చేస్తాయి. నోటిఫికేషన్ల జారీ కోసం ఆయా నియామక సంస్థలకు సమాచారం ఇస్తాయి. ఉద్యోగార్థులు అన్ని నియామక పరీక్షల్లో పోటీ పడేందుకు వీలుగా మధ్యలో తగిన వ్యవధి ఇస్తూ నోటిఫికేషన్లను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింద‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. నిరుద్యోగులకు సీఎం కేసీఆర్‌ శుభవార్త అందించారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 80,039 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ చేపడుతున్నామని శాసనసభలో ప్రకటించారు. ఇందులో గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-3, గ్రూప్‌-4 పోస్టులతోపాటు జిల్లాలు, జోనల్‌, మల్టీజోనల్‌, సెక్రటేరియట్‌, హెచ్‌ఓడీలు, వర్సిటీల్లోని పోస్టులను భర్తీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ చెప్పారు. వీటిలో జిల్లాల్లో మొత్తం 39,829 పోస్టులు ఉన్నాయి.

ఖాళీల వివరాలు ఇవి:

రాష్ట్రంలో గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-3, గ్రూప్‌-4 పోస్టులను భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. గ్రూప్‌ల వారీగా ఖాళీల వివరాలు..

గ్రూప్‌ 1- 503 ఉద్యోగాలు

గ్రూప్‌ 2- 582 ఉద్యోగాలు

గ్రూప్‌ 3 – 1,373 ఉద్యోగాలు

గ్రూప్‌ 4- 9168 పోస్టులు

క్యాడర్ వారీగా ఖాళీలు సంఖ్యలు

జిల్లాల్లాలో- 39,829

జోన్లలో- 18,866

మల్టీజోనల్‌ పోస్టులు- 13,170

సచివాలయం,హెచ్ఓడీలు, విశ్వవిద్యాలయాల్లో- 8,147

జిల్లాల వారీగా ఖాళీలు సంఖ్యలు

హైదరాబాద్ – 5,268

నిజామాబాద్- 1,976

మేడ్చల్ మల్కాజ్‌గిరి- 1,769

రంగారెడ్డి- 1,561

కరీంనగర్- 1,465

నల్లగొండ- 1,398

కామారెడ్డి- 1,340

ఖమ్మం- 1,340

భద్రాద్రి కొత్తగూడెం- 1,316

నాగర్‌కర్నూల్- 1,257

సంగారెడ్డి- 1,243

మహబూబ్‌నగర్- 1,213

ఆదిలాబాద్- 1,193

సిద్దిపేట- 1,178

మహబూబాబాద్- 1,172

హనుమకొండ- 1,157

మెదక్- 1,149

జగిత్యాల- 1,063

మంచిర్యాల- 1,025

యాదాద్రి భువనగిరి- 1,010

జయశంకర్ భూపాలపల్లి- 918

నిర్మల్- 876

వరంగల్- 842

కుమ్రం భీం ఆసీఫాబాద్- 825

పెద్దపల్లి- 800

జనగాం- 760

నారాయణపేట్- 741

వికారాబాద్- 738

సూర్యాపేట- 719

ములుగు- 696

జోగులాంబ గద్వాల- 662

రాజన్న సిరిసిల్లా- 601

వనపర్తి- 556

జోన్లు, మల్టీ జోన్లవారీగా ఖాళీల వివారాలు

జోన్‌లలో18,866 ఖాళీలు, మల్టీ జోన్‌లలో 13,170 పోస్టులు ఖాళీగా ఉన్నాయని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఇందులో జోన్లు, మల్టీ జోన్లవారీగా ఖాళీల వివరాలు..

7 జోన్లు లో ఖాళీల సంఖ్యా

కాళేశ్వరం జోన్‌లో- 1,630

బాసర జోన్‌- 2,328

రాజన్న జోన్‌- 2,403

భద్రాద్రి జోన్‌- 2,858

యాదాద్రి జోన్‌- 2,160

చార్మినార్ జోన్‌- 5,297

జోగులాంబ జోన్‌- 2,190

మల్టీజోన్లు సంఖ్యా

మల్టీజోన్ 1- 6,800

మల్టీజోన్ 2- 6,370

రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో 80,039 ఖాళీలు వివారాలు

హోం శాఖ- 18,334

సెకండరీ ఎడ్యుకేషన్- 13,086

హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్- 12,755

హయ్యర్ ఎడ్యుకేషన్- 7,878

బీసీల సంక్షేమం- 4,311

రెవెన్యూ శాఖ- 3,560

ఎస్సీ వెల్ఫేర్‌ శాఖ- 2,879

నీటిపారుదల శాఖ- 2,692

ఎస్టీ వెల్ఫేర్- 2,399

మైనారిటీస్ వెల్ఫేర్- 1,825

ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ మరియు టెక్నాలజీ- 1,598

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ- 1,455

లేబర్, ఎంప్లాయీమెంట్- 1,221

ఆర్థిక శాఖ- 1,146

మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్- 895

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్- 859

అగ్రికల్చర్, కో-ఆపరేషన్- 801

రవాణా, రోడ్లు, భవనాల శాఖ- 563

న్యాయశాఖ- 386

పశుపోషణ, మత్స్య విభాగం- 353

జనరల్ అడ్మినిస్ట్రేషన్- 343

ఇండస్ట్రీస్, కామర్స్- 233

యూత్, టూరిజం, కల్చర్- 184

ప్లానింగ్- 136

ఫుడ్, సివిల్ సప్లయిస్- 106

లెజిస్లేచర్- 25

ఎనర్జీ- 16

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles