Thursday, November 21, 2024

తొలితరం మేటి సంపాదకుడు ఆచార్య

మహమ్మద్ గౌస్

జర్నలిస్టు కలానికి పదునుండాలి కానీ ప్రజా సమస్యలను నివేదించడానికి చిన్నపెద్ద పత్రికలనే తారతమ్యం ఉండదని చాటిచెప్పారు ఎమ్మెస్ ఆచార్య. తెలంగాణ మొదటి దినపత్రిక జనధర్మకు, మొదటి ప్రాంతీయ దినపత్రిక వరంగల్ వాణికి పురుడుపోసి ఓరుగల్లులో పత్రికా రచన కు, సాహితీవేత్తలకు పెద్ద దిక్కుగా నిలిచారు.

….

ఎం.ఎస్.ఆచార్య 1924, అక్టోబర్ 3వ తేదీన అమ్మమ్మ గారి గ్రామం సూర్యాపేటలో జన్మించాడు. వారి తండ్రి గారు  ప్రసన్న రాఘవాచార్య ఉభయ వేదాంత పండితుడు. అతడు నెల్లికుదురు గ్రామంలో వైద్యం చేసేవాడు. నెల్లికుదురులోని మదరసతహానియాలో నాలుగో తరగతి వరకు ఉర్దూమీడియంలో చదువుకున్న ఆయన  తన తండ్రి వద్దనే బాలరామాయణం, ధాతుమంజరి, రఘువంశం, కుమార సంభవం మొదలైనవి నేర్చుకున్నారు.

ఉద్యోగం….

ఎం.ఎస్. ఆచార్య గారి అన్న గారు  వెంకటనర్సింహాచార్యులు హిందూస్తానీ సంగీతం నేర్పిస్తూ ఆ డబ్బులతో కుటుంబాన్ని ఆదుకునేవాడు. ఎం.ఎస్. ఆచార్య కూడా చదువుకు స్వస్తిచెప్పి అప్పటి ప్రముఖ డాక్టర్ లక్ష్మణ్‌సా పవార్ వద్ద నెలకు రూ.12 వేతనానికి కాంపౌండర్‌గా ఉద్యోగంలో చేరాడు. అలాగే ఓ ముడిసిల్క్ వ్యాపారి వద్ద రూ.15 వేతనానికి పనిచేశారు.

కుటుంబం…..

ఎం.ఎస్.ఆచార్య గారి  సతీమణి రంగనాయకమ్మ గారు వారికి  ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు  ఎం.రామానుజాచార్య కాకతీయ విశ్వవిద్యాలయంలో ఆంగ్ల విభాగంలో ఆచార్యుడిగా పనిచేసి పదవీవిరమణ చేశారు. రెండవ కుమారుడు మాడభూషి శ్రీధర్ నల్సార్ యూనివర్శిటీలో ప్రొఫెసర్‌, కేంద్ర సమాచార కమిషనర్‌ గా తమ పదవీకాలం పూర్తి చేశారు. ప్రస్తుతం మహీంద్రా విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ లా డీన్‌గా పనిచేస్తున్నారు.

• జర్నలిస్టుగా….

1942లో ఓసారి ఓ దుకాణం ముందు ఒక  వ్యక్తి, మరో వ్యక్తిని చితకబాదడాన్ని చూసి చలించిపోయిన ఆచార్య ఆ సంఘటనను వార్తగా రాసి సికింద్రాబాద్ నుంచి వెలువడుతున్న తెలంగాణ పత్రికకు పంపారు. తర్వాత 1947 జనవరి 1న ఆంధ్రపత్రిక ఏజెన్సీ తీసుకున్నారు. 1948లో అదే పత్రికకు విలేకరిగా చేరి 32 ఏళ్లపాటు పనిచేశారు. తెలుగు మాట్లాడితే నేరంగా పరిణించే నిజాం పాలనలో తెలుగు పత్రికకు వార్తలు రాసే విలేకరిగా పనిచేసారు. అప్పుడు ఆంధ్రపత్రికే ఉద్యమానికి ఊపిరి. ఉద్యమ వార్తలున్న ఆ పత్రికను రహస్యంగా పంచిపెట్టేవారు. అదే ఆయన ఉద్యమం, అదే ఉద్యోగం కూడా. రజాకార్ల దౌర్జన్యాలకు భయపడి వరంగల్లు వదిలి వందలాది కుటుంబాలు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతే జనం లేని వీధుల్లో కందిలీ ఒక చేత లాఠీ మరొక చేత పట్టుకుని ప్రతాపరుద్ర దళం కార్యకర్తగా కాపలా కాసిన సాహసి. వావిలాల గోపాలకృష్ణయ్య తెనాలిలో స్వాతంత్ర్యానికి పూర్వం నిర్వహించిన జర్నలిజం శిక్షణాశిబిరంలో పాల్గొని పాత్రికేయ వృత్తి మెలకువలు నేర్చుకున్నాడు.

……

 పి.వి. నరసింహారావు, పాములపర్తి సదాశివరావు తదితరులు ప్రారంభించిన కాకతీయ పత్రికతో పాటు చిత్రవిచిత్ర మాసపత్రిక, ప్రగతి పత్రికలకు కూడా ఆచార్య వార్తలు వ్రాసేవారు. 1958లో జనధర్మ వారపత్రికను స్థాపించారు. 1971లో స్వంత ముద్రణాలయం బాలాజీ ప్రెస్‌ను నెలకొల్పారు. 1988లో వరంగల్ వాణి అనే దినపత్రికను ప్రారంభించారు. జనధర్మను 36 సంవత్సరాల పాటు, వరంగల్ వాణిని 13 సంవత్సరాల పాటు అనేక వ్యయప్రయాసలకోర్చి నడిపారు.

తెలంగాణ సాహిత్యానికి, సాంస్కతిక వారసత్వానికి సముచిత గౌరవ ప్రాభవాలను కల్పించడానికి ఈ పత్రికల ద్వారా వేదికను ఏర్పరచాడు. సామాజిక సమస్యలను చర్చించడానికి పరిశోధనాత్మక వార్తాంశాలను గుప్పించడానికి, సమకాలీన సంకర విలువలను ఎండగట్టడానికి ఈ పత్రికలు ఎంతో ఉపయోగపడినాయి. వ్యవస్థాగత సమస్యల వల్ల 1993లో వరంగల్‌వాణి దినపత్రికను అమ్మేశాడు.

….

జనధర్మను దినపత్రికను తిరిగి ప్రారంభించాలని ప్రయత్నిస్తున్న సమయంలో 1994 జూలై 12న గుండెపోటుతో మరణించారు. జనధర్మ, వరంగల్‌వాణి పత్రికల ద్వారా ఎందరో సహితీ వేత్తలు, టంకశాల అశోక్ వంటి గొప్ప జర్నలిస్టులు పరిచయమయ్యారు.

అక్షరయోధునికి అక్షర నివాళి…..

ఆయన ఆయుధం కలం.  తెలుగు మాట్లాడితే నేరంగా పరిణించే నిజాం పాలనలో తెలుగు పత్రికకు వార్తలు రాసే విలేకరిగా పనిచేసినాడు. అప్పుడు ఆంధ్రపత్రికే ఉద్యమానికి ఊపిరి. ఉద్యమ వార్తలున్న ఆ పత్రికను రహస్యంగా పంచిపెట్టే వాడు. అదే ఆయన ఉద్యమం ఉద్యోగం కూడా. రజాకార్ల దౌర్జన్యాలకు భయపడి వరంగల్లు వదిలి వందలాది కుటుంబాలు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతే జనం లేని వీధుల్లో కందిలీ ఒక చేత లాఠీ మరొక చేత పట్టుకుని ప్రతాపరుద్ర దళం కార్యకర్తగా కాపలా కాసిన సాహసి. నెల్లికుదురు గ్రామం లో తండ్రి ప్రసన్న రాఘవాచార్య దగ్గరికి వైద్యం కోసం వచ్చిన అజాత విప్తవ వీరుడు దేవులపల్లి వెంక జీవితం తనకు స్ఫూర్తి అని చెప్పేవారు.

ఏం.ఎస్.ఆచార్య గారి  90వ జయంత్యుత్సవం….

2014 లోఎం.ఎస్.ఆచార్య గారి  90వ జయంత్యుత్సవం…”తెలంగాణ  రచయితల వేదిక” (తే.ర.వే)  ఆధ్వర్యంలో హన్మకొండ కిషన్‌పురలోని వాగ్దేవి కళాశాలలో ఎంఎస్ ఆచార్య 90వ జయంత్యుత్సవాన్ని నిర్వహించారు. ఆచార్య బన్న అయిలయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విశ్రాంత ఆచార్యులు కోవెల సుప్రసన్నాచార్య, ఆచార్య ఎం. రాజగోపాలాచార్య, అంపశయ్యనవీన్, సీనియర్ పాత్రికేయులు దాసరి కృష్ణారెడ్డి, వెలుదండి రమేష్, జిల్లా వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ అధ్యక్షుడు  పిన్నాశివకుమార్ పాల్గొన్నారు.

మరణం…

వావిలాల గోపాల కృష్ణయ్య తెనాలిలో స్వాతంవూత్యానికి పూర్వం నిర్వహించిన జర్నలిజం శిక్షణా శిబిరం లో పాత్రికేయ వృత్తి మెలకువలునేర్చుకున్నారాయన. ఆయన ఆరంభించిన అక్షర సంగ్రామమే ఆచార్య చేత ఆ తరువాత జనధర్మ వారపవూతిక ప్రారంభింపజేసింది. ముప్ఫై ఏళ్ల తరువాత వరంగల్ వాణి దినపవూతిక ప్రచురణ మొదలు పెట్టారు.పత్రికా నిర్వహణలో స్ఫూర్తిప్రదాతగా చరిత్రలో నిలిచిపోయిన ఎం.ఎస్.ఆచార్య తన 71వ యేట జులై 12, 1994న మరణించారు. అక్షర యోధునికి అక్షర నివాళి!

(“వరంగల్ వాణి” “జనధర్మ’ పత్రికల సంపాదకుడు, ఎం.ఎస్.ఆచార్య (మాడభూషి శ్రీనివాసాచార్య) గారి 95 వ స్మృతి దినం)

ఎంఎస్ ఆచార్య చిత్రం

మూడు దశాబ్దం పేయింట్ చేసిన ఎం ఎస్ ఆచార్య చిత్రం

మాడభూషి శ్రీధర్

(రవివర్మ స్టూడియో యజమాని, ప్రముఖ ఫోటోగ్రాఫర్ బిట్ల నారాయణ గారు, ఆర్టిస్ట్)

ఈ రోజు ఎం ఎస్ఆచార్య 29వ వర్ధంతి

మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయిన ఈ రోజు మా అందరినీ ఏడిపించిన రోజు. 1994 జూలై 12.

29 ఏళ్లయింది. ప్రముఖ జర్నలిస్టు, స్వాతంత్ర్యసమరయోధుడు, వరంగల్ వాణి, జనధర్మ పత్రికలను ప్రచురించిన ఎం ఎస్ ఆచార్య, 29 సంవత్సరాలుగా ఉన్న మా అమ్మగారు 2023 జనవరి 28న, మమ్మల్ని కాలధర్మం చెంది పరమపదానికి వెళ్లారు. నేను ఇద్దరికీ రెండో కుమారుడిని.

అయితే ఈ చిత్రం వెనుక చాలా గొప్ప చిత్రం ఉంది.

1988లో ప్రముఖ పోటోగ్రఫీ రవివర్మ చిత్రం గీసారు.

అయితే రవివర్మ పేరుతో స్టూడియో నడిపే బిట్ల నారాయణ గారు ఎం ఎస్ ఆచార్య ప్రేమ కలిగిన మిత్రుడు.

రవివర్మ పేరుతో ప్రతివారం ఒక అడ్వర్టజ్మెంట్ ఇచ్చేవారు. మొదటి పేజీలో జనధర్మ అనే పేరు పక్కనే రవివర్మ అని ఉండేది.

హటాత్తుగా ఆ పేజీనుంచి తీసేసి చివరి పేజీమీద రవివర్మ పెట్టారు. బిట్ల నారాయణ గారు బాధపడ్డారు. వెంటనే నాన్నగారు ఎం ఎస్ ఆచార్య తో ప్రశ్నించారు. 

నాన్నగారి జవాబు వినండి.

అవునయ్యా, పక్కన జనధర్మ దాని పక్కన రవివర్మ అంటే బాగుండదనిపించింది అంతే మరే కారణమూ కాదు అన్నారు. అక్కడున్నవారంతా పెద్దగా నవ్వుకున్నారు. ఇదో కథ.         

మరొక కథ వివరిస్తా  వినండి.

బిట్ల గారు నాన్న ప్రేమతో ఒక చిత్రం ఫ్రేమ్ పెట్టి నాన్న చిత్రాన్ని పెయింటింగ్ చేస్తూ ఉండేవారు.

అది వరంగల్లు లో మూడో అంతస్తు పైన తాను మాత్రమే సమయం దొరికిన సమయంలో పేయింటింగ్ ఒక్కో భాగం తయారు చేసేవారు. ఎన్నేళ్లు పట్టిందో తెలుసా? మానాన్నగారి వయసు 30 సంవత్సరాల మధ్యలో మొదలు పెట్టి, నాన్నగారి షష్టి పూర్తి అంటే 60 ఏళ్ల వయసులో కూడా పూర్తి చేయలేదు.

ఓసారి నేను బిట్లగారి ఇంటికి వచ్చి మూడో అంతస్తులో నాకు చూపారు ఈ పేయింట్ చూసి ఆశ్చర్యపోయాను. అద్భుతంగా ఉంది

కాని అందులో కళ్ల బొమ్మ పూర్తి చేయలేదు.

‘‘సార్ ఇదేమిటి?’’ అన్నాను.

‘‘మరేం చేయను? చాలా బాగ పెయింట్ చేయాలని ఎదురు చూస్తున్నాను’’ అని అన్నారు.

‘‘సార్ 60 ఏళ్ల సందర్భాన వచ్చే సన్మానం నాటికి దయచేసి ఇవ్వండి సార్’’ అని వెంట పడ్డాను.

ఆ పెయింటింగ్ పూర్తి చేసి సన్మానంలో అంటే 1988న సమర్పించారు.

అద్భుతం ఇది.

నేను వరంగల్లు పెద్దలందరినీ అడిగి అదొక్కటే తీసుకున్నాను.

అదే ఇది.

కళ్లు చెమ్మరిల్లిపోయాయి కదూ?

ఇదీ నాన్నగారి కథ.

ఎప్పుడూ తనకోసం ఏమీ అడిగేవారు కాదు.

అద్భుతమైన వ్యక్తిత్వం కదా!

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles