- వరి సాగుపై తెలంగాణ ప్రభుత్వవిధాన ప్రకటన
- యాసంగిలో వరి సాగు చేయవద్దు
- యాసంగిలో ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయ్యదు
- విత్తన వడ్లు సాగు చేసే రైతులు, మిల్లర్లతో ఒప్పందం చేసుకునే రైతులు నిరభ్యంతరంగా వరి సాగు చేసుకోవచ్చు
- ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్న ఆశతో మాత్రం రైతులు వరి సాగు చేయవద్దు
- వరికి ప్రత్యామ్నాయంగా రైతులు ఇతర పంటలను సాగు చేసుకోవాలి
- వానాకాలంలో వండ్లను ప్రభుత్వం కొంటుంది.
వరి సాగు విషయంలో ప్రభుత్వం విధాన ప్రకటన చేసింది. యాసంగిలో ఎట్టిపరిస్థిలో ఒక్క వరి గింజ కొనదని స్పష్టం చేసింది. సీడ్ కంపెనీ, విత్తన కంపెనీలతో ఒడంబడిక ఉంటే వేసుకోవచ్చిని తెలిపింది. మిల్లర్లతో నేరుగా అమ్మే సంప్రదాయం ఉన్నా వేసుకోవచ్చిన ప్రభుత్వం చెప్పింది. ప్రభుత్వం కొంటుందని ఆశించి మాత్రం వరి సాగు చేయ్యసై యాసంగిలో వరిని ప్రభుత్వం కొనదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమాలకర్ స్పష్ట చేశారు. అయితే, ఈ వానా కాలంలో వరి సాగుకు ఇబ్బంది లేదన్నారు. యాసంగిలో వరి బదులు ప్రత్యమ్నాయ పంటలు వేసుకోవాలని రైతులకు సూచించారు.
వరిసాగు విషయంలో తెలంగాణ ప్రభుత్వం ముందుకే వెడుతోంది. యాసంగిలో వరి సాగు చేయవద్దుని మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమాలకార్ తెలిపారు. యాసంగిలో వరి వేసి ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్న ఆశతో మాత్రం రైతులు వరి సాగుచేసుకుంటే ఒక్క గింజకూడా ప్రభుత్వం కొనదని తెలిపారు. వర్షకాలంలో ఎఫ్ సీ ఐ కొనకున్నా తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. దొడ్డు వడ్లయినా, సన్నరకాలయినా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. యాసంగి వరి కొనుగోళ్ల విషయంలో కేంద్రప్రభుత్వం నానా యాగీ చేస్తుందిని విమర్శంచారు. కేంద్రం చేతగానితనాన్ని రాష్ట్రాల మీద నెట్టివేస్తుందని అరోపించారు. యాసంగిలో నూక శాతం ఎక్కువ ఉంటుందని నూక లేని వరి వంగడాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామన్నారు. ఇక యాసంగి సాగును ఒక నెల ముందుకు జరుపుకోవాలని సూచించారు. రైతులపట్ల తమ చిత్తశుద్దిని ఎవరూ శంకించలేరని. ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు మనసుతో వ్యవసాయరంగాన్ని తీర్చిదిద్దారని తెలిపారు. వారి కృషి ఫలితమే తెలంగాణలో దిగుబడి అవుతున్న పంటలు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో ఒక కోటి 41 లక్షల ఎకరాలలో వివిధరకాల పంటలు సాగయ్యాయని, 62 లక్షల 8 వేల ఎకరాలలో ఈ వానాకాలంలో వరి సాగు నమోదయిందన్నారు. నాలుగైదు నెలలుగా వరి సాగులో ఇబ్బందులను రైతుల దృష్టికి తీసుకెళ్లి చైతన్యం చేస్తున్నామని తెలిపారు.
రైతులను రెచ్చగొట్టి లబ్ది పొందానలి విపక్షాల అరాటం-నిరంజన్ రెడ్డి
విపక్షాలు రైతులను రెచ్చగొట్టి రాజకీయం లబ్ది కోసం ప్రయత్నిస్తున్నాయని అరోపించారు నిరంజన్ రెడ్డి. రైతాంగం విపక్షాల చేతులలో పావులుగా మారవద్దుని సూచించారు. ఈ వానాకాలం పత్తి సాగు చేయాలని రైతులకు విజ్ఞప్తి చేశామని, కానీ అనుకున్నంతగా రైతాంగం పత్తి సాగు చేయలేదన్నారు. ఈ రోజు మద్దతుధరకు మించి మూడు వేలు ఎక్కువకు పత్తి అమ్మకం జరుగుతోందని, సీసీఐ మద్దతుధరకు మించి ఎక్కువ ధర లభిస్తున్నదని గుర్తు చేశారు.
కోటి ఎకరాలలో పత్తి సాగు చేసినా రైతులకు మద్దతుధర దక్కుతుందని అన్నారు. తెలంగాణ పత్తికి అంతర్జాతీయ డిమాండ్ ఉందని చేప్పారు. గత ఏడాది కేంద్రం మాట ఇచ్చిన నేపథ్యంలో తీసుకున్న ధాన్యంలో 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇంకా తెలంగాణ ప్రభుత్వం వద్ద మూలుగుతున్నదని, ఇది కేంద్రం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. దేశంలో పంటల కొనుగోళ్ల విషయంలో వారికి ఒక విధానం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం చెప్పేది అబద్దమైతే యాసంగి కొనుగోళ్లు చేస్తామని బీజేపీ ప్రజాప్రతినిధులు కేంద్రం నుండి లిఖితపూర్వక హామీ తీసుకురావాలి సవాల్ చేశారు. భారత ఆహారరంగాన్ని కార్పోరేట్లు, ప్రైవేటుపరం చేసే కుట్రలో భాగంగా కేంద్రం కొనుగోళ్ల బాధ్యత నుండి తప్పుకుంటున్నదికామారెడ్డిలో రైతు మరణం దురదృష్టకరమన్నారు.
ఒక్క కిలో కూడా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు రాలేదు – గంగుల కమలాకర్
రాష్ట్రంలో 6570 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. సూర్యాపేట జిల్లాలో 256 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఒక్క కిలో కూడా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు రాలేదన్నారు. రాష్ట్రంలో 6570 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
ఇప్పటివరకు 2.36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందనీ, ప్రైవేటు మిల్లర్ల వద్ద టోకెన్ సిస్టం ఉన్నాయనీ, అది సూర్యాపేట, నల్లగొండ జిల్లాలకు పరిమితమనీ తెలిపారు.