కలియుగ దైవం వేంకటేశ్వరుడు
తిరుమల మీద ఉంటూ వడ్డీలు కట్టుకుంటున్నాడు
కలియుగం కదా
ఆ దేవుడికీ తప్పలేదు తిప్పలు.
అడ్డ నామాల వాళ్ళు
నిలువు నామాల వాళ్ళు
నామాల్లేనివాళ్ళు
అందరూ వచ్చి డబ్బులు హుండీలో వేస్తారు.
సవాలక్ష కోరికల జాబితా చదువుతారు
గుండు గీయించి పాపాలన్నీ పోయాయoటారు.
మరిన్ని కొత్త పాపాలు చేయడానికి
దేవుడి కళ్ళు తిరునామాలతో మూసేసి
తిరిగి వచ్చేస్తారు జనానికి పంగనామాలు పెట్టడానికి
వీళ్ళను చూదలేకే తన నామాలు
చెరపకుండా ఉంచేసుకున్నాడు
ఆ అలుమేలుమంగ పతి.
గోవిందా గోవింద.
Also read: “వలస పక్షులు”